• Blog
  • HOME
  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • సంప్రదించండి
  • హోం
  • కథ
    • కథలు
    • అనువాద కథలు
  • కవిత
    • పద్యాలు
    • కవితలు
  • నవల
    • సీరియల్స్
    • నవలలు
  • వ్యాసం
    • వ్యాసాలు
    • సమీక్షలు
  • సృజన పథం
    • కథలు
    • కవితలు
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
No Result
View All Result
  • హోం
  • కథ
    • కథలు
    • అనువాద కథలు
  • కవిత
    • పద్యాలు
    • కవితలు
  • నవల
    • సీరియల్స్
    • నవలలు
  • వ్యాసం
    • వ్యాసాలు
    • సమీక్షలు
  • సృజన పథం
    • కథలు
    • కవితలు
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • తెలుగువెలుగు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
No Result
View All Result
No Result
View All Result

ఆ రకంగా ఒక్కటయ్యారు

ఎడిటర్ by ఎడిటర్
March 16, 2021
in కథలు
0
చమించేయండి

కోర్టు సీను- లోపల

ఆనందరావు – అప్పలమ్మ ఎదురెదురుగా బోనుల్లో నిలబడి ఉన్నారు.

బోలెడంతమంది లాయర్లు పెద్ద గౌనులేసుకుని పొడవాటి బల్లకు రెండువైపులా కుర్చీల్లో కూర్చుని ఏదో పని ఉన్నట్లుగా నటిస్తూ ముక్కుల మీదికి జారిన కళ్లజోళ్లలోంచి పుస్తకాల్లో ఏదో వెదుక్కుంటున్నారు.

వాళ్లందరూ అందంగా ఉన్నారు. వాతావరణం మందంగా (గ్రాంధికంలో గంభీరంగా) ఉంది.

హాలంతా సూది పడితే వినపడేంద నిశ్శబ్దంగా ఉన్నా… జడ్జి మాత్రం అందరూ తనవైపు చూడమని బతిమాలుతున్నట్లుగా… చెక్క సుత్తితో బల్లమీద మూడుమార్లు బాది ‘‘ఆడర్… ఆడర్…’’ అని కేకపెట్టాడు.

‘‘ఇందుమూలముగా ఈ ధర్మాసనం తీర్పుచెబున్నది ఏమనగా… ఆనందరావు- అప్పలమ్మ అనబడే ఈ ఇద్దరు పెళ్లి చేసుకుని ఏడాది గడిచి, ఓ బిడ్డకు జన్మనిచ్చినప్పటికినీ, ఒకరితో ఒకరు కలసి బతుకుటకు, పరస్పరము మనస్ఫూర్తిగా ఇష్టపడని కారణముగా… ఇన్నాళ్లు కలసి బతుకుటలో కోల్పోయిన స్వేచ్ఛ, ఆనందం ఏవైతే ఉండునో అవి తిరిగి పూర్తిస్థాయిలో పొందేలాగున తీర్మానించుచూ… విడాకులు మంజూరుచేయడమైనది.’’ చదివి న్యాయమూర్తిగారు తృప్తిగా కళ్లు మూసుకున్నారు. ‘హమ్మయ్య పంజరంలో చిక్కుకు పోయిన ఒక మనుషుల జంటకు స్వేచ్ఛ, ఆనందాల్ని ఇవ్వగలిగాను దేవుడా… నా సేవల్ని రికార్డు చేయి’ అనుకున్నాడాయన మనసులో… ఆ కాగితాల మీద సంతకం పెడుతూ.

కోర్టు సీను – వెలుపల మెట్లమీద…

పైమెట్టు మీద ఆనందరావు. కింద మెట్టు మీద అప్పలమ్మ.

‘‘ఏవండీ… కోర్టు ముద్రకొట్టి ఇచ్చేసింది కదాని… నాకు అన్యాయం చేయరు కదండీ…’’ అంది అప్పలమ్మ  ఆనందరావు చేతులు పట్టుకుని.

ఆనందరావు బెదిరిపోయినట్లుగా చుట్టూ ఓసారి కలయజూశాడు. అంతలో అప్పలమ్మ తాలూకు లాయరమ్మ, విడాకుల స్పెషలిస్టు డాకూరాణి వస్తుండడం చూసి ఒళ్లు బిగదీసి, కళ్లు ఆకాశానికేసి తిప్పాడు. డాకూరాణి నేరుగా వచ్చి అప్పలమ్మతో – ‘‘నేను ముందే చెప్పానుగా. ఈ డాకూరాణి కోర్టు హాల్లో మాటల్తో నిప్పులు చిరిగిందంటే… ఇక ఆది దంపతులకైనా విడాకులు రావాల్సిందేనని. కంగ్రాట్స్. అయినా ఈ మగజాతి చేతులు పట్టుకుని మాట్లాడుతున్నావా. వీళ్లవి చేతులు కాదు కాళ్లు. వీళ్లు నాలుగు కాళ్ల…’’

‘‘నువ్వుండమ్మా. ఫీజు ఇచ్చుకున్నా కదా… ఇక దయచేయ్!’’ విసుక్కుంది అప్పలమ్మ. పైటకొంగుతో ముక్కు చీదుకుని, అదే పైటకొంగుతో కళ్లు ఒత్తుకుంటూ!

డాకూరాణి అయోమయంగా వెళ్లిపోతుండగా…. ఆనందరావు మాత్రం గత్తరబిత్తరగా అటూ ఇటూ తిప్పితిప్పి చూస్తున్నాడు. తమను ఎవరైనా గమనిస్తున్నారేమో అన్నట్లుగా.

జిల్లా పరిషత్ ఆఫీసు సీను- వెలుపల

ఆటో ఆగింది. అందులోంచి నెలల పసిబిడ్డతో సహా అప్పలమ్మ దిగింది. నేరుగా ఆఫీసు వరండాలోకి వెళ్లి అక్కడ ఉన్న ఓ బెంచీపై కూర్చుంది. ఇంకా అక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు. నిద్రపోతున్న బిడ్డను తనకేసి పొదువుకుని, ఓసారి వరండా పైకప్పుకేసి లోతుగా చూసింది.

ట్రింగుం… ట్రింగుం… ట్రింగుం…. మ్యూజిక్కుతో కళ్లముందు చక్రాలు తిరుగుతుండగా ఫ్లాష్ బ్యాక్ సీను!

ఆనందరావు తాను జీవితాన్ని తెలివిగా ప్లాన్ చేసుకోవాలన్న దురాశ కక్కుర్తితో చాలా తరచుగా కుడితిలో కాలేస్తుంటాడు. డిగ్రీ పాసయి, ముప్పయ్యేళ్లు వచ్చేవరకూ గోళ్లు గిల్లుకుంటూ, రోడ్లు కొలుస్తూ, అమ్మాయిలకు బీట్ కొడుతూ తిరిగాడు. పిల్లనెవ్వరూ ఇవ్వరు కాబట్టి పెళ్లి ఆలోచన రాలేదు. అప్పుడు డీఎస్సీతో టీచరు పోస్టుల భర్తీ మొదలయింది. ఓ ప్రయత్నం చేద్దామని… జూలు విదిల్చి పొరుగు రాష్ట్రానికి వెళ్లి కొంత సొమ్ము వదిలించుకుని ఓ బీఈడీ సర్టిఫికేటు పుట్టించుకుని వచ్చాడు. పరీక్ష కూడా రాశాక… తనకు ఎంతో ఇష్టమైన చిలకజోస్యం వాడి దగ్గరకు వెళ్లాడు. వాడి దగ్గరకు వెళ్లగానే ఆ కోయదొర ఆదరంగా ఆహ్వానిస్తూ…

‘‘రా దొర! బంగారం లాంటి యేళలో వచ్చినావు. గ్రహాలే నిన్నీ లగ్గంలో యీడకి నడిపించి తెచ్చినాయి. కళ తాండవిస్తన్నాది నీ మోమున. సర్కారు కూడు తినాలని రాసి ఉంది నీకు’’ అన్నాడు. ‘అరె. నేను డిఎస్పీ రాసిన సంగతి వీడికి తెలిసిపోయినట్లుంది. ఈ కోయదొర మహా ఘటికుడె’ అనుకున్నాడు ఆనందరావు.

అంతలో చిలక వచ్చి వెంకటేశ్వరస్వామి ఉన్న కవరు తీసింది. ‘‘నాక్కూడా ఇద్దరా’’ ఆశగా అడిగాడు ఆనందరావు.

‘‘ఇది ఆ పోపిడి కాడు దొర! సామి తిరప్తి కొండమీద! అమ్మ తిరుచానూరు కాడ! పుంజు వొక కోనలో… పెట్ట వొక పేటలో…! అయినా గుబులేల… అదిగో సూడు… గురుడు, శుక్రుడు కళ్ల జోళ్లు సర్దుకుని నీకేసే ప్రేమగా చూస్తండారు. అదిగదిగో శని కాలిజోళ్లు సర్దుకుని పరుగు లగెత్తిస్తన్నాడు. దేవర చెప్పించిన మాట పొల్లయితే ఒట్టు. వచ్చి నీ మెట్టు తీసి కొట్టు’’ అన్నాడు ఆనందరావు గుండె గంతులేసింది. వాడికి ఓ యాభై చదివించుకుని, నెమ్మదిగా ఇంటికొచ్చాడు.

ఇక టీచరుద్యోగం వచ్చినట్టేనని అనుకున్నాడు. ఉద్యోగం మీద నమ్మకం చిక్కబడేసరికి, మనువు మీదికి మనసు మళ్లింది. మరో టీచరు తోడైతే బాగుంటుందనిపించింది. వెదుకులాడాడు. తనకులాగే డిఎస్సీ రాసిన అప్పలమ్మ అనే పల్లెటూరి అమ్మాయి దొరికింది. జాగెందుకు లెమ్మని చటుక్కున కట్టేసుకున్నాడు. అప్పలమ్మ చాలా మంచిది. గుణవంతురాలు. పల్లెటూరి నుంచి వచ్చింది కావడంతో డాంబికాల ఊసుకూడా తెలియనిది.

డిఎస్సీ రిజల్ట్సు పెల్ల తర్వాత వచ్చాయి.

ఆనందరావు- ప్యాంటు జేబులో ఇమిడేలో ఓ కత్తి సంపాదించి, జేబు చిరిగిపోకుండా దాన్ని జాగ్రత్తగా చేతి రుమాలులో చుట్టి దాచుకున్నాడు. వరుసగా వారం రోజుల పాటు రాత్రనకా… పగలనకా… ఊర్లో ఉన్న అన్ని పార్కులు, బస్సుస్టాండులు, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్ల వెలుపల ఫ్లాట్ ఫారమ్ లు లాంటి తనకు తెలిసిన అన్ని చోట్లకూ తిరిగాడు. చివరికి ఓ ఆదివారం పార్కులో దొరికాడు కోయదొర. వాణ్ని దొరకబుచ్చుకుని…

‘‘వారం నుంచి వెదుకుతున్నా నీకోసం’’ వగరుస్తూ అన్నాడు ఆనందరావు.

‘‘నోరు తీపి చేస్తావా దొర’’ అడిగాడు వాడు.

‘‘కాదు. నాలిక కోస్తా’’ రుమారులోంచి జాగ్రత్తగా కత్తి బయటకు తీశాడు ఆనందరావు.

‘‘చాల్చాల్లే ఆపు దొర! ఆరోజు నూట పదహార్లు పెట్టవయ్యా దేవర సల్లగా సూసి నీ సిలకతో తీపి కబురు పంపతాడంటే యిన్నావా…? అందులో సగం కోసం యాభై సేతిలో పెట్టావ్. ఆనాడే అనుకున్న- ఇది కోసుడు బేరమని, ఇప్పుడు మళ్లీ వచ్చినావు నాలిక కోస్తనని… ఇంతకు ఏటయ్యిందో చెప్పు…’’ అన్నాడు.

తన బాధ మొత్తం చెప్పుకున్నాడు ఆనందరావు. డిఎస్సీలో తను ఫెయిల్ కావడం దగ్గర్నుంచీ… తన భార్యకు ఉద్యోగం రావడం వరకు!

‘‘ఆపాపు’’ హఠాత్తుగా అన్నాడు కోయదొర. అప్పలమ్మ ఉద్యోగం గురించి చెప్పగానే! ‘‘చూసినావా… నువ్వు సొమ్ము కోసినా… దేవర నీకు కడుపుకోత పెట్టలే. సర్కారు కూడు తింటావని అన్నాడేగానీ, నీకు కొలువవుతాదని చెప్పినాడా? నీ పెట్టకు కొలువైతే ఆ సర్కారు కూడు నీకు కాకుండా పోతదా! దేవరను నమ్మాలి దొర. నీకు మంచే జరగతంది. సిలకెప్పుడూ సత్యమే పలకతాది’’ అని మరో నాలుగు మాటలు చెప్పి, ఆనందరావును నమ్మించి, అతని కాతాలోనే ఓ కూల్ డ్రింక్ తాగి వెళ్లిపోయాడు కోయదొర.

ఆనందరావుక్కూడా నిజమే అనిపించింది. చిలక సత్యమే చెప్పిందనిపించింది. అయితే ‘పుంజు వొక కోనలో… పెట్ట వొక పేటలో…’ అన్న ఆరోజు చెప్పిన మాటలకు అర్థం ఏమిటో ఆతర్వాత తెలిసొచ్చింది.

అప్పలమ్మకు పోస్టంగు కూడా వచ్చిన తర్వాత!

అంటే అతిశయోక్తి అనుకుంటు గానీ, ఆనందరావు ఉండేది కాశ్మీరంలో అయితే… రామేశ్వరంలో వచ్చింది అప్పలమ్మకు పోస్టింగు! ఆ జిల్లాలో వాళ్ల సొంత ఊరు, పోస్టింగు వచ్చిన ఊరు తూర్పుపడమర అంచుల్లో ఉండేవి. ఉద్యోగం ఆనందంతో మనసారా నవ్వలేకపోయాడు- కనీసం కడుపారా ఏడవలేకపోయాడు ఆనందరావు. బిక్కుబిక్కుమంటూ భార్యను తీసుకుని రంగూ, రుచీ వాసనా తెలియని ఆ రామేశ్వరానికి వెళ్లాడు. చిన్న పల్లె అది. ఊరు కొత్త. ఇంట్లోంచి బయటకు కదిలేవాడు కాదు. అప్పలమ్మ  మాత్రం ఉదయాన్నే బడికి వెళ్లి సాయంత్రం అవుతుండగా వచ్చేది. ఆనందరావుకు రెండ్రోజులకు పిచ్చెక్కుతున్నట్లు అనిపించేది. బయట ఏదో వొక పని  చేద్దామన్నా… దొరికేంత పెద్ద ఊరు కాదది. అంతా  కలిపి యాభై గడప దాటని పల్లె. తనకు తానుగా వంట పనుల్ని నెత్తిన వేసుకున్నాడు. పొద్దున లేవగానే అంట్లు తోముకోవడం, వంట చేసుకోవడం… కాసేపు టీవీ చూస్తూ గడపడం. మధ్యాహ్నం పడుకుని, సాయంత్రం అప్పలమ్మ వచ్చేలోగా లేచి ఉండడం! మార్పులేని ఈ దినచర్యతో- ఓ నెల గడిచేసరికి జీవితం అంటే విరక్తి పుట్టింది. ఆ విరక్తిలోంచి రోషం పుట్టింది. ఉద్యోగం పురుష లక్షణం అనే డైలాగు, దాంతోపాటూ తానూ పురుషుణ్ని అను సంగతి ఒక్కసారిగా గుర్తొచ్చాయి.

ఓ మిత్రుడితో మాట్లాడి ఏదో ఒక జీతానికి ఓ కొట్టులో పద్దులు రాసే పనిలో కుదురుకున్నాడు ఆనందరావు.

ఉద్యోగం దొరికిందేగానీ, ఆనందం మాత్రం  మిగల్లేదు. ఆ ఉద్యోగం ఎక్కడంటే.. ఆనందరావు సొంత ఊరైన ఆ ఫలానా కాశ్మీరంలో…!

అప్పటికీ అప్పలమ్మ వద్దని చెప్పనే చెప్పింది. ఏదో ఒక జీతంతో కలిసి ఉందామంది. ఆనందరావు విన్లేదు. మొండిపట్టు పట్టాడు.

అప్పట్నించి మొదలయ ది. అప్పలమ్మ అదే పల్లెలో తప్పనిసరిగా ఉండిపోయింది. ఆనందరావే ప్రతి ఆదివారం అక్కడకు వెళ్లి వస్తుండేవాడు. రెండురోజులకోసారి అప్పలమ్మ అద్దెకున్న ఇంటి ఓనర్లకు ఫోన్చేసి, భార్యను పిలిపించి మాట్లాడేవాడు. ఈ రూపాణా పెరిగిన ప్రయాణ భత్యాలు, ఇతర ఖర్చులు అన్నీ కలిపి ఆనందరావు జీతం మొత్తం చెల్లయిపోయేది. పైసా మిగిలేది కాదు. అప్పలమ్మ ఓసారి లెక్కలు వేసి ఆ సంగతిని కూడా ఆనందరావుకు వివరించి భేషజాలకు పోకుండా పల్లెలోనే కలసి ఉందాం రమ్మని అనునయంగానే పిలిచినా, ఆనందరావు వినిపించుకోలేదు.

అయితే, ఇలాంటి సంసారంలోనూ ఏడాది తిరిగేసరికి వారికి ఓ బాబు పుట్టేశాడు.

రోజులిలా భారంగా…

సంసారం అలా ఫోన్లమీద, బస్సుల మీద గడుస్తుండగా…

కోరిన కోనలో వాన కురిసినట్లుగా- టీచర్లకు ట్రాన్స్ ఫర్ల సీజనొచ్చింది.

అప్పలమ్మ ఆశగా ఆనందరావు పనిచేసే దుకాణానికి ఫోను చేసి, ‘‘మా ఎంఈవో ట్రాన్స్ ఫర్లు కావాల్సిన వాళ్లు అప్లికేషన్లు పెట్టుకొమ్మన్నాడు. నేను కూడా పెట్టేశా! ఇక ఎంచక్కా మనం ఇద్దరం కలసి మన ఊళ్లోనే ఉండచ్చు.’’ అంది సంబరంగా.

ఆనందరావు సంతోషానికీ పట్టపగ్గాల్లేకుండా పోయింది. ఆరోజే గుడికెళ్లి ఆ ట్రాన్స్ ఫర్ అయ్యేలా చూడమని దేవుడికి కొబ్బరి కాయ కొట్టివచ్చాడు.

ఆ తర్వాత రెండు రోజుల వరకు ఆ ఫలానా రామేశ్వరంలో అప్పలమ్మ, సొంత ఊరు ఫలానా కాశ్మీరంలో ఆనందరావు ట్రాన్స్ ఫర్ ఊహల్లో తేలియాడుతూ కాలం గడిపేశారు.

‘‘మూడేళ్లు దాటితే తప్ప ట్రాన్స్ ఫర్ చేయరటండీ…’’ అంది అప్పలమ్మ.

‘‘రూల్సు బుక్కులో అన్నీ అలాగే ఉంటాయి లేవోయ్! ఆ రూల్సుకు బోల్డు హోల్సు కూడా ఉంటాయి. అలాంటివి వెదకి పట్టుకుని , ఎవరినైనా అడిగిగానీ తెలుసుకోలేకపోయావా?’’ తేలిగ్గా అన్నాడు ఆనందరావు.

‘‘ఉన్న హోల్సు అన్నీ తెలుసుకున్నాను గానీ… అవి మనకు ఉపయోగపడేలా లేవండీ…’’ దిగులుగా అంది అప్పలమ్మ.

‘‘ఒక ఈజీ  మార్గం చెప్పు’’ అడిగాడు.

‘‘అన్ మ్యారీడ్ వుమనప్ అయితే వెంటనే సొంత ఊరి దగ్గరగా పంపేస్తార్ట’’ తొలగని దిగులుతోనే అంది!

‘‘ఓస్ అంతేగా! ట్రాన్స్ ఫర్ కౌన్సిలింగ్ జరిగే రోజుకు తాళి తీసేసి వెళ్లి అన్ మ్య రీడ్ అంటే పోయె…’’

‘‘ఇంకా అన్ మ్యారీడ్ ఏంటండీ. మొన్నే మెటర్నిటీ లీవు కూడా తీసేసుకున్నాక!’’ గుర్తు చేసింది అప్పలమ్మ.

‘‘ఓహో’’ సాలోచనగా అని- ‘‘అయినా మెటర్నిటీ లీవుకు పెళ్లి కావాలన్న రూలెక్కడుందోయ్’’ అన్నాడు ఆనందరావు.

భార్య కళ్లలో కురిసిన నిప్పులు చురుక్కుమనిపించిన కొద్దిసేపటి తర్వాతగానీ- తాను ఏం తప్పు మాట్లాడాడో అతడికి అర్థం కాలేదు.‘‘సారీ, సారీ…’’ అన్నాడు నొచ్చుకుంటున్నట్లుగా.

‘‘జబ్బు పడ్డానని ఓ సర్టిఫికేటు పుట్టిస్తే సరిపోతుందిట’’ మళ్లీ ఆశగా అంది అప్పలమ్మ.

‘‘అయితే నీకు క్యాన్సరు తెప్పిద్దామా?’’ అడిగాడు ఆనందరావు.

‘‘క్యాన్సరు వస్తే కుదర్దు. నరాల బలహీనత, ఫిట్సు వంటి రోగాలు రావాలిట’’ అంది నీరసంగా.

‘‘ఇంత పుష్టిగా కనిపిస్తూ నీకు నరాల బలహీనత అంటే నవ్వుతారేమోయ’’ అన్నాడు ఆనందరావు. అప్పలమ్మ అందంగా నవ్వింది.

‘‘నా బుర్రలో ఓ మెరుపు మెరిసింది’’ అరిచాడు ఆనందరావు.

‘‘అప్పలమ్మ’’పిలిచాడు బంట్రోతు.

జిల్లా పరిషత్తు ఆఫీసు వరండాలో బెంచీపై కూర్చుని ఉంది అప్పలమ్మ. ఒడిలో బిడ్డను పెట్టుకుని.

లేచి, బిడ్డను భుజం మీదికి మార్చుకుని లోపలకు వెళ్లింది.

దరఖాస్తులోకి తేరిపారజూసిన డీఈవో ఆమెకేసి తిరిగి మిడిగుడ్లేసుకుని చూస్తూ… ‘‘అదేమిటమ్మాయ్! అన్ మ్యారీడ్ కోటాలో ట్రాన్స్ ఫర్ కు అప్లికేషన్ పెట్టావ్’’ అన్నాడు.

‘‘పైగా చంకలో బిడ్డతో వచ్చి’’ ఆయన పక్కనే కూర్చున్న ముగ్గురిలో ఎవరో ఒకరు అని, కిసుక్కున నవ్వారు.

డీఈవో అన్నందుకా, లేక పక్కన ఉన్నవాడు నవ్వినందుకా… అర్థం కాకమ దే… అప్పలమ్మ కళ్లలో కొళాయి తిప్పేసింది. దెబ్బకు అందరూ గాభరాపడిపోయారు.

ఆ మాట అడగ్గానే కొళాయి తిప్పడానికి, పాపం చాలా రోజుల్నించీ ప్రాక్టీసు చేసింది మరి!

ఒక్కసారిగా అంతా గాభరాపడిపోయారు. ‘‘ఏమైందమ్మాయ్’’ మంచినీళ్ల గ్లాసు అందిస్తూ అడిగాడు డిఈవో.

‘‘మీకు అప్లికేషను పెట్టిన నాటికి మా కేసు కోర్టులో పెండిగులో ఉంది సార్… వారం కిందటే తీర్జు వచ్చేసింది. మా వారు డైవోర్సు ఇచ్చేశారు సార్… ఇదిగో నా ప్రాణానికి ఈ పసిబిడ్డ కూడా…’’ కొళాయి ఆగిపోయినా గొంతులో గరగర జారిపోకుండా జాగ్రత్తగా చెప్పింది.

డీఈవో బుగ్గల మీంచి రెండు నీటి చుక్కలు జారి కింత అప్లికేషను మీద టప్పున పడ్డాయి.

స్కూలు సీను. లోపల

డీఈవో ఇన్ స్పెక్షను జరుగుతోంది. అంతా పూర్తయింది. ఇక స్కూలు లాంగ్ బెల్ మోగబోతుండగా…

డీఈవో అడిగాడు ‘‘ఏమ్మా! బాబు బాగున్నాడా…’’

‘‘బాగున్నాడు సార్’’ అప్పలమ్మ పూర్తి చేసేలోగానే ఆనంతరావు స్కూటరు ముందు ఓ పిల్లాణ్ని నిల్చోబెట్టుకుని బుర్రున అక్కడికి వచ్చేశాడు.

అంతలో లాంగ్ బెల్లు మోగింది.

‘‘అదిగో సార్. మా బాబే’’ స్కూటరులో బాబును డీఈవోకు చూపిస్తూ అంది అప్పలమ్మ.

‘‘అంటే… ఆయన… నువ్వు మళ్లీ…’’ పొంతనలేని పొడి మాటలతో సందేహం వెలిబుచ్చాడాయన.

‘‘ఈయన మొదటి ఆయనే సార్. అప్పుడు కోర్టు విడగొడుతూ, విడాకులివ్వబట్టే ఇప్పుడిలా కలిసి ఉంటున్నాం.’’

నమస్తే పెట్టి, నవ్వుతూ వెళ్లి స్కూటరు వెనక కూర్చుంది అప్పలమ్మ.

ఎడిటర్

ముప్ఫయ్యేళ్ల జర్నలిజం, రచన రంగాల్లో అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.

Previous Post

బదిలీ

Next Post

అనాది – అనంతం

Next Post
అనాది – అనంతం

అనాది – అనంతం

Discussion about this post

ఈ సంచికలో…

  • ‘కాల్ యూ లేటర్’
  • అప్పులు పుట్టు తావు…
  • నన్ను నేనే కొట్టుకున్న చెంపదెబ్బ!
  • ‘న్యూస్ ఛానల్’ గొట్టాల మీద మట్టికొట్టిన కథ
  • భ్రమాలంకారం
  • వెంటవచ్చునది
  • అనాది – అనంతం
  • ఆ రకంగా ఒక్కటయ్యారు
  • బదిలీ
  • చమించేయండి

అభిప్రాయాలు

    ఈ నెల పత్రిక

    కేటగిరీలు

    • కథలు
    • కవితలు
    • పద్యాలు
    • వ్యాసాలు
    • సమీక్షలు

    ఇవి చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • కథ
      • కథలు
      • అనువాద కథలు
    • కవిత
      • పద్యాలు
      • కవితలు
    • నవల
      • సీరియల్స్
      • నవలలు
    • వ్యాసం
      • వ్యాసాలు
      • సమీక్షలు
    • సృజన పథం
      • కథలు
      • కవితలు
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • తెలుగువెలుగు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి

    Developed by : www.10gminds.com