• Blog
  • HOME
  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • సంప్రదించండి
  • హోం
  • కథ
    • కథలు
    • అనువాద కథలు
  • కవిత
    • పద్యాలు
    • కవితలు
  • నవల
    • సీరియల్స్
    • నవలలు
  • వ్యాసం
    • వ్యాసాలు
    • సమీక్షలు
  • సృజన పథం
    • కథలు
    • కవితలు
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
No Result
View All Result
  • హోం
  • కథ
    • కథలు
    • అనువాద కథలు
  • కవిత
    • పద్యాలు
    • కవితలు
  • నవల
    • సీరియల్స్
    • నవలలు
  • వ్యాసం
    • వ్యాసాలు
    • సమీక్షలు
  • సృజన పథం
    • కథలు
    • కవితలు
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
No Result
View All Result
No Result
View All Result

నన్ను నేనే కొట్టుకున్న చెంపదెబ్బ!

కె ఎ మునిసురేష్ పిళ్లె by కె ఎ మునిసురేష్ పిళ్లె
March 16, 2021
in వ్యాసాలు
0
నన్ను నేనే కొట్టుకున్న చెంపదెబ్బ!

ఆకాశవాణి, తిరుపతి రేడియో స్టేషన్ శ్రోతలందరికీ హార్దిక నమస్సులు. నా పేరు కె.ఎ. మునిసురేష్ పిళ్లె. ప్రాథమికంగా నేను పాత్రికేయుడిని. స్వతహాగా అక్షర సృజనతో ప్రమేయం ఉన్న రంగాలపై ముచ్చట ఉన్నవాడిని. ఆ రకంగా కొంత  మేర కథ, బాలల కథ, కవిత, నవల, రాజకీయ వ్యంగ్య రచన, సినీ రచన, రాజకీయ కార్టూన్లలో ప్రవేశం ఉంది. నన్ను అక్షరమైన రూపాలు ఎన్నెన్ని మలుపుల వెంట నడిపించినా.. మౌలికంగా నేను పాత్రికేయుడిని. నా డిఎన్ఏ లో జర్నలిజం ఉంది. ప్రింట్- వెబ్- టీవీ రంగాల జర్నలిజంలో సమానంగా పట్టు ఉన్న వాడిని. నిజానికి ఇప్పుడు నేను రచనా నేపథ్యాన్ని వివరించడానికి పూనుకున్న ‘రాతి తయారీ’ అనే కథ జర్నలిజం రంగానికి సంబంధించినది కాకపోయినట్లయితే.. నేను ఈ ఉపోద్ఘాతం మొత్తం చెప్పవలసిన అగత్యమే ఉండేది కాదు.

పూజ్యులు మధురాంతకం రాజారాం గారి నుంచి ముఖతః కథారచనలోని మెళకువ, ఒడుపు సహస్రాంశం నేర్చుకోగల అవకాశం చిక్కిన భాగ్యశీలిని నేను. డిగ్రీ చదువుతున్న నాటినుంచి నేను రాసిన దానిని ఆయన సమక్షంలో కూచుని చదువుతోంటే.. విని.. నడకలో దోషాలు, పరుగులో దోషాలు, అసలు కథాంశంలోని లోపాలు, చివరికి అక్షర దోషాలు సహా దిద్దిన సహనశీలి మధురాంతకం గారి పాదాలకు సదా ప్రణమిల్లవలసిందే.

నేను మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం లోకి ప్రవేశించాక.. ఎప్పుడు కలిసినా ‘నాయనా ఏమైనా రాశావా’ అనేవాళ్లు. ‘లేదు సార్’ అనేవాణ్ని. ‘మీ జర్నలిస్టుల్లో రచయిత చచ్చిపోతాడబ్బా’ అనేవాళ్లు. మేం రచయితగా ఎందుకు చచ్చిపోతామో, ఆయన మాటల్లోనే తెలుసుకోవాలంటే… ‘‘ఏదైనా మనసును కదిలించే ఘటన తారసపడితే.. అది మన మనసులో బాగా నలగాల. ఆవేశం పుట్టాల. అది తట్టుకోలేక మనం ఏదైనా రాయాల.. ఆ మాదిరిగా కథ పుడతంది.. మీకు ఎలాంటిది ఎదురుపడినా.. ప్రతిరోజూ ఏదో ఒకటి రాస్తా ఉంటారు గదబ్బా.. ఎక్కడో ఒకచోట అది మనసులోంచి బయటకు వచ్చేస్తాది.. ఇక కథ రాసేది- పోతంది’’ అనేవాళ్లు. అది అక్షరాలా నిజం. పుట్టిన ప్రతి ఆవేశమూ.. ఆలోచనల్లోని ప్రకంపన సమస్తం.. ఎప్పటికప్పుడు వార్తా రచనలోనే ఏదో ఒకరూపంలో అక్షరాంతరాళాల్లోకి జారిపోతూ ఉండేది.

నేను మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం లోకి వచ్చిన తర్వాత.. రాసిన కథలన్నీ.. అక్కడ వార్తా కథనాల రూపంలో రాయలేక, అక్కడి వృత్తిగతమైన పరిమితులు చేతులు కట్టేసిన సందర్భాల్లో మాత్రం కథలుగా మార్పు చెందినవే తప్ప.. ఊహల్లోంచి పుట్టినవి కాదు. ప్రస్తుతం నేను ప్రస్తావించదలచుకున్న రాతి తయారీ ఆ కోవకు చెందినది కూడా కాదు. ఇది పూర్తిగా జర్నలిజం మీదనే రాసిన కథ. కథకులు సాధారణంగా అనేక రంగాలను, వృత్తులను ఎంచుకుని మరీ.. అందులోని సాధకబాధకాలను చర్చిస్తారు. నా ఎరికలో జర్నలిజం మీద దృష్టి సారించిన వారు తక్కువ. బహుశా తమకు సారూప్యత ఉన్న రంగం లోని చీకటి కోణాలను స్పృశించడం ఎందుకు లెమ్మన్న సానుభూతి వారిలో ఉండవచ్చు. నా ప్రపంచం మొత్తం జర్నలిజమే అయినప్పుడు చీకటైనా వెలుగైనా ఇక్కడివి మాత్రమే నాకు తెలుసు. అందుకే నాకు తెలిసిన దానిని నలుగురికీ చెప్పాలనే ఆలోచన నలుగుతుండేది.

సాధారణంగా- ‘ఒక రోడ్డు ప్రమాదం జరిగింది’ అని వినిపిస్తే.. ఎవరైనా సరే ముందు ‘అయ్యో’ అంటారు. కానీ జర్నలిస్టులు మాత్రం ‘ఎంతమంది’ అంటారు. ‘ఇద్దరు ముగ్గురైతే లోపలి పేజీ.. అయిదుగురు దాటితే ఫస్ట్ పేజీ’ అంటూ తేల్చేస్తారు.  మరో రకమైన స్పందనను, 27ఏళ్ల నా అనుభవాలలో ఎరగను. జర్నలిస్టు రాటుదేలుతున్న కొద్దీ.. గుండె రాయిలా మారుతుంటుంది. నాలో చాలాకాలంగా నలిగిన ఆలోచన అదే. అలాంటి ఒక పాత్రికేయుడి గుండె గురించిన వ్యక్తీకరణే.. ‘రాతితయారీ’

==

కథ పుట్టిన సందర్భం చాలా చిత్రమైనది.

నేను, ఈనాడు ఖమ్మంలో పనిచేస్తున్న రోజుల్లో సంస్థలో ఎన్నడూ లేనిది ఒక ఇన్‌హౌస్ రచనలపోటీ నిర్వహించారు. ఆ తర్వాత కూడా ఎన్నడూ అలాంటిది జరగలేదు. ఆ పోటీలకు రచనలు పంపాలి. బహుమతులు ప్రకటించినా.. రాసినవి ఎక్కడ ప్రచురణకు నోచుకుంటాయో కూడా తెలియదు. తెలుగులో అతి పెద్ద పత్రిక.. సంస్థలో ఉద్యోగులకు రచనల పోటీ పెడుతున్నప్పుడు జర్నలిజం కథాంశంగా.. నలుగుతున్న ఈ ఆలోచనకు కథారూపం ఇస్తే బాగుండునని అనిపించింది నాకు. ఆ రకంగా ఖమ్మం ఆఫీసులో కూర్చుని ఒకే రోజులో సాయంత్రం డ్యూటీ టైం అయ్యేలోగా కథ పూర్తి చేశాను. సంస్థలో ఎందరు కథా రచయితలు ఉన్నది, వారి కథాకథన స్థాయుల గురించి నాకు ఒక అవగాహన ఉంది. వేళ్లమీద లెక్కపెట్టగలిగినంత మంది కూడా ఆ రోజుల్లో లేరు. నా కథను పోటీ కి పంపేసి.. నా డెస్కులో కొలీగ్స్ తో.. ‘కథల పోటీలో మాత్రం ఫస్ట్ ప్రైజు నాదే.. కర్చీఫ్ వేసేశాను.. మిగిలిన వాటి గురించి తెలియదు..’ అంటూ ఛలోక్తి కూడా విసిరాను.

తీరా కొన్నాళ్లకు ఫలితాలు వచ్చాయి. మూడు బహుమతులకు అదనంగా రెండు కన్సొలేషన్ లను కూడా ప్రకటించారు. నా కథ పేరు అందులో ఎక్కడా లేదు. ఆశ్చర్యపడ్డాను గానీ, నిర్ఘాంతపోలేదు. అప్పటికే పుష్కరం దాటిన ఈనాడు అనుభవంలో అలాంటి చిత్రాలను అనేకం నేను దాటి వచ్చాను. పోటీ నిర్వహణ, న్యాయనిర్ణేతలకు అప్పగించి వారిచ్చిన మార్కులను సంకలన పరచడం వంటి బాధ్యత చూసిన వ్యక్తికి ఫోను చేసి.. ‘ఏంటి సంగ’తని అడిగాను. ‘నీకు తెలీందేముండాదబ్బా’ అని నర్మగర్భంగా ప్రకటించి మర్మం చెప్పకుండా తప్పించుకున్నాడు. అలా సంస్థలో అది మన కథ కింద తెలిసిపోయింది గనుక.. దొంగపేరు తో మరో పత్రికకు పంపించలేక, దానికి బహుమతి రాక… ‘రాతి తయారీ’ నా గదిలో ఎక్కడో మూలన పడిపోయింది.

ఆ తర్వాత కొన్నాళ్లకు నేను ఉద్యోగం మానేశాక తానా కథల పోటీ నిర్వహిస్తున్నట్లు ఓ మిత్రుడు చెప్పాడు. నాకు గడువు తేదీ రోజే సమాచారం తెలిసింది. గదిలో వెతికి ‘రాతితయారీ’ ప్రతిని పట్టగలిగాను గానీ.. నలిగిఉన్న కాగితాల బదులు ఫెయిర్ కాపీ రాసే సమయం కూడా లేదు. పైగా అందులో నా పేరు కూడా ఉంది.. తానా పోటీల నిబంధనల ప్రకారం కథ ప్రతి మీద రచయిత పేరు ఉండకూడదు. సమయం లేదు. కాగితం మీద నా పేరున్న భాగం చించేసి.. అవే కాపీలను తీసుకెళ్లి.. వాసిరెడ్డి నవీన్ గారి ఇల్లెక్కడో తెలుసుకుని.. అక్కడికెళ్లి అందజేశాను.

తానా పోటీల్లో దానికి ప్రథమ బహుమతి వచ్చింది. నవ్య వీక్లీలో ప్రచురణ అయింది. కథ-2005 సంకలనంలో చోటు చేసుకుంది. నాకు గుర్తున్నంత వరకు ఆ ఏడాది వచ్చిన దాదాపు అన్ని  కథా సంకలనాల్లోను దానికి చోటు లభించింది. ఆ రకంగా.. అప్పటికే నేను దాదాపు 30- 40 కథలు, స్వాతి వారపత్రికలో రెండు సీరియల్స్ రాసి ఉన్నప్పటికీ.. మొదటి కథ రాసిన కథారచయితగా ‘రాతి తయారీ’ నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది.

==

కథ అనుభవాలు విలక్షణమైనవి..

జర్నలిజంలోనే బతుకుతూ, దానినే శ్వాసిస్తూ, దానినే ఆహారంగా ఆస్వాదిస్తూ దానితోనే రమిస్తూ, దానిలోనే కడతేరిపోవాలనుకునే నాకు బాహ్యప్రపంచంలోని కథకులతో పరిచయాలు చాలా తక్కువ. లేవనే చెప్పాలి. ఇది రాసిన తర్వాత చాలా కాలానికి చోరగుడి జాన్సన్ గారు.. ‘రాతి తయారీ’ కథ గురించి ఒక పత్రికలో విశ్లేషణ వ్యాసం రాశారు. ఆ వ్యాసం ప్రచురితం అయిన దాదాపు ఏడాది కాలం తర్వాత ఒక జర్నలిస్టు మిత్రుడు నాకు ఆ సంగతి చెప్పారు. ఆ వ్యాసాన్ని సంపాదించి చదివాను. కేవలం ఒకే ఒక్క ‘రాతి తయారీ’ కథ గురించి జాన్సన్ గారు రాసిన వ్యాసం.. ఇంచుమించుగా నా కథ కంటె నిడివి ఎక్కువే ఉంది. ఆ సందర్భంలో ఒకసారి ఆయనకు ఫోన్ చేసి థాంక్స్ చెప్పాను. ఆ తర్వాత ఇప్పటిదాకా ఆయనతో కూడా నాకు పరిచయం పెరగలేదు.

ఆ రకంగా ఈనాడు పోటీలో కనీసం కన్సొలేషన్ కూడా ఇవ్వకుండా తిరస్కరించడం వల్ల మాత్రమే… ‘రాతితయారీ’ కథ బాహ్యప్రపంచానికి తెలిసింది. ఆ పోటీలో బహుమతి పొందిన కథలు ఎక్కడా ప్రచురణ కూడా కాకుండా ఉండిపోయాయి. దీనికి బహుమతి వచ్చి ఉంటే పరిస్థితి అంతే. అందుకే.. ‘రాతి తయారీ’ ఇవాళ నాకు కథా రచయిత గా ఒక గుర్తింపు తెచ్చి పెట్టిందంటే.. అందుకు ఈనాడు న్యాయనిర్ణేతల వివేకానికి, విచక్షణకు సదా కృతజ్ఞుడై ఉండాలి.

నిజానికి నేను, అంతకు ముందు- ఆ తరువాత కూడా నామట్టుకు దీనికంటె బాగా నచ్చిన కథలు కొన్ని రాశాను. కానీ.. నాకు మాత్రం రాతితయారీ రచయితగానే ముద్ర ఉండిపోయింది. ఆ ముద్ర నాకు అర్హమైనది. ఎందుకంటే.. ఆ కథలోని పాత్రా లక్షణాలకు నేను అతీతుడిని కాదు. అందులోని ‘రాతి తయారీ’ గుండె నాదే. వ్యక్తిగతమూ- వృత్తిగతమూ వేర్వేరుగా ఎంచి చూసుకోవడానికి వీలుకాని నా జీవితంలో.. అంతకంటె నికృష్టమైన రీతిలో అంతకు మించిన గుండె బండబారి వ్యవహరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకు నేను ఆయా సందర్భాల్లోని అవతలి వారిపట్ల వ్యవహరించిన తీరు గుర్తుకు వచ్చినప్పుడెల్లా అపరాధ భావంతో కుమిలిపోతుంటాను.  మానవ సహజమైన కారుణ్యం, దయాపూరిత స్పందన ఇవన్నీ గిడసబారిపోయిన గుండెలు కలిగి ఉండే వేవేల మంది పాత్రికేయుల లోకానికి నేను అథమస్తుడినైన ప్రతినిధిని. నా జీవితానికి, వ్యక్తిత్వానికి ఈ చట్రంలో ఇష్టంగా ఇరుక్కుపోయి బయటకు రాలేని నా సహచరుల వేదనకి అక్షరరూపం ఈ కథ ‘రాతి తయారీ’

 

నాకు నేను కొట్టుకున్న చెంపదెబ్బ..

జర్నలిస్టుల హృదయాలు రాతితయారీగా మారిపోతుంటాయని ముందే మనవి చేసుకున్నాను. నాలోని రాతితయారీ గుండెకు ఈ కథ ఒక కొరడా దెబ్బ. నాకు నేను కొట్టుకున్న చెంపదెబ్బ ఈ కథ. ఈ కథ గుర్తుకు వచ్చినప్పుడెల్లా.. నాలోని జడత్వం గమనానికి వచ్చి వీలైనంత సరళంగా మారడానికి నేను ప్రయత్నిస్తుంటాను.

ఈ కథ ప్రచురణ కు నోచుకుని పుష్కరం దాటింది. కానీ అప్పటికీ ఇప్పటికీ కథలోని మౌలికమైన రాతిగుండెల విషయంలో ఎలాంటి మార్పు లేదు. పాత్రికేయ సమాజం మారలేదు. ఇప్పుడింకా చానెళ్ల మధ్య, పత్రికల మధ్య పోటీ పెరిగింది. సోషల్ మీడియాను బూచిలా చూసి భయపడుతూ.. బాధ్యతగల ప్రింట్, టీవీ మీడియాలు కూడా.. అవాస్తవాలను, ధ్రువీకరణకు ప్రయత్నించకుండా.. అసంబద్ధమైన విషయాలను ప్రచారం చేయడం నిత్యకృత్యంగా మారిపోయింది. ‘రాతితయారీ’ లోని కథానాయకుడికి కనీసం.. క్షణికమైనా సరే మానవత్వంతో స్పందించేంత, తన మీద తనే జాలిపడేంత మనసు ఉంది. ఇవాళ్టి పాత్రికేయుల్లో అవి కూడా లుప్తమైపోతున్నాయి. ఇందుకు నా జాతిని నేను నిందించను. హేతురహితమైన పోటీ, ముందుండాలనే ఆరాటంతో…, సత్యాలను విలువలను ప్రమాణాలను మానవత్వాన్ని సమస్తమైన మానవీయ కోణాలను కసాబిసా తొక్కేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు నేటి పాత్రికేయులు. మరెన్ని యుగాలు గడిచినా ‘రాతితయారీ’ జీవత్వం తొణికిసలాడే.. సార్వకాలీనతను కోల్పోయే అవకాశం లేని కథ అయినందుకు ఒక ఆనందం కలుగుతుంది.

అదిగో.. ఆ పైశాచిక ఆనందమే.. నాలోని ‘రాతితయారీ’ గుండెకు ప్రతీక.

==

సావధానంగా  కథ గురించి నా అభిప్రాయాన్ని అనుభవాల్ని విన్న మీకందరికీ సదా రుణపడి ఉంటాను.

 

భవదీయ

మునిసురేష్ పిళ్లె

కె ఎ మునిసురేష్ పిళ్లె

మౌలికంగా జర్నలిస్టు. రచయిత. సుమారు ముప్ఫయ్యేళ్లుగా రాస్తున్నారు. తండ్రి ఎల్లయ్య స్థాపించిన ఆదర్శిని పత్రికతో రచనలు మొదలు పెట్టారు. రెండు కథా సంపుటులు ‘పూర్ణమూ.. నిరంతరమూ..’, ‘రాతి తయారీ’, ఒక నవల ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’ ప్రచురించారు.

whatsapp msg

sureshpillai.com
Previous Post

‘న్యూస్ ఛానల్’ గొట్టాల మీద మట్టికొట్టిన కథ

Next Post

అప్పులు పుట్టు తావు…

Next Post
అప్పులు పుట్టు తావు…

అప్పులు పుట్టు తావు...

Discussion about this post

ఈ సంచికలో…

  • ‘కాల్ యూ లేటర్’
  • అప్పులు పుట్టు తావు…
  • నన్ను నేనే కొట్టుకున్న చెంపదెబ్బ!
  • ‘న్యూస్ ఛానల్’ గొట్టాల మీద మట్టికొట్టిన కథ
  • భ్రమాలంకారం
  • వెంటవచ్చునది
  • అనాది – అనంతం
  • ఆ రకంగా ఒక్కటయ్యారు
  • బదిలీ
  • చమించేయండి

అభిప్రాయాలు

    ఈ నెల పత్రిక

    కేటగిరీలు

    • కథలు
    • కవితలు
    • పద్యాలు
    • వ్యాసాలు
    • సమీక్షలు

    ఇవి చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • కథ
      • కథలు
      • అనువాద కథలు
    • కవిత
      • పద్యాలు
      • కవితలు
    • నవల
      • సీరియల్స్
      • నవలలు
    • వ్యాసం
      • వ్యాసాలు
      • సమీక్షలు
    • సృజన పథం
      • కథలు
      • కవితలు
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • తెలుగువెలుగు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి

    Developed by : www.10gminds.com