• Blog
  • HOME
  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • సంప్రదించండి
  • హోం
  • కథానిధి
    • కథానిధి పీడీఎఫ్
    • కథానిధి కథల సమీక్షలు
    • కథానిధి యూట్యూబ్ కథలు
    • కథానిధి యూట్యూబ్ సమీక్షలు
  • కథ
  • కవిత
  • నవల
    • సీరియల్స్
    • నవలలు
  • వ్యాసాలు
  • సమీక్షలు
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
No Result
View All Result
  • హోం
  • కథానిధి
    • కథానిధి పీడీఎఫ్
    • కథానిధి కథల సమీక్షలు
    • కథానిధి యూట్యూబ్ కథలు
    • కథానిధి యూట్యూబ్ సమీక్షలు
  • కథ
  • కవిత
  • నవల
    • సీరియల్స్
    • నవలలు
  • వ్యాసాలు
  • సమీక్షలు
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
No Result
View All Result
No Result
View All Result

నాట్ ఎ హేట్ స్టోరీ (ప్రసేన్) కథా సమీక్ష: పోతుల కృపాకర్

ఎడిటర్ by ఎడిటర్
August 18, 2026
in కథానిధి కథల సమీక్షలు, సమీక్షలు
0
నాట్ ఎ హేట్ స్టోరీ (ప్రసేన్) కథా సమీక్ష: పోతుల కృపాకర్

ఇద్దరు వివాహితుల మధ్య కలిగిన ఆకర్షణ, దాని పర్యవసానంగా వారిలో తలెత్తిన సంఘర్షణ (internal conflicts)… వీటి గురించిన కథ ఇది. విషయం కొత్తది కాకపోయినా, దాన్ని అందంగా, కవితాత్మకంగా తీర్చిదిద్దిన రచయితను అభినందించాల్సిందే. రెండు వివాహిత హృదయాల్లో మొలకెత్తిన ప్రేమకూ, రూఫ్‌టాప్ గార్డెన్‌లో నియంత్రిత వాతావరణంలో పెంచే మొక్కలకూ మధ్య పారలెల్స్ డ్రా చేసిన తీరు బాగుంది.

కథలో మలుపులూ లేవు. ఎపిఫనీ లేదు. ఒక బాగా నడిచిన బాటలోనే (a well trodden rut) సాగి, చివరికి మధ్యవయస్కులైన (ఇది నా ఊహ మాత్రమే) ప్రేమికులిద్దరూ శత్రువులుగా కాక, స్నేహితులుగా విడిపోవడంతో విడిపోవడంతో ముగుస్తుంది. ఆ విధంగా కథా శీర్షికను జస్టిఫై చెయ్యడం కూడా జరిగింది .

కాకపోతే కథలో సంభాషణలు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులైన స్త్రీ, పురుషుల మధ్య సహజంగా జరిగే సంభాషణల్లా కాకుండా, ఇద్దరు మేధావుల మధ్య జరిగిన చర్చల్లా బరువుగా అనిపించాయి. ఇద్దరు ప్రేమికుల మధ్య సంభాషణలు ఇంత శక్తివంతంగా, ఇంతటి మేధస్సుతో నిండినవిగా ఉండటం కొంచెం అసహజంగా, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది కథలో రీడబిలిటీని కొంత దెబ్బతీసినట్టు నాకనిపించింది.

అయితే దీనికంటే ముఖ్యమైన అభ్యంతరం మరొకటి ఉంది నాకు.

ప్రొటాగోనిస్టులిద్దరి మధ్యా ఒక ‘భావోద్వేగపరమైన సాన్నిహిత్యం కొరకు ఆరాటం’ (yearning for emotional connect)… దీనికి తగిన కారణం (trigger) కనబడలేదు కథలో.

ఒక పురుషుడికి గాని ఒక స్త్రీకి గాని జీవితభాగస్వామి నుంచి భావోద్వేగపరమైన తోడ్పాటు (emotional bonding) లభిస్తున్నంత వరకూ ఇంకొకరి దగ్గర దాని కొరకు వెతుకులాడాల్సిన అవసరం ఎందుకు కలుగుతుంది? అలా వెతుకులాడేవారి వైవాహిక జీవితంలో ఏదో ఒక అసంతృప్తి(emotional or physical vacuum) ఉండి తీరాలి… అన్నది నా అభిప్రాయం. అలా ఉన్నప్పుడే అలాంటి అన్వేషణకు అంకురార్పణ జరుగుతుందని కూడా నా నమ్మకం. అయితే, వారిలో అటువంటి లోటు ఉన్నట్టు establish చేసే ప్రయత్నం కనబడలేదీ కథలో. అంతేకాకుండా ప్రోటగోనిస్టుల జీవితభాగస్వాములు ఇద్దరూ, చాలా పరిణతి ఉన్న వ్యక్తుల్లానే చిత్రించబడ్డారు తప్ప, వేరే విధంగా కాదు.

వాళ్ల మధ్య ఆకర్షణ ఏర్పడిన తర్వాత దాన్ని గుర్తించడం, దాన్ని కొనసాగించడం అనారోగ్యకారకం అని తెలుసుకొని దాన్ని తుంచిపారెయ్యడం… దీన్ని రిజర్వాయర్‌ గేట్లు తెరవడం అనే ఇమేజ్/మెటాఫర్ ద్వారా వ్యక్తం చేయడం… ఇది ఇది ఈ కథకు ఉన్న అత్యంతబలమైన కోణం.

మొత్తానికి, విషయం పాతదే అయినప్పటికీ, కథనం, శైలీ, మొక్కలతో చేసిన పోలికలు, రిజర్వాయర్‌ సింబాలిజం కథను అందంగా తీర్చి దిద్దాయి. కాకపోతే, కథలో సంఘర్షణను చిత్రించిన తీరు బలంగా ఉన్నా, అంత బలమైన సంఘర్షణకు దారితీసిన నేపథ్యం మాత్రం బలంగా ఎస్టాబ్లిష్ చేయబడకపోవడం ప్రధానలోపంగా అనిపిస్తుంది.

ఎడిటర్

ముప్ఫయ్యేళ్ల జర్నలిజం, రచన రంగాల్లో అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.

Tags: కథా సమీక్షనాట్ ఏ హేట్ స్టోరీపోతుల కృపాకర్ప్రసేన్
Previous Post

16.8.26 : ఆదర్శిని కథానిధి

Next Post

యూట్యూబ్: కె.ఎన్.మల్లీశ్వరి కథ ‘సుక్ర బల్ముచు’

Next Post
యూట్యూబ్:  కె.ఎన్.మల్లీశ్వరి కథ ‘సుక్ర బల్ముచు’

యూట్యూబ్: కె.ఎన్.మల్లీశ్వరి కథ ‘సుక్ర బల్ముచు’

Discussion about this post

ఈ సంచికలో…

  • ఆ తరానికి గూగులమ్మ.. మాలతీ చందూర్
  • 9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు
  • యూట్యూబ్: గన్నవరపు నరసింహమూర్తి కథ ‘సముద్రం’
  • 9.8.26 కథానిధి : భూక్యా గోపీ నాయక్ సమీక్ష
  • 16.8.26 కథానిధి : వెంకటేష్ పాత్రుని సమీక్ష
  • యూట్యూబ్: చాగంటి ప్రసాద్ కథ చేదుకట్టు
  • యూట్యూబ్: కె.ఎన్.మల్లీశ్వరి కథ ‘సుక్ర బల్ముచు’
  • నాట్ ఎ హేట్ స్టోరీ (ప్రసేన్) కథా సమీక్ష: పోతుల కృపాకర్
  • 16.8.26 : ఆదర్శిని కథానిధి
  • సుక్ర బల్ముచు, చేదుకట్టు కథలపై సమీక్ష

అభిప్రాయాలు

    ఈ నెల పత్రిక

    కేటగిరీలు

    • కథలు
    • కథానిధి కథల సమీక్షలు
    • కథానిధి పీడీఎఫ్
    • కథానిధి యూట్యూబ్ కథలు
    • కథానిధి యూట్యూబ్ సమీక్షలు
    • కవితలు
    • పద్యాలు
    • వ్యాసాలు
    • సమీక్షలు

    ఇవి చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • కథానిధి
      • కథానిధి పీడీఎఫ్
      • కథానిధి కథల సమీక్షలు
      • కథానిధి యూట్యూబ్ కథలు
      • కథానిధి యూట్యూబ్ సమీక్షలు
    • కథ
    • కవిత
    • నవల
      • సీరియల్స్
      • నవలలు
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • తెలుగువెలుగు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి

    Developed by : www.10gminds.com