• Blog
  • HOME
  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • సంప్రదించండి
  • హోం
  • కథ
    • కథలు
    • అనువాద కథలు
  • కవిత
    • పద్యాలు
    • కవితలు
  • నవల
    • సీరియల్స్
    • నవలలు
  • వ్యాసం
    • వ్యాసాలు
    • సమీక్షలు
  • సృజన పథం
    • కథలు
    • కవితలు
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
No Result
View All Result
  • హోం
  • కథ
    • కథలు
    • అనువాద కథలు
  • కవిత
    • పద్యాలు
    • కవితలు
  • నవల
    • సీరియల్స్
    • నవలలు
  • వ్యాసం
    • వ్యాసాలు
    • సమీక్షలు
  • సృజన పథం
    • కథలు
    • కవితలు
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
No Result
View All Result
No Result
View All Result

చమించేయండి

ఎడిటర్ by ఎడిటర్
March 16, 2021
in కథలు
0
చమించేయండి

‘‘సాములందరికీ దండాలు.
మీరందరూ గొప్పోల్లు. గొప్ప గొప్ప ఇసయాలే మాట్టాడతా వుంటారు. మీబోటోల్లకి నా బాద రవ్వంత చెప్పుకోవాలని నా ఆశ.
మారాయలసీమలో రతనాలు రాసులుబోసి అమ్మినారని అంటాంటారు గదా! అమ్మినారో లేదో ఎవురికిదెల్సు? మీరు జూడ్లేదు గదా. కానీ మీరంటారు. అదేంది సాములా- అంటే, మీరు సదూకున్న పుస్తకాలలో ఉండాదంటారు. కానీ నేనన్ను. పుస్తకాలలో వుండేదంతా నిజమని నమ్మే మీబోటోల్లు ఎర్రిబాగులోల్లంటా! రతనాలు అమ్మినారంటే నేను మాత్తరమొప్పుకోను. నిజానికి ఆడ ఏముండాదో నాకు దెల్సు. రాల్లూరప్పలూ, కరువూ కాటకమూ, ఆకలీ ఏడ్పులూ, కచ్చలూ కార్పణ్యాలూ- అదంతా ఎందుకులెండి. సొల్లుకబుర్లూ, సోది కబుర్లూ జెప్పి యిసిగిస్తే చమించేయండి.
నేను కూలోడ్ని. నాకు దెల్సింది రెండే. కస్టం దెలుసు. అది మా కండ నిండా ఉంటాది. ఆకలిదెలుసు. అది మా కడుపు నిండా ఉంటాది. ఇంకొన్ని గూడా దెలుసు. కడుపు నిండనప్పుడు కోపంతో పెల్లాన్ని గొట్టడం దెలుసు. కడుపు నిండినప్పుడు సారాయి దాగడందెల్సు. అయితే తాగడానికో కండీషనుంది. కడుపు నిండినాక కాసులు మిగలాలన్న మాట. తాగినాక మళ్లీ పెళ్లాన్ని గొట్టడం తెల్సు. అది గొడ్డుగదా. మన సంపరదాయాలూ నీతులూ అదే పలుపుతాళ్లతో మన దొడ్లో గట్టేసిన గొడ్డు. మొత్తానికి నాకు పెళ్లాన్ని గొట్టడం మాత్రమే తెలుసునని మీలో ఎవురికయినా కోపమొస్తే చమించేయండి.
మాయి తప్పుడు బతుకులే. తాగుబోతు బతుకులే. కాని ఒక్కటి మాత్రం నిజం. అయ్యా, మేం డబ్బుతో ఒళ్లు బలుపెక్కి తాగడం మొదులుబెట్టలా. ఏ పేదోడి బుతకు ఎట్టా కుంగిపోయినా దానికో కతుంటాది. మేము ఎందుకిట్టయిపోయినామో, మీకు తెల్దుగదా. కొంచెం దయబెట్టి యినండి. కడుపులో చల్ల కదలకుండా అవ్వ కుక్కిమంచం కాడ గూసోని కతలింటానో, అరటితోట్లో దాగుడుమూతలాడుకుంటానో గడపాల్సిన కూనలుగా ఉండే వయసులోనే, కడుపు చేతిలోబట్టుకోని కూలిపనులకు బోతిమి. అప్పుడేం పెద్ద పనుండేది గాదు. కూలోల్లందరికీ నీల్లు మొయ్యడమో, అంగిడికిబొయ్యి రెడ్డికి, ఆయన లేనపుడు మేస్త్రీకి బీడీలు, సిగిరెట్లు సోడాలూ తెచ్చియ్యడమో – ఇదేపని. కాని మూతిమీద మగతనం పుట్టుకొచ్చే రోజులొచ్చేకాడికి అసలు కూలిపనంటే ఏందో తెలిసొచ్చింది. సద్దికూటేళకాడ్నించి సందేళ దాకా, వొంచిన్నడుమెత్తకుండా పన్జేస్తే మీక్కూడా దెలస్తాది. మంచమెక్కేకాడికి ఏకీలుకాకీలు ఇరిగిపోయినట్టండేది. ‘‘ఒల్లంతా నొప్పులుగుండాది రె డ్డా, రేపు పన్లోకి రానంటే’’, ‘‘ఓర్నీయవ్వ ఒల్లు నొప్పులని పని మానుకుంటావట్రా పిచ్చిముండాకొడకా, ఇదో ఈ రూపాయితో సారాయిదాగరా సిటికెలో బోత’’య్యని కూలికంటే రూపాయెక్కువిచ్చినాడు. అది మంచో చెడోదెల్సుకునే వయసుగాకపాయె. రోజుకూలీ రూపాయి బెరిగింది. ఆమందు కోసమేగదా అని అలవాటయిపోతిమి.
మెడకో గుదిబండ మాదిరి పెళ్లయింది. మొదట్లో అదిగూడా టౌనుకెల్లి కొత్త సినిమా జూసినంత మోజుగానే ఉండేది. కొంతకాలానికి పిలకాయలు కూడా బుట్టినాక, ఒక్క కూలితో మూడు కడుపులు నింపాల్సిన అవసరమొచ్చినాక, అసలు పెళ్లంటే ఎంత పెమాదమో తెలిసొచ్చింది. ఏంజేస్తాం? మన ఆలోచనలు ఆకులు బట్టుకోవాలనే కాడికే చేతులు కాలిపోయే ఉండాయి. ఇబ్బందులెన్నొచ్చినా, నొప్పులకు రెండో మందేదీ తెలీక అప్పుడప్పుడూ డబ్బు మిగిలినప్పుడు తాగతా తాగతా అదే అలవాటుతో బతకతా ఉంటిమి.
కానీ ఇప్పుడు రోజులెట్టయిపాయ…
ఎంత కస్టం జేస్తే అన్ని కాసులు రాల్తాయన్న రోజులు పాతబడిపాయె. రోజంతా కండ కరగదీసినా… పొయ్యి రగల్తాదన్న నమ్మకం లేకపాయ. దానికెవుడిది తప్పంటాము. కడుపుకి కూడుదింటే ఆ రైతుదీ తప్పనలేం. వాడు మాత్రమేంజేస్తాడు. బూమి వోడిదే, సగంబూమినో, పెళ్లాం పుస్తెల్నో, కుదవేసో అమ్మో ఆ బూమిని సాగుజేస్తే- అప్పుటికయినా అది పండితేగదా, గట్టిగా అడగదామంటే వాడికేం మిగిలిందని? ఉన్న సొమ్ములు గూడా రాలగొట్టుకోవడం తప్ప ఒకరకంగా మా బతుకునే మేలు. అమ్ముకోవడానికి మాదగ్గర అవేమీ లేవుకాబట్టి. కూలి లేనిరోజు కడుపు నిండదు. నమ్మి బియ్యం అప్పిచ్చే అయ్యలేడు. రేపటికయినా అప్పు దీర్చేంతటి కూలి డబ్బులు మా చేతికొస్తాయని ఎవుడూ నమ్మకపాయ. కానీ అప్పిచ్చే మారాజు ఇంకోడుండాడు. అయితే వోడిచ్చేది బియ్యంగాదు. సారాయి. ఆ మాదిరిగా అప్పుకాతా కింద డబ్బుల్లేనప్పుడూ, ఒకసారయినా డబ్బిచ్చి తాగకపోతే బాగుండదని ఉన్నప్పుడూ మొత్తానికి రోజూ తాగుడికి అలవాటయిపోతిమి. బార్లూ బ్రాందీలూ తప్ప నాటుసారా కొంపలెరగని మీ బాసలో బానిసలయిపోతిమి. చమించేయండి.
నేను దరిద్రపు ముండాకొడుకునే. కాని పొట్లాలుగాకుండా సీసాలు తాగుతున్నందుకు మీరందరూ పతివ్రతలూ పవిత్రులైపోతిరి. రాళ్లు పగిలే ఎండలో ఒక్కరోజు పనిజేసుంటే మీకు దెలస్తాది. ఒళ్లు మాగిపోతాది ఎండ పొరకతోగొట్టినట్లంటాది. నెత్తురంతా చెమటగా కారి యింకిపోతే – పొద్దుగుంకేకాడికి నరాల్లో సారాయి నింపేస్తే అలవాటయిన పేణానికి అదో ఇది. సరేమీకెందుకు? పగులంతా సల్లగా కార్లలో తిరిగితిరి. కాని సాయంకాలానికి బారుజేరిపోతిరి. అయినా నన్ను మీతో పోల్చుకోవడమేంది. గాడిదని గందర్వుడితోబోల్చినట్టు? మీలో ఎవురయినా వీడు మనల్నే గాడిదంటండాడని బుజాల్దడుంకుంటే చమించేయండి.
నేను తాగితే నస్టపోయింది నా పెండ్లాం. డబ్బుల్లేక కూటికోటా తగ్గిపోతే ఎముకలాగ ఎండిపొయ్యేదదే. పీకల్దాకా తాగి పక్కటెముకలిరిగేటట్లు గొడితే తినిగమ్మునుండిపోయేదీ అదే! దాని కడుపు మండేసరికి మీరు మీ పంటపండించుకొంటిరి. ‘‘నా మొగుడు తాగి సస్తాఉండాడు. సంపేస్తాఉండాడు’’ అని, అదీ దానిలాంటి మరో లచ్చలమందీ ఏడ్చితే దానికి మీరు రాజకీయ రంగు బూసి నానా రంకు బాగోతాలాడిరి. ఎట్టయితే ఏమాయె? కడాపటికి సారాయిన్నిలిపేస్తిరి. నిలిపించేస్తిరి. అయ్యలారా మీరు గొప్పోళ్లు. అయిదేళ్లకోమారు దప్పితే మా తలకాయను మీరు తల్చుకోరు. ఒక్కమాటజెప్తురా! మీ అమ్మా అబ్బలమీద పిల్లా పాపల మీదా పెమాణంజేసి చెప్తురా? సారాయిని నిలపడంకోసం కొట్లాడ్డం కాడనుంచి నిలిపేదాకా నికార్సుగా మీరీ పనిజేసినారా? పది రూపాయలు తీస్కోని ఓటేసిన కుక్కని నేను. పెశ్నిలడగడం తప్పంటారా. ఇంకోమారు చమించేయండి.
సారాయిని మీరే ఆపేస్తిరి. దొంగ సారాయిని కాపుసారాయని, కర్నాటక నించి, ఆడ్నించి, ఈడ్నించి వచ్చిన సారాయని జెప్పి మీరే అమ్మితిరి. ఇదే అదుననుకొని డబ్బుల పంట పండించుకొంటిరి. దిసమొలగా తిరిగే కాడ్నించీ చూస్తానే ఉండాం. మీసాలొచ్చిన కాడినించీ తాగతానే ఉండాం. ముసిల్దశలో ఆపేయమంటిరి. ఆపేస్తిమి.
కానీ మళ్లా మీరే అడ్డుకొంటిరి. కళ్ల ముందర సారాయిబెట్టి తాగొద్దంటే మేముండగలిగేదేనా?
లంజన్దీస్కొచ్చి పక్కన పండేసి… మీరు పెద్దోల్లు నేను బూతుముండావోడ్ని చమించేయండి. … కూడదంటే ఎట్టా కుదురుద్ది? కడాపటికి మేం తాగతానే ఉంటిమి. మా పెండ్లాల ఇన్నాళ్ల ఏడుపులూ ఏమయిపోయినట్లు? వాళ్ల ఉద్దెమాలూ, మీ రాజకీయాలకు బంటుల్లాగా పరుగెత్తడాలూ, మ పోలీసోళ్ల చేతిలో లాఠీదెబ్బలు తినడాలూ ఇవన్నీ ఏమయిపాయ? రూలయితే జేసినారు గాని సారాయిని మాత్రం ఆపలేక పోతిరి.
ఈడ సారాయమ్మతా ఉండారని మీకు తెల్దా? తప్పులు జేసేదీ మీరే, గొప్పోళ్లని పేరుగొట్టేసేదీ మీరే! ‘‘సాములారా యీడమ్మే దొంగసారాయి నుంచి రచ్చించండయ్యా’’ అంటే, అరె, అమ్మేది మాకు తెల్దే’’ అంటిరి. చాటుగా వచ్చి ‘‘ఉన్నపళాన సారాయి నిలిపేస్తే ఒక్కసారిగా చస్తావని కస్టపడి దొంగ సారాయి తెచ్చి అమ్మతావుంటే కంప్లయింటు జేస్తావట్రా- పో రూపాయి తక్కవకే కొనుక్కొని తాగుబో’’ అని సలహా జెప్పితిరి. మేం తాగి రోజూ కొంచెం కొంచెం చస్తాఉంటే మీకు తెలవదు! తెలవాలంటే ఏం జెయ్యాల? ఏంజెయ్యాలన్నదానికి నాకొకటి అన్పించింది.
ఇదో ఈ సేతిలో ఉండేదేంది – కాలీడబ్బా.
దీంట్లో ఉండే ఇండ్రీనేం జేసినానో మీకు తెలీదుగదా. ఆ దొంగసారా బానలో బోసినా. ఇప్పుటికెంత? పాతికమందికి పైగానే తాగితిమి. రేపు పొద్దుపొడిసేకాడికి మా బతుకులు తెల్లారిపోతాయి. పొద్దుగుంకే కాడికి పాడెల్లేసిపోతయి. పోనిండి. దేసానికేం నస్టం లేదుగదా. ఆ మాటకొస్తే మా పెళ్లాలకు మాత్రమొచ్చిన కస్టమేముండాది. తాడు తెగడమంటే తన్నుల్దినడం పర్మినెంటుగా తప్పినట్లేగదా!
అయ్యా సాములూ,
ఇన్నాళ్లూ కళ్ల ముందర జూస్తానే, ‘‘సారా అమ్మతండారా మాకు తెల్దే’’ అంటిరి. రేపు గవుర్మెంటు ఆసుపత్రిలో మా శవాల్ని నిలవనా గోస్తే ఎట్ట చచ్చినామో తెలీకుండాబోదుగదా. అయ్యా అప్పుటికయినా తెరుసుకునే మూసుకొనుండే మీకళ్లు తెరుసుకోకుండాబోతయ్యా అని నా ఆశ! తెరుసుకుంటే దేశంలో బతికి మిగిలినోళ్లన్నా హాయిగా ఉండగలుగుదురు.
ఈరోజు మేం జచ్చినంతమాత్రాన మీరొక్కసారిగా మనుషులుగా మారిపోయి ఉన్నపళంగా మమ్మల్ని ఉద్దరించేస్తారని నేననుకుంటాడానా, లే. మీరు కదిలిపొయినట్టు నటిస్తురు. రేపు ఇంకొక దగ్గిర ఇంకొందరు జస్తె మీ మనసులు కరిగిపొయినట్టు నటిస్తురు. ఇంకొందురుగూడా చచ్చినప్పుడు కన్నీళ్లు ఏర్లయిపొంగుతున్నట్లు మళ్లీ నటించజూస్తురు.
అయ్యా, ఇంతమంది ప్రజానీకంలో కొందురైనా మనుషులుంటారు మనసుండేవోళ్లు. ‘‘ఈళ్ల సావులకు సమాదానమేం’’దంటూ మీ చొక్కా పట్టుకోకపోతారా అని నా ఆశ. పిసరంత ఆశతో పాతికమందిని చంపేస్తండానెందుకంటారా? అయ్యా ఎంత పెద్ద అగ్గి గుండాం అంటుకొనాలన్నా – ఒక చిన్న నిప్పు కణిక కావాలిగదా! అదేదో నేనేగానియ్యగూడదా.
అయ్యా మీలో రెండురకాల మనుషులకి రెండురకాల కోపం రావచ్చు. యీ క్రూరాత్మప్ముండాకొడుకు ఇంతమందిని చంపేసినాడే అని కొందరనుకోవచ్చు – యీడెమ్మ కడుపుమాద మన నోటికాడికొచ్చిన ఇంతింత ఆదాయాన్ని ఈడిట్ట నడిమంత్రానే ఆపేస్తిడే అని కొందరు తిట్టుకోవచ్చు.
అయ్యా సాములూ,
నేను పాపినే ఒప్పుకుంటాండాను.
అందరూ నన్ను చమించేయండి’’
ఆదర్శిని
17-8-1994

ఎడిటర్

ముప్ఫయ్యేళ్ల జర్నలిజం, రచన రంగాల్లో అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.

Tags: chamincheyandik a muni suresh pillaitelugu short story
Previous Post

అ… యిష్టం

Next Post

బదిలీ

Next Post
బదిలీ

బదిలీ

Discussion about this post

ఈ సంచికలో…

  • ‘కాల్ యూ లేటర్’
  • అప్పులు పుట్టు తావు…
  • నన్ను నేనే కొట్టుకున్న చెంపదెబ్బ!
  • ‘న్యూస్ ఛానల్’ గొట్టాల మీద మట్టికొట్టిన కథ
  • భ్రమాలంకారం
  • వెంటవచ్చునది
  • అనాది – అనంతం
  • ఆ రకంగా ఒక్కటయ్యారు
  • బదిలీ
  • చమించేయండి

అభిప్రాయాలు

    ఈ నెల పత్రిక

    కేటగిరీలు

    • కథలు
    • కవితలు
    • పద్యాలు
    • వ్యాసాలు
    • సమీక్షలు

    ఇవి చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • కథ
      • కథలు
      • అనువాద కథలు
    • కవిత
      • పద్యాలు
      • కవితలు
    • నవల
      • సీరియల్స్
      • నవలలు
    • వ్యాసం
      • వ్యాసాలు
      • సమీక్షలు
    • సృజన పథం
      • కథలు
      • కవితలు
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • తెలుగువెలుగు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి

    Developed by : www.10gminds.com

    /div>