• Blog
  • HOME
  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • సంప్రదించండి
  • హోం
  • కథ
    • కథలు
    • అనువాద కథలు
  • కవిత
    • పద్యాలు
    • కవితలు
  • నవల
    • సీరియల్స్
    • నవలలు
  • వ్యాసం
    • వ్యాసాలు
    • సమీక్షలు
  • సృజన పథం
    • కథలు
    • కవితలు
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
No Result
View All Result
  • హోం
  • కథ
    • కథలు
    • అనువాద కథలు
  • కవిత
    • పద్యాలు
    • కవితలు
  • నవల
    • సీరియల్స్
    • నవలలు
  • వ్యాసం
    • వ్యాసాలు
    • సమీక్షలు
  • సృజన పథం
    • కథలు
    • కవితలు
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
No Result
View All Result
No Result
View All Result

‘కాల్ యూ లేటర్’

మిత్రులకు ఫోన్ కాల్ చేస్తాం. కాల్ కత్తిరింపబడి, చిటికెలో టింగుమని ఒక మెసేజీ వస్తుంది. అది మనలో రేకెత్తించే భావాలేంటి?

కె ఎ మునిసురేష్ పిళ్లె by కె ఎ మునిసురేష్ పిళ్లె
March 16, 2021
in కవితలు
0
call u later poem

కష్టమూ సుఖమూ
చిల్లర ఆనందాలూ
అంతకంటె చిల్లర తగాదాలూ
పంచుకోడానికి…
కాల కంటకాల్ని నరకడానికి…
బాల బంధాల్ని ముడిపెట్టడానికి…
ఎప్పుడో.. అప్పుడప్పుడో…
ఆవల- కార్యభంగం కాకూడని వేళల్ని
అనుభవ పంచాంగంలో గణించుకుని
మీట నొక్కుతాను.

మూడ్స్ చెడిపోవడం నాకూ నీకూ
కొత్తకాదు, మనిషై పుట్టినందుకు…
ఆ బాధల బూడిదల్లో ఒక జీవకణం
దేవులాడుదామనే… ప్రతీ ప్రయత్నం!
బరువు ఎక్కువైపోతే జతగా మోయడానికి..
ఉల్లాసం తరంగిస్తే.. ఓలలాడానికి..
తెరువు మరొకటున్నదని…
‘స్టాండ్ బై’ గుండె మరొకటుంటుందనీ…
సంకేతం ఇవ్వడానికి…
రింగుల్ని వింటూ నిరీక్షిస్తాను.

ఆప్త స్వర శ్రవణంలో..
ఇహం మరచిపోయే క్రమంలో..
నిరీక్షణ ఒక శోషణ!

నా చెవుల్లో మాత్రమే కాదు..
అవతల ‘రింగు’మన్నదో లేదో
ధ్రువపడకముందే…
లిప్తపాటులో వచ్చి పడిపోతుంది
ఇన్ బాక్సులోకి!
‘‘కాల్ యూ లేటర్’’

== ==
‘‘కాల్ యూ లేటర్’’
అదొక ఊరట…
స్మృతిలో ఉన్నావనే బాధాతప్త ఊరట!
అదొక సంతోషం…
కాసేపటి తర్వాతైనా మోగుతుందనే సంతోషం!
అదొక వగపు…
సగం కాను, స్వజనుణ్నీ కాకపోయానా అనే వగపు!
అదొక ద్వేషం…
ఈ పదబంధాన్ని అమ్ముల పొదిలో దాచుకుని,
బాణంలా ప్రయోగించే ధూర్తవాణిపై ద్వేషం!

ఆశను- చిలక్కొయ్యకు తగిలిస్తాను…
అంసతృప్త విశ్రాంతిలో
దిగ్ధాక్షతమైన సందిగ్ధంలోనే
అసంపూర్తిగానే సేదతీరుతాను!
ఆప్త స్వర శ్రవణాభిలాషియై…
రేప్పొద్దున- మళ్లీ తగిలించుకుంటాను.

మళ్లీ మీట నొక్కుతాను…
ఈసారీ అది రాదని తలుస్తాను…

.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె
9959488088

కె ఎ మునిసురేష్ పిళ్లె

మౌలికంగా జర్నలిస్టు. రచయిత. సుమారు ముప్ఫయ్యేళ్లుగా రాస్తున్నారు. తండ్రి ఎల్లయ్య స్థాపించిన ఆదర్శిని పత్రికతో రచనలు మొదలు పెట్టారు. రెండు కథా సంపుటులు ‘పూర్ణమూ.. నిరంతరమూ..’, ‘రాతి తయారీ’, ఒక నవల ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’ ప్రచురించారు.

whatsapp msg

sureshpillai.com
Tags: call busycall you laterk a muni suresh pillaisuresh pillaitelugu poem
Previous Post

అప్పులు పుట్టు తావు…

Discussion about this post

ఈ సంచికలో…

  • ‘కాల్ యూ లేటర్’
  • అప్పులు పుట్టు తావు…
  • నన్ను నేనే కొట్టుకున్న చెంపదెబ్బ!
  • ‘న్యూస్ ఛానల్’ గొట్టాల మీద మట్టికొట్టిన కథ
  • భ్రమాలంకారం
  • వెంటవచ్చునది
  • అనాది – అనంతం
  • ఆ రకంగా ఒక్కటయ్యారు
  • బదిలీ
  • చమించేయండి

అభిప్రాయాలు

    ఈ నెల పత్రిక

    కేటగిరీలు

    • కథలు
    • కవితలు
    • పద్యాలు
    • వ్యాసాలు
    • సమీక్షలు

    ఇవి చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • కథ
      • కథలు
      • అనువాద కథలు
    • కవిత
      • పద్యాలు
      • కవితలు
    • నవల
      • సీరియల్స్
      • నవలలు
    • వ్యాసం
      • వ్యాసాలు
      • సమీక్షలు
    • సృజన పథం
      • కథలు
      • కవితలు
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • తెలుగువెలుగు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి

    Developed by : www.10gminds.com