కథలు – Sahityam

వెంటవచ్చునది
వెంటవచ్చునది ఒక మంచి కధ. ఎంతటి జీవితం సాగించినా.. మనం వెంట తీసుకువెళ్లేది ఏముంటుంది.. ఏ ఆశతో మనం జీవనగమనంలో నానా అరాచకాలకు పాల్పడుతుంటాం.. అనే.. తాత్విక చింతన మేళవించిన సందేశాత్మక కథ.

ఎమ్వీ రామిరెడ్డి

ఎం వి రామిరెడ్డి జర్నలిస్టు, రచయిత, సంఘసేవకుడు. ముప్ఫయ్యేళ్లుగా కథలు రాస్తున్నారు. రామ్‌కీ ఫౌండేషన్ సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. తండ్రి పేరిట మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్టు ద్వారా.. పెదపరిమిలో వృద్ధాలయం నిర్వహిస్తున్నారు.

<svg
aria-hidden="true" class="sab-user_email" role="img" xmlns="http://www.w3.org/2000/svg" viewbox="0 0 512 512"><path
fill="currentColor" d="M502.3 190.8c3.9-3.1 9.7-.2 9.7 4.7V400c0 26.5-21.5 48-48 48H48c-26.5 0-48-21.5-48-48V195.6c0-5 5.7-7.8 9.7-4.7 22.4 17.4 52.1 39.5 154.1 113.6 21.1 15.4 56.7 47.8 92.2 47.6 35.7.3 72-32.8 92.3-47.6 102-74.1 131.6-96.3 154-113.7zM256 320c23.2.4 56.6-29.2 73.4-41.4 132.7-96.3 142.8-104.7 173.4-128.7 5.8-4.5 9.2-11.5 9.2-18.9v-19c0-26.5-21.5-48-48-48H48C21.5 64 0 85.5 0 112v19c0 7.4 3.4 14.3 9.2 18.9 30.6 23.9 40.7 32.4 173.4 128.7 16.8 12.2 50.2 41.8 73.4 41.4z"></path></svg>

అనాది – అనంతం
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె

‘‘ముందు నేను చెబుతాను’’

‘‘అహఁ, ముదు నేను…’’

‘‘నేను చెప్పినాకే… ఎవరైనా…’’

‘‘అసలు క్షోభ మొత్తం అనుభవించిన వాడిని నేను. నేను చెప్పడమే కరెక్టు’’

‘‘దాదాపుగా అన్ని నిందలూ పడ్డది నామీదే. పాపాల భైరవుడిలాగా, అంటే పడడానికే పుట్టినట్టున్నాను. నేను చెబుతాను ముందు…’’

‘‘ఇయ్యన్నీ పక్కన పెట్టండి. ఏదో పెద్ద ముండావోడ్ని. నా కడుపు మంటేదో కక్కనివ్వండి ముందు…’’

‘‘సరే మొదలెట్టు…’’ తొలి రెండు గొంతుకలూ ఒక్కసారిగా పలికాయి.

‘‘అదీ మాటంటే…’’ పొడిదగ్గు పండు గొంతును సవరదీసింది.

నన్నందరూ చెలమయ్య అంటారు.

వాడలో ఉంటా. ఇప్పుటోడ్ని గాదు. మనూరి పెద్దరెడ్డి నాయన పుష్కరాలకని బొయ్యి గోదాట్లో మునిగిపొయ్యినాడని కబురొచ్చిన్రోజే నువ్వు బుట్టినావురా… ఆ రెడ్డే పుట్టినాడని ఆయన పేరే పెట్టుకున్నా… అనేది మాయమ్మ ఆశెగా నా తల నిమర్తా. నా పేరూ ఆయన పేరూ ఒకటే. ఆయన వెంకటచలమారెడ్డి. నేను చెలమయ్య. ఆ పేరు బెట్టినందుకో ఏమో గానీ మాయమ్మ నన్ను చాన్నాళ్లపాటూ రెడ్డి బిడ్డ మాదిర్తోనే సాకింది. చాన్నాళ్లంటే – అమ్మ పాలు తాగినన్నాళ్లూ! ఆనక మా దొడ్లో రాతి గుంజకు కట్టేసిన బర్రె ఉన్న కొన్నాళ్లూ! అప్పుడు కరువొచ్చింది. వరిగింజ కాదుగదా, వరి గడ్డి కూడా మొలవకుండా గొడ్డుబోతై పోయింది నేల. గుంజకు కట్టే గొడ్డును తోలుకోని బొయ్యి లారీ ఎక్కించేసినాడు మా నాయన. నేనప్పటికి సరిగ్గా గోచీ పెట్టుకోవడమైనా ఎరగను. కానీ చేతికి మాత్రం ఓ కర్రొచ్చింది. దాన్ని బట్టుకోని ‘హేయ్.. హేయ్…’మని అదిలించుకుంటూ రెడ్డేరి గొడ్లను కాయడం మొదులుబెట్టినా. ‘గిల్లితే పాలు కారతాయమ్మా నా బిడ్డని…’ అంటూ నా బుగ్గలు పట్టుకోని మురిసిపోయేది అమ్మ. నల్లగా ఉండే బుగ్గల్లోంచి తెల్ల పాలు ఎట్ట కారతాయో నాకు తెలిసేది కాదు. నాలుగు దినాలు గడిచేపాటికి ఒళ్లు కొంచెం కాయగాసింది. ఆలోగా వాడలోనే ఇంకో గోచీగాడు తయారయినాడు, గొడ్లకాడికి. నేను అది మానేసి పొలంలో కూలికి పోవడం మొదులుబెట్టినా…

మీసాలు పూసే వయసులో మునువైపోయింది. వీడు బుట్టినాడు. రాజా మాదిర్తో ఉండాడు బిడ్డ అని మురిసిపొయినా. కాకి పిల్ల కాకికి ముద్దే అనుకో… కానీ రంగు నాకంటె లచ్చసార్లు మేకప్పేసినట్టుగా ఉండేటోడు. వాణ్నిజూసే కళ్లతో గోచిబెట్టి గొడ్లకాడికి పంపిచ్చే రోజుని కానలేకపోయినా. ఆగలేకపోయినా. చిన్నది బుట్టగానే, యీణ్ని తీస్కబోయి టౌన్లో కనిపించిన ప్రతోణ్నీ కాళ్లూ గడుపులూ బట్టుకోని గవుర్మెంటు ఆస్టల్లో యేసినా. ఆడకాణ్నించీ కొంపలో మేం ముగ్గురం తిండికి పోగా మిగిలిందో సగిలిందో ఏ రూక ఉన్నా అంతా పోగుజేసి నెలకోమారు వెళ్లి వాడి మొహాన్నే ముడుపు కడతా ఉంటిని. మిగిలిన శ్రమంతా వోడిదే. వాడిపాటికి చదువుకుంటూ బొయినాడు.

కస్టమే కాపాడిందో, కులమే కనికరించిందో… మొత్తానికి మా వాడికి సర్కారు కొలువైంది. అట్టాంటిట్టాంటి కొలువు గాదు. నెలబొడిసే సరికి కళ్లు చెదిరిపోయే మాదిరి జీతంతో! ఒకటి రెండు మార్లు ఇంటికొచ్చినాడు. పదోపరకో మా చేతిలో బెట్టినట్టు గూడా గుర్తు. వాళ్లమ్మకో కోక కూడా కొనిచ్చినాడు. ఆనక- కులం మీరలేదు గానీ టౌన్లోనే, చూస్తే దొరసానేమో అనిపించే పిల్లను పెండ్లాడినాడు. మనువు సంగతి మాకు చాన్నాళ్లకు గానీ తెలియలా. ఆణ్నించే అంతా మొదలయ్యింది.

బిడ్డ ఎక్కొచ్చినాడంటే ఎవుడైనా ఏం కోరుకుంటాడు. ఏదో వయసు పైబడ్డాక కూటికి జరిగిపోయే మాదిరిగా ఇంత గంజి పోస్తే సాలనుకుంటాడు. ఆ గంజికయ్యే సొమ్ము సంగతి గురించి కాదు నే జెప్పేది…! ఎవుడైనా సరే, తాము కన్న బిడ్డలు- తమను కన్నవాళ్ల మాదిరిగా మారాలని కలగంటాడు. తమను బిడ్డల్లా జూస్కోవాలని అనుకుంటాడు. కానీ నేను ఇంకా చాలా చాలా కలలు బెట్టుకున్నా నా బిడ్డ మీద.

మా వాడనుంచి వోడొక్కడే అంతో ఇంతో చదూకున్నాడు. చెప్పా గదా, ఏదో ఒక మాదిరిగా, మంచి కొలువులోనే నిమ్మళంగా కుదురుకున్నాడు. నా కోరిక ఏందిరా అంటే… వాడు నా పల్లెలోనే, నా వాడలోనే ఉండాల. నా బిడ్డ ఇదిగో యింత సంపాదిస్తాండాడని రెడ్ల ముందు రొమ్ము ఇరుసుకుంటా నడవాలనేది గాదు సామీ దాని వుద్దేశం. నాబిడ్డ ఇస్త్రీ గుడ్డలేస్కుంటా టౌనుకీ, ఇంటికీ తిరగతా ఉంటే… వాడలో ఇంకో పదిమంది కళ్లల్లో నిప్పులు బడాల. అంటే ఇంకోటేందీ గాదు- అసూయ బుట్టాల. దాన్లోంచి ఆశ బుట్టాల. చదువు మీద మోజు బుట్టాల. వాళ్లందరూ తమ బిడ్డల్ని సదివించుకోవాల. అందరూ సల్లంగా బతకాల.

కానీ అట్టా జరిగిందా?

నా బిడ్డ వాడ మొగమే చూసేటోడు కాదు. దారితప్పి వచ్చినా, ఏదో అడవులు బట్టిపోయిన అన్నల మాదిర్తో అర్దరాతిరికాడ ఇంటికొచ్చేవాడు. తెల్లారగట్ల సద్ది కలపక ముందే ఎల్లిపోయేవోడు. వాడి కడుపు పండి బంగారం లాంటి ఇద్దరు బిడ్డలు బుట్టినారు. బొమ్మలే! అట్టాంటోళ్లు జన్మకోమారైనా నా వాడలో కాలు బెట్టి ఉంటే… వాడ మొత్తం అంతా వాళ్లన్జూసి తమ బిడ్డల్ని చదివించుకుని బాగుపడిపోడానికి ఎగబడతారని అనిపించేది నాకు. ఒకటిరెండు మార్లు ఒళ్లు చెప్పిన మాట ఇనకపోతే ఆస్పత్రికని బొయ్యి, గతిలేక టౌన్లో వాడి యింట్లో ఉండినాగానీ, బందిఖానానే అనిపించేది. రోజులిట్టా ఉంటే – నాతో కలిసి సద్దికూడు పంచుకోని, ఎరగడ్డ పంచుకోని నడిసిన నా పెండ్లాం మద్దెలోనే కాడి దించేసింది! సుకపడిపోయింది! తలకొరివి పెట్టాల్సిన వాడికి తప్పలేదు గానీ, గంగాగోదార్లు పొంగి ఆరోజంతా అలుక్కుపోయి మనసబారిన నాకళ్లకి దొరసాని గానీ, బంగారు బొమ్మలుగానీ కనిపించనేలే! ఆనక ఓమారు వోడొచ్చి ‘నువ్వొక్కడివీ ఎందుకిక్కడ? వచ్చి నాకాడ పడుంటే పువ్వుల్లో బెట్టి జూస్కోనా?’ అన్నాడు. గుండెలోంచి వచ్చినాయో, గొంతులోంచి జారినాయో ఆ మాటలు మాత్తరం నాకు అంత రుచించలా. నేను పువ్వుల్లో ‘పడుం’డడానిగ్గాదు వోణ్ని చదివించింది. వాడ బడిలో సదువు సగం సాగగానే, సంకనాకిపోతుందని, ఇద్దరు ముగ్గురు తమ బిడ్డల్ని టౌను ఆస్టళ్లలో ఎయ్యడానికి తీస్కబొయ్యి వీణ్ని కొంచెం మాటసాయం జేయమంటే మొకం చాటేసినాడంట! ఖాళీగా ఎనక్కొచ్కి, నా మొహాన ఉమ్మినంత పన్జేసినారు. నా మనసు ఇరిగిపొయ్యింది. ఒక దీపం ముట్టించినప్పుడు, అది నలుగురి బతుకుల్లో చీకటిని మింగేసినప్పుడే మనకు నిమ్మళంగా ఉంటుంది. ‘నా వెల్తురు నాకు మాత్తరమే’ అనుకుంటా అది బొయ్యి చీకటి గుయ్యారంలో దాక్కుంటే దాని బతుకు ఎవుడిక్కావాల?

అయ్యా అదీ సంగతి!

నా పేరు లక్ష్మీనారాయణ.

పేరు జూస్తే వాడలో బుట్టినట్టుగా లేదే… అని మీకు అనిపించొచ్చు. నిజమే. వాడలో పుట్టింది నేను, నా పేరు కాదు. మా నాన్న నన్ను తీస్కెళ్లి టౌను స్కూల్లో చేర్చినప్పుడు అక్కడి అయ్యోరే ఆ పేరు పెట్టినాడు.

నా సమస్య గురించి చెప్పకపోతే అందరూ కలసి ఉమ్మడిగా నా మొహాన ఉమ్మేసే అవకాశం ఉంది. ఎందుకంటారా? సారీ, ఇంకా చెప్పలేదు కదూ. నేనే చలమయ్య కొడుకుని. నా గురించే ఇంతసేపు చెలమయ్య గొంతుచించుకున్నది. మళ్లీ సారీ, అలా కోసం వచ్చినప్పుడెల్లా మాట జారిపోతుంటాను. టు బి ఫ్రాంక్, ఇలాంటివే నన్ను చాలా ఇరుకున పెట్టస్తుంటాయి. నా గురించి చాలామందిలో, అదే ఇలాంటి వాళ్లలో, బ్యాడ్ ఒపీనియన్స్ క్రియేట్ చేస్తుంటాయి. అందుకే ఇకమీదట కాస్త ఒళ్లూ, నాలుకా అదుపులో పెట్టుకుని వీలైనంత డిప్లొమేటిగ్గా అసలు విషయం చెప్పడానికి ప్రయత్నిస్తాను. అలా అనగానే అబద్ధాలు మొదలెడతానని మాత్రం అనుమానించకండి. కన్ఫెషన్ కు సిద్ధపడ్డాను కాబట్టే, డిప్లొమసీ విషయమూ దాచుకోకుండా చెబుతున్నాను.

మా నాన్న నన్ను హాస్టల్లో చేర్పించడమూ, అప్పుడప్పుడూ పదో పరకో తెచ్చిస్తుండడమూ కరెక్టే. కానీ చదువూ కొలువూ రావడానికి అవి మాత్రం చాలవు. నా తెలివి, నా కష్టం, నా పరిశ్రమ, నిద్రలేని రాత్రులు, తిండి గురించి అనుకోకుండా చదివిన రోజులు… ఇలాంటివి ఎన్నోఉన్నాయి. సరే చదువు పూర్తయి బ్రహ్మాండమైన ఉద్యోగంలో కురురుకున్నాను.

అమ్మానాన్నలు పూనుకుని పెళ్లిచేయడం అంటేనే ఏదో విచిత్రంగా అనిపిస్తుంది నాకు. బాల్య వివాహాల రోజుల్లో బహుశా అలాంటి అవసరం ఉండేదేమో. మనిషి తన తిండీ నిద్ర గురించి నిర్ణయించుకోగలిగినప్పుడు ఎవరిని కట్టుకోవాలో, అదే, మ్యారేజి చేసుకోవాలో డిసైడ్ చేసుకోలేడా? చేసుకోవాలి. చేసుకున్నాను. అది తప్పెట్టా అవుతుంది.

నా వైఫ్ నాకంటె గొప్ప ఉద్యోగంలో ఉన్నది. కోడలు కొంపకు రాలేదని ఏడ్చి… బాధపడితే ఎలా? తను పొద్దుపొడిస్తే సద్ది కలుపుకోని ఎరగడ్డ కొరుక్కోని కాస్త ఎంగిలిపడి మధ్యాహ్నం రైతు పెట్టే సంగటి ముద్దతో సరిపెట్టుకుందామని పొలానికి వెళ్లే ఆమాంబాపతు కాదు. అదిగో, మళ్లీ ఆవేశం… జారిపోతున్నాను. మన్నించాలి. తల్లి గురించి మాట్లాడేటప్పుడు కూడా అదుపులో ఉండలేకపోతే ఇక నేను నేర్చుకున్న డిప్లొమసీకి అర్థం లేదు. నా వైఫ్ కి ఖాళీ చిక్కడం చాలా అరుదు. రెవిన్యూ డివిజినల్ ఆఫీసరంటే మాటలేం కాదు. పల్లెలో కాలు మోపితేనే అంతా చుట్టు ముట్టేస్తారు. ఇంకా వాడల్లోకి రావాలని కోరుకుంటే ఎలా?

డిగ్రీ పూర్తయి, ఉద్యోగంలో చేరిన చాన్నాళ్ల వరకు కూడా నేను తరచూ పల్లెకు వచ్చేవాడిని. ఎవ్విరీటైమ్ ఐ ఫేస్డ్ వెరీ బిట్టర్ ఎక్స్‌పీరియన్సెస్! వాటన్నింటినీ ఎలా మరిచిపోగలను.  నెట్ సర్ఫ్ చేసి ఆన్ లైన్లో బుక్ చేసుకుని, కొన్ని వేలు నావి కాదనుకున్నానంటే… తిరుపతి వెంకటేశ్వరస్వామి కొలువులో తివాచీమీద కూర్చుండబెట్టి మరీ నా కుటుంబాన్నంతటినీ ఆశీర్వదిస్తారు పంతుళ్లు. అలాంటిది ఊరెళ్లినప్పుడు గుడి మాట వస్తే… వీధిలోంచే ఓ దణ్నం విసిరెయ్యమని మా అయ్య హుకుం. హౌ ఎంబరాసింగ్? దేవుడి గొడవ ఎందుకులే? ముందు మనుషుల గురించి మాటాడుకుందాం.

మా పల్లె సర్పంచి ఉన్నాడు. నా ఈడు వాడే. దూరం దూరంగానే అయినా చిన్నప్పుడు కొన్ని ఆటలు కలిసే ఆడుకున్నట్టు గుర్తు. ఇంటర్ దాకా చదివినట్లున్నాడు…! చదువు సాగలేదో- ఇంటిదగ్గర సాగుబాటు ఎక్కువై సాగించదలచుకోలేదో నాకు తెలియదు గానీ అంతటితో ఆపేశాడు. ఎకరాలకొద్దీ పొలం, పుట్టిలకొద్దీ ధాన్యం, పెట్టెలకొద్దీ డబ్బు, పెట్టింది తిని పడుండే మా అయ్య లాంటి జీతగాళ్లు. ఎన్నెకరాల వ్యవసాయమైనా వాడు సంపాదనకంటె నా నెలజీతమే కచ్చితంగా ఎక్కువ. నా డిపార్టుమెంటుతో వాడికి పెద్ద అవసరం పడదు గానీ, ఉంటే వచ్చినప్పుడెల్లా ఓ అరగంట వరండాలో నిలబెట్టించేవాణ్ని. వాడు నన్ను ఎలా ట్రీట్ చేసేవాడంటే… నాకు ఒళ్లంతా కంపరంగా ఉండేది. ‘అరేయ్ ఒరేయ్’ అనేవాడు. తొలినాళ్లలో విననట్టుగా తప్పించుకునేందుకు ప్రయత్నించా, ‘ఒరేయ్ అచ్చిగా…’ అంటూ స్పష్టంగా పిలిచేవాడు. చిన్నప్పుడు అలాంటి పేరేదో ఉండేదిట నాకు. అవమానం అనిపించేది. కారిడార్లో కారు దిగానంటే మొత్తం ఆఫీసులో భయం భక్తులు రాజ్యమేలుతాయి. అలాంటి నన్ను, వీడు ఇలా మాట్లాడతాడేమిటి? ముభావంగా ఉండి నా నిరసన తెలియజేస్తే ‘టౌను కెళ్లి చదివితే చలాకీగా కావాలిగానీ, అట్టా ముంగి అయినావేందిరా…’ అని ఎద్దేవా చేసేవాడు. పైగా అరుగు మీద కుర్చీలో కూర్చుని మాట్లాడుతోంటే మనం వీధిలో నిల్చునో లేదా ఎడంగా అరుగుమీద కూర్చునో వినాలి. ఓసారి కుర్చీ అందుకోబోతే ఈ చెలమయ్యే పొడిగా దగ్గాడు- హెచ్చరికగా! నా అవమానాలన్నీ ఒక ఎత్తు. నా కళ్లముందే ‘అరేయ్ చెలమా… ఒరేయ్ చెలమా…’ అంటూ మా అయ్యకు పనులు పురమాయించేవాడు. ఆ మాటలు నా మనసుకు రంపపు కోతగా ఉండేవి. అన్నీ భరిస్తూ ఎలా బతికేనో కూడా నాకు సరిగా గుర్తులేదు. క్రమంగా అసలు వాడకు వెళ్లడమే తగ్గించుకున్నాను. అమ్మ పొయ్యాక, నాన్నని వచ్చేయమన్నాను. విన్లేదు. అంతకంటె ఏం చేయగలను? బలవంతంగా తోలుకురావడానికి పశువు కాదు కదా!

ఇకపోతే పిల్లలు. అయాం సారీ. వారిని ఆ వాడలో కాలు పెట్టనివ్వడం నాకు ఇష్టం లేదు. ఓసారి వెళ్లినట్టు గుర్తుందిగానీ, తాగడానికి టౌన్నించే మినరల్ వాటర్ తీస్కెళ్లాం. అక్కడి బావుల్లో నీళ్లు తాగి వాళ్లకు జలుబు చేసినా నేను సహించలేను. పైగా చెప్పా కదా, నన్ను, మా నాన్నని ఇలా అసహ్యంగా ట్రీట్ చేయడం ఇవన్నీ వాళ్ల దృష్టికి రావడం నాకు ఇష్టం లేదు. ఇక ఊర్నించి వచ్చేవాళ్ల సంగతి. వచ్చినోళ్లకందరకూ ఏర్పాట్లు చేయడానికి నేనేం ఖాళీగా గోళ్లు గిల్లుకుంటూ లేను. గైడ్ చేస్తే తలకెక్కించుకోరు. పచ్చగా ఉన్నాను కదాని ఈ వాడజనాలకి నా ఇంటిని సత్రంగా మార్చలేను కదా?

దీపం వెలిగించడం వినడానికి బాగానే ఉంది. కానీ నలుగురికీ దారి చూపించాలనే భ్రమలో నా బతుకులో చిచ్చు పెట్టుకోలేను కదా?

ఐయాం సారీ.

నేనే నరసింహారెడ్డిని.

ఈ లక్ష్మీనారాయణ దొరగారి మాటల్ని బట్టి, ఆయన మనసును గాయపరచింది, బాధపెట్టింది నేనే. అలా దూదేకినట్టగా ఏకిపారేసింది నన్నే. ఈ పల్లెకి సర్పంచిని.

అసలు ఈ గొడవకి, నాకు ఏమైనా సంబంధం ఉందా? తేరగా దొరికినాను గదాని జుట్టుపట్టుకోని లాక్కొచ్చినట్టు ఉంది తప్పితే…! గుడిలోకి రానివ్వడం లేదనే సంగతి ఇప్పుడు చెబుతున్నాడు. దానిమీద ఇప్పటికే జరగాల్సినన్ని గొడవలు జరిగినాయి. అయినా ఆ గుడేమైనా నా అబ్బసొత్తా? ఊరుమ్మడిది. ఊళ్లో కట్టుబాటు ఎలా ఉంటే అలా నడుస్తుంది. రోడ్లోంచి మొక్కినంత మాత్రాన దేవుడు వీళ్లని చూడకుండా బొయ్యేదేం లేదు గదా. అయినా, వాడి అయ్యకు లేని బాధ వాడికెందుకో నాకు అర్థం కాదు. ఊరి కట్టుబాట్లని గౌరవించినంత వరకే గదా మనం మాత్రం మన గలిగేది!

‘అరేయ్’ అంటున్నానంట. మరేం అనాలి? పలక్కపోతే ‘అచ్చిగా’ అని కేకేసినా… అది కూడా తప్పేనా? వీడు టౌనుకు బొయ్యి బళ్లో జేరినప్పుడు లక్ష్మీనారాయణ అని కొత్త పేరు పెట్టుకున్నాడని నేనేమైనా కలగన్నానా? చెప్పందే ఎలా తెలుస్తుంది. తెలిస్తే నారాయణా అని పిలిచేవాణ్నేమో అంతేకాదా? అప్పడు అది కూడా తప్పుగానే కనిపించేదేమో. నాకు చదువు అబ్బని మాట నిజమే. అయినకాడికి చాలునని ఆపేసి వ్యవసాయం చేసుకుంటున్నా. నాన్న పొయ్యాక ఊరందరి మాట విని సర్పంచిగా ఉన్నా. వీడికి చదువు అబ్బింది. అచ్చొచ్చింది. చదివిందెల్లా బంగారమైంది. మంచి కొలువులో కుదురుకున్నాడు. అయినా, నా స్నేహితుల్లో సత్యనారాయణ, వెంకటేశ్వర్లు బాగానే చదువుకున్నారు. నాకు తెలిసి వీడికంటె పెద్ద ఉద్యోగాల్లోనే ఉన్నారు. సత్యనారాయణ అయితే ఉండేది అమెరికాలో. వాళ్లు ఊరొచ్చినప్పుడు కూడా ‘సత్తిగా, వెంకా’ అనే పిలుస్తుంటా. వాళ్లెప్పుడూ ఉడుక్కోలేదే? నీ మనసులో ఉలికిపాటు పెట్టుకోని నేను అవమానిస్తున్నానని భుజాలు తడుముకుంటే ఎలా? ఎంతసేపూ ఎలా తప్పించుకుందామా అని ఆలోచిస్తూ, తప్పు మొత్తం నా మీదకు నెడుతున్నట్టుగా కనిపిస్తోంది మరి!

ఎప్పుడో ఒకమారు అరుగుమీద కుర్చీలో కూర్చుని వాణ్ని వీధిలో నిలబెట్టి మాట్లాడినానంట. నేనలా కూర్చుని ఉండగా, వీధిలో వెళ్లే వాణ్ని పలకరించినా, ఓ మాట మాటాడి వెళ్లిపోయాడు. రోజుకి దారమ్మట వెళ్లే వంద మందిని పలకరిస్తుంటా… అందర్నీ అరుగుమీదికి పిలిచి కుర్చీలెయ్యాలంటే నాకెక్కడ కుదురుతుంది? ఎవరైనా సరే అక్కణ్నించే ఒక మాట జవాబు చెప్పి వెళ్లిపోతుంటారు. అందులో నేను వీడొక్కడినీ ప్రత్యేకంగా అవమానించేది ఏముంటుంది? నాకేమైనా వాడు కక్షిదారు గనుకనా? మానసికంగా కూడా అంత హోదా ఉన్నవాడైతే వచ్చికుర్చీలో కూర్చుంటే నే వద్దన్నానా? వాడి అయ్య పొడిగా దగ్గితే… అందుకు తప్పు నాదా? ఈనింద కొంచెమైనా నిలబడేలా కనిపిస్తోందా? నాకు అనిపిస్తోందేంటంటే… ఈ లక్ష్మీనారాయణ గారిది దేన్నైనా సరే పక్కవాడికి మీదకి నెట్టే బుద్ధి. ఒకవేళ నేను వీధిలో వెళ్లేవాణ్ని పలకరించకపోయినా- అది కూడా నా తప్పు కిందే, నేను వాణ్ని అవమానించడం కిందే రంగు పూసి వివరించగలడు. ఇలాంటి వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇన్ని మాటలు నేర్చినాడు గదా. అమ్మ బొయ్యినాక అయ్య సంగతేంజేసినాడు. నెలబెడితే నాలుగు డబ్బులు పంపిస్తాడు. వాటిల్ని పొయ్యిలో ఏస్తే కడుపు నిండతందా? ఎసుట్లో ఏస్తే కడుపు నిండతందా? ఏదీ జరగదు. ఏదో ముసిలోడు… ఇన్నాళ్లూ మనని నమ్ముకోనే బతికినాడు- కష్టం జేసే రోజులు బొయ్యి, కాటికి బొయ్యే రోజుకోసం కాసుకోని ఉండాడు… అని, తేలిక పన్లు చేయిస్తా… నేనే అంత ముద్ద పడేస్తేనే కడుపు నిండతా ఉంది. ‘అరేయ్ చెలమా…’ అని వోడి అయ్యని పిలిచేసరికి కడుపు రగిలిపోయినాదంట- విచిత్రం కాకపోతే! చెలమడిది మా నాయన వయసు అయినా, నేను చడ్డీలేసుకోక ముందునుంచీ అలాగే పిలుస్తున్నా. అలవాటైపోయింది. ఇప్పుడు ఈ లక్ష్మీనారాయణ దొరగారు పెద్ద కొలువు వెలగబెడుతున్నారని తెలిసి, జడిసి, ఆ అలవాటు ఎలా మార్చుకునేది? ఒకవేళ చలమయ్యగారూ అన్నాననుకోండి… ఎగతాళి అనుకుంటాడే తప్ప అసలు వాడూ నమ్మడు. నవ్విపోతాడు.

దీపం వెల్తురులో దారి కనిపించి వాడలో ఇంకో నలుగురు ఆ బాట పట్టి నడిస్తే తమ బతుకులు ఇరుకైపోతాయని లాభపడేవోడు భయపడాలిగానీ, నాకేంటి ఇబ్బంది. అసలు భయాన్ని మరుగున పెట్టేసి, ఇలా మాయజేసి మసిపూసేది ఎందుకు? ఎవుర్ని మోసం జెయ్యడానికి?

నేను నిమిత్తమాత్రుణ్ని. ఏం చేయగలను?

చెలమయ్య:

‘‘ఇదంతా… నేన్నిన్ను గొడ్లు కాయడం మాన్పించి బళ్లో ఎయ్యబట్టే కదా! మరి నువ్వు నీ బోటోళ్లు మరో నలుగురికి దారిజూపిస్తే కదా బతుక్కి అర్థం. పరమార్థం. నీబోటోళ్లు వాటాలేస్కోని ఇంకో నలుగుర్ని ఎక్కదీస్తా ఉంటేనే కదా… ఎప్పుటికైనా వాడలన్నీ కళకళలాడగలిగేది…’’

లక్ష్మీనారాయణ:

‘‘ఎవరి దారి వాళ్లు వెదుక్కోవాలి. ఒకరు దారి చూపిస్తే నడిచేవాళ్లు ఎంతదూరం రాగలరు. అయినా నడుస్తోంటే దారిపొడవునా ముళ్లూ, రాళ్లూ విసిరేవాళ్లు ఎక్కువయ్యారు. అందర్నీ నడిపించడానికి ఆ కష్టాలన్నీ భరించాల్సిన ఖర్మ నాకేటికి? వై షుడ్ ఐ…?’’

నరసింహారెడ్డి:

‘‘బాగానే ఉంది సంబరం. అయితే నేను ముళ్లు విసురుతున్నానంటావా? కొన్ని కట్టుబాట్లు, కొన్ని అలవాట్లు. అంతమాత్రాన జరిగే పాపాలన్నింటికీ నేనే పూచీనా? నువ్వు తప్పించుకునే ఆలోచనలో తప్పు రుద్దడానికి నా నెత్తి దొరికిందా? ఉరుమురిమి మంగలం మీద పడ్డమంటే ఇదే కాబోలు’’.

చెలమయ్య : ‘‘అదికాదూ……’’

లక్ష్మీనారాయణ : ‘‘ఈ ఖర్మేంటి…..’

నరసింహారెడ్డి : ‘‘నా మీద పులుముతారెందుకు….’’

ఏది మొదలు? ఏది కడ?

ఎలా తెలిసేది? ఎప్పటికి తేలేది?

.. ఈనాడు ఆదివారం అనుబంధం, 21 డిసెంబరు 2003

ఎడిటర్

ముప్ఫయ్యేళ్ల జర్నలిజం, రచన రంగాల్లో అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.

<svg
aria-hidden="true" class="sab-user_email" role="img" xmlns="http://www.w3.org/2000/svg" viewbox="0 0 512 512"><path
fill="currentColor" d="M502.3 190.8c3.9-3.1 9.7-.2 9.7 4.7V400c0 26.5-21.5 48-48 48H48c-26.5 0-48-21.5-48-48V195.6c0-5 5.7-7.8 9.7-4.7 22.4 17.4 52.1 39.5 154.1 113.6 21.1 15.4 56.7 47.8 92.2 47.6 35.7.3 72-32.8 92.3-47.6 102-74.1 131.6-96.3 154-113.7zM256 320c23.2.4 56.6-29.2 73.4-41.4 132.7-96.3 142.8-104.7 173.4-128.7 5.8-4.5 9.2-11.5 9.2-18.9v-19c0-26.5-21.5-48-48-48H48C21.5 64 0 85.5 0 112v19c0 7.4 3.4 14.3 9.2 18.9 30.6 23.9 40.7 32.4 173.4 128.7 16.8 12.2 50.2 41.8 73.4 41.4z"></path></svg>

ఆ రకంగా ఒక్కటయ్యారు
కోర్టు సీను- లోపల

ఆనందరావు – అప్పలమ్మ ఎదురెదురుగా బోనుల్లో నిలబడి ఉన్నారు.

బోలెడంతమంది లాయర్లు పెద్ద గౌనులేసుకుని పొడవాటి బల్లకు రెండువైపులా కుర్చీల్లో కూర్చుని ఏదో పని ఉన్నట్లుగా నటిస్తూ ముక్కుల మీదికి జారిన కళ్లజోళ్లలోంచి పుస్తకాల్లో ఏదో వెదుక్కుంటున్నారు.

వాళ్లందరూ అందంగా ఉన్నారు. వాతావరణం మందంగా (గ్రాంధికంలో గంభీరంగా) ఉంది.

హాలంతా సూది పడితే వినపడేంద నిశ్శబ్దంగా ఉన్నా… జడ్జి మాత్రం అందరూ తనవైపు చూడమని బతిమాలుతున్నట్లుగా… చెక్క సుత్తితో బల్లమీద మూడుమార్లు బాది ‘‘ఆడర్… ఆడర్…’’ అని కేకపెట్టాడు.

‘‘ఇందుమూలముగా ఈ ధర్మాసనం తీర్పుచెబున్నది ఏమనగా… ఆనందరావు- అప్పలమ్మ అనబడే ఈ ఇద్దరు పెళ్లి చేసుకుని ఏడాది గడిచి, ఓ బిడ్డకు జన్మనిచ్చినప్పటికినీ, ఒకరితో ఒకరు కలసి బతుకుటకు, పరస్పరము మనస్ఫూర్తిగా ఇష్టపడని కారణముగా… ఇన్నాళ్లు కలసి బతుకుటలో కోల్పోయిన స్వేచ్ఛ, ఆనందం ఏవైతే ఉండునో అవి తిరిగి పూర్తిస్థాయిలో పొందేలాగున తీర్మానించుచూ… విడాకులు మంజూరుచేయడమైనది.’’ చదివి న్యాయమూర్తిగారు తృప్తిగా కళ్లు మూసుకున్నారు. ‘హమ్మయ్య పంజరంలో చిక్కుకు పోయిన ఒక మనుషుల జంటకు స్వేచ్ఛ, ఆనందాల్ని ఇవ్వగలిగాను దేవుడా… నా సేవల్ని రికార్డు చేయి’ అనుకున్నాడాయన మనసులో… ఆ కాగితాల మీద సంతకం పెడుతూ.

కోర్టు సీను – వెలుపల మెట్లమీద…

పైమెట్టు మీద ఆనందరావు. కింద మెట్టు మీద అప్పలమ్మ.

‘‘ఏవండీ… కోర్టు ముద్రకొట్టి ఇచ్చేసింది కదాని… నాకు అన్యాయం చేయరు కదండీ…’’ అంది అప్పలమ్మ  ఆనందరావు చేతులు పట్టుకుని.

ఆనందరావు బెదిరిపోయినట్లుగా చుట్టూ ఓసారి కలయజూశాడు. అంతలో అప్పలమ్మ తాలూకు లాయరమ్మ, విడాకుల స్పెషలిస్టు డాకూరాణి వస్తుండడం చూసి ఒళ్లు బిగదీసి, కళ్లు ఆకాశానికేసి తిప్పాడు. డాకూరాణి నేరుగా వచ్చి అప్పలమ్మతో – ‘‘నేను ముందే చెప్పానుగా. ఈ డాకూరాణి కోర్టు హాల్లో మాటల్తో నిప్పులు చిరిగిందంటే… ఇక ఆది దంపతులకైనా విడాకులు రావాల్సిందేనని. కంగ్రాట్స్. అయినా ఈ మగజాతి చేతులు పట్టుకుని మాట్లాడుతున్నావా. వీళ్లవి చేతులు కాదు కాళ్లు. వీళ్లు నాలుగు కాళ్ల…’’

‘‘నువ్వుండమ్మా. ఫీజు ఇచ్చుకున్నా కదా… ఇక దయచేయ్!’’ విసుక్కుంది అప్పలమ్మ. పైటకొంగుతో ముక్కు చీదుకుని, అదే పైటకొంగుతో కళ్లు ఒత్తుకుంటూ!

డాకూరాణి అయోమయంగా వెళ్లిపోతుండగా…. ఆనందరావు మాత్రం గత్తరబిత్తరగా అటూ ఇటూ తిప్పితిప్పి చూస్తున్నాడు. తమను ఎవరైనా గమనిస్తున్నారేమో అన్నట్లుగా.

జిల్లా పరిషత్ ఆఫీసు సీను- వెలుపల

ఆటో ఆగింది. అందులోంచి నెలల పసిబిడ్డతో సహా అప్పలమ్మ దిగింది. నేరుగా ఆఫీసు వరండాలోకి వెళ్లి అక్కడ ఉన్న ఓ బెంచీపై కూర్చుంది. ఇంకా అక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు. నిద్రపోతున్న బిడ్డను తనకేసి పొదువుకుని, ఓసారి వరండా పైకప్పుకేసి లోతుగా చూసింది.

ట్రింగుం… ట్రింగుం… ట్రింగుం…. మ్యూజిక్కుతో కళ్లముందు చక్రాలు తిరుగుతుండగా ఫ్లాష్ బ్యాక్ సీను!

ఆనందరావు తాను జీవితాన్ని తెలివిగా ప్లాన్ చేసుకోవాలన్న దురాశ కక్కుర్తితో చాలా తరచుగా కుడితిలో కాలేస్తుంటాడు. డిగ్రీ పాసయి, ముప్పయ్యేళ్లు వచ్చేవరకూ గోళ్లు గిల్లుకుంటూ, రోడ్లు కొలుస్తూ, అమ్మాయిలకు బీట్ కొడుతూ తిరిగాడు. పిల్లనెవ్వరూ ఇవ్వరు కాబట్టి పెళ్లి ఆలోచన రాలేదు. అప్పుడు డీఎస్సీతో టీచరు పోస్టుల భర్తీ మొదలయింది. ఓ ప్రయత్నం చేద్దామని… జూలు విదిల్చి పొరుగు రాష్ట్రానికి వెళ్లి కొంత సొమ్ము వదిలించుకుని ఓ బీఈడీ సర్టిఫికేటు పుట్టించుకుని వచ్చాడు. పరీక్ష కూడా రాశాక… తనకు ఎంతో ఇష్టమైన చిలకజోస్యం వాడి దగ్గరకు వెళ్లాడు. వాడి దగ్గరకు వెళ్లగానే ఆ కోయదొర ఆదరంగా ఆహ్వానిస్తూ…

‘‘రా దొర! బంగారం లాంటి యేళలో వచ్చినావు. గ్రహాలే నిన్నీ లగ్గంలో యీడకి నడిపించి తెచ్చినాయి. కళ తాండవిస్తన్నాది నీ మోమున. సర్కారు కూడు తినాలని రాసి ఉంది నీకు’’ అన్నాడు. ‘అరె. నేను డిఎస్పీ రాసిన సంగతి వీడికి తెలిసిపోయినట్లుంది. ఈ కోయదొర మహా ఘటికుడె’ అనుకున్నాడు ఆనందరావు.

అంతలో చిలక వచ్చి వెంకటేశ్వరస్వామి ఉన్న కవరు తీసింది. ‘‘నాక్కూడా ఇద్దరా’’ ఆశగా అడిగాడు ఆనందరావు.

‘‘ఇది ఆ పోపిడి కాడు దొర! సామి తిరప్తి కొండమీద! అమ్మ తిరుచానూరు కాడ! పుంజు వొక కోనలో… పెట్ట వొక పేటలో…! అయినా గుబులేల… అదిగో సూడు… గురుడు, శుక్రుడు కళ్ల జోళ్లు సర్దుకుని నీకేసే ప్రేమగా చూస్తండారు. అదిగదిగో శని కాలిజోళ్లు సర్దుకుని పరుగు లగెత్తిస్తన్నాడు. దేవర చెప్పించిన మాట పొల్లయితే ఒట్టు. వచ్చి నీ మెట్టు తీసి కొట్టు’’ అన్నాడు ఆనందరావు గుండె గంతులేసింది. వాడికి ఓ యాభై చదివించుకుని, నెమ్మదిగా ఇంటికొచ్చాడు.

ఇక టీచరుద్యోగం వచ్చినట్టేనని అనుకున్నాడు. ఉద్యోగం మీద నమ్మకం చిక్కబడేసరికి, మనువు మీదికి మనసు మళ్లింది. మరో టీచరు తోడైతే బాగుంటుందనిపించింది. వెదుకులాడాడు. తనకులాగే డిఎస్సీ రాసిన అప్పలమ్మ అనే పల్లెటూరి అమ్మాయి దొరికింది. జాగెందుకు లెమ్మని చటుక్కున కట్టేసుకున్నాడు. అప్పలమ్మ చాలా మంచిది. గుణవంతురాలు. పల్లెటూరి నుంచి వచ్చింది కావడంతో డాంబికాల ఊసుకూడా తెలియనిది.

డిఎస్సీ రిజల్ట్సు పెల్ల తర్వాత వచ్చాయి.

ఆనందరావు- ప్యాంటు జేబులో ఇమిడేలో ఓ కత్తి సంపాదించి, జేబు చిరిగిపోకుండా దాన్ని జాగ్రత్తగా చేతి రుమాలులో చుట్టి దాచుకున్నాడు. వరుసగా వారం రోజుల పాటు రాత్రనకా… పగలనకా… ఊర్లో ఉన్న అన్ని పార్కులు, బస్సుస్టాండులు, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్ల వెలుపల ఫ్లాట్ ఫారమ్ లు లాంటి తనకు తెలిసిన అన్ని చోట్లకూ తిరిగాడు. చివరికి ఓ ఆదివారం పార్కులో దొరికాడు కోయదొర. వాణ్ని దొరకబుచ్చుకుని…

‘‘వారం నుంచి వెదుకుతున్నా నీకోసం’’ వగరుస్తూ అన్నాడు ఆనందరావు.

‘‘నోరు తీపి చేస్తావా దొర’’ అడిగాడు వాడు.

‘‘కాదు. నాలిక కోస్తా’’ రుమారులోంచి జాగ్రత్తగా కత్తి బయటకు తీశాడు ఆనందరావు.

‘‘చాల్చాల్లే ఆపు దొర! ఆరోజు నూట పదహార్లు పెట్టవయ్యా దేవర సల్లగా సూసి నీ సిలకతో తీపి కబురు పంపతాడంటే యిన్నావా…? అందులో సగం కోసం యాభై సేతిలో పెట్టావ్. ఆనాడే అనుకున్న- ఇది కోసుడు బేరమని, ఇప్పుడు మళ్లీ వచ్చినావు నాలిక కోస్తనని… ఇంతకు ఏటయ్యిందో చెప్పు…’’ అన్నాడు.

తన బాధ మొత్తం చెప్పుకున్నాడు ఆనందరావు. డిఎస్సీలో తను ఫెయిల్ కావడం దగ్గర్నుంచీ… తన భార్యకు ఉద్యోగం రావడం వరకు!

‘‘ఆపాపు’’ హఠాత్తుగా అన్నాడు కోయదొర. అప్పలమ్మ ఉద్యోగం గురించి చెప్పగానే! ‘‘చూసినావా… నువ్వు సొమ్ము కోసినా… దేవర నీకు కడుపుకోత పెట్టలే. సర్కారు కూడు తింటావని అన్నాడేగానీ, నీకు కొలువవుతాదని చెప్పినాడా? నీ పెట్టకు కొలువైతే ఆ సర్కారు కూడు నీకు కాకుండా పోతదా! దేవరను నమ్మాలి దొర. నీకు మంచే జరగతంది. సిలకెప్పుడూ సత్యమే పలకతాది’’ అని మరో నాలుగు మాటలు చెప్పి, ఆనందరావును నమ్మించి, అతని కాతాలోనే ఓ కూల్ డ్రింక్ తాగి వెళ్లిపోయాడు కోయదొర.

ఆనందరావుక్కూడా నిజమే అనిపించింది. చిలక సత్యమే చెప్పిందనిపించింది. అయితే ‘పుంజు వొక కోనలో… పెట్ట వొక పేటలో…’ అన్న ఆరోజు చెప్పిన మాటలకు అర్థం ఏమిటో ఆతర్వాత తెలిసొచ్చింది.

అప్పలమ్మకు పోస్టంగు కూడా వచ్చిన తర్వాత!

అంటే అతిశయోక్తి అనుకుంటు గానీ, ఆనందరావు ఉండేది కాశ్మీరంలో అయితే… రామేశ్వరంలో వచ్చింది అప్పలమ్మకు పోస్టింగు! ఆ జిల్లాలో వాళ్ల సొంత ఊరు, పోస్టింగు వచ్చిన ఊరు తూర్పుపడమర అంచుల్లో ఉండేవి. ఉద్యోగం ఆనందంతో మనసారా నవ్వలేకపోయాడు- కనీసం కడుపారా ఏడవలేకపోయాడు ఆనందరావు. బిక్కుబిక్కుమంటూ భార్యను తీసుకుని రంగూ, రుచీ వాసనా తెలియని ఆ రామేశ్వరానికి వెళ్లాడు. చిన్న పల్లె అది. ఊరు కొత్త. ఇంట్లోంచి బయటకు కదిలేవాడు కాదు. అప్పలమ్మ  మాత్రం ఉదయాన్నే బడికి వెళ్లి సాయంత్రం అవుతుండగా వచ్చేది. ఆనందరావుకు రెండ్రోజులకు పిచ్చెక్కుతున్నట్లు అనిపించేది. బయట ఏదో వొక పని  చేద్దామన్నా… దొరికేంత పెద్ద ఊరు కాదది. అంతా  కలిపి యాభై గడప దాటని పల్లె. తనకు తానుగా వంట పనుల్ని నెత్తిన వేసుకున్నాడు. పొద్దున లేవగానే అంట్లు తోముకోవడం, వంట చేసుకోవడం… కాసేపు టీవీ చూస్తూ గడపడం. మధ్యాహ్నం పడుకుని, సాయంత్రం అప్పలమ్మ వచ్చేలోగా లేచి ఉండడం! మార్పులేని ఈ దినచర్యతో- ఓ నెల గడిచేసరికి జీవితం అంటే విరక్తి పుట్టింది. ఆ విరక్తిలోంచి రోషం పుట్టింది. ఉద్యోగం పురుష లక్షణం అనే డైలాగు, దాంతోపాటూ తానూ పురుషుణ్ని అను సంగతి ఒక్కసారిగా గుర్తొచ్చాయి.

ఓ మిత్రుడితో మాట్లాడి ఏదో ఒక జీతానికి ఓ కొట్టులో పద్దులు రాసే పనిలో కుదురుకున్నాడు ఆనందరావు.

ఉద్యోగం దొరికిందేగానీ, ఆనందం మాత్రం  మిగల్లేదు. ఆ ఉద్యోగం ఎక్కడంటే.. ఆనందరావు సొంత ఊరైన ఆ ఫలానా కాశ్మీరంలో…!

అప్పటికీ అప్పలమ్మ వద్దని చెప్పనే చెప్పింది. ఏదో ఒక జీతంతో కలిసి ఉందామంది. ఆనందరావు విన్లేదు. మొండిపట్టు పట్టాడు.

అప్పట్నించి మొదలయ ది. అప్పలమ్మ అదే పల్లెలో తప్పనిసరిగా ఉండిపోయింది. ఆనందరావే ప్రతి ఆదివారం అక్కడకు వెళ్లి వస్తుండేవాడు. రెండురోజులకోసారి అప్పలమ్మ అద్దెకున్న ఇంటి ఓనర్లకు ఫోన్చేసి, భార్యను పిలిపించి మాట్లాడేవాడు. ఈ రూపాణా పెరిగిన ప్రయాణ భత్యాలు, ఇతర ఖర్చులు అన్నీ కలిపి ఆనందరావు జీతం మొత్తం చెల్లయిపోయేది. పైసా మిగిలేది కాదు. అప్పలమ్మ ఓసారి లెక్కలు వేసి ఆ సంగతిని కూడా ఆనందరావుకు వివరించి భేషజాలకు పోకుండా పల్లెలోనే కలసి ఉందాం రమ్మని అనునయంగానే పిలిచినా, ఆనందరావు వినిపించుకోలేదు.

అయితే, ఇలాంటి సంసారంలోనూ ఏడాది తిరిగేసరికి వారికి ఓ బాబు పుట్టేశాడు.

రోజులిలా భారంగా…

సంసారం అలా ఫోన్లమీద, బస్సుల మీద గడుస్తుండగా…

కోరిన కోనలో వాన కురిసినట్లుగా- టీచర్లకు ట్రాన్స్ ఫర్ల సీజనొచ్చింది.

అప్పలమ్మ ఆశగా ఆనందరావు పనిచేసే దుకాణానికి ఫోను చేసి, ‘‘మా ఎంఈవో ట్రాన్స్ ఫర్లు కావాల్సిన వాళ్లు అప్లికేషన్లు పెట్టుకొమ్మన్నాడు. నేను కూడా పెట్టేశా! ఇక ఎంచక్కా మనం ఇద్దరం కలసి మన ఊళ్లోనే ఉండచ్చు.’’ అంది సంబరంగా.

ఆనందరావు సంతోషానికీ పట్టపగ్గాల్లేకుండా పోయింది. ఆరోజే గుడికెళ్లి ఆ ట్రాన్స్ ఫర్ అయ్యేలా చూడమని దేవుడికి కొబ్బరి కాయ కొట్టివచ్చాడు.

ఆ తర్వాత రెండు రోజుల వరకు ఆ ఫలానా రామేశ్వరంలో అప్పలమ్మ, సొంత ఊరు ఫలానా కాశ్మీరంలో ఆనందరావు ట్రాన్స్ ఫర్ ఊహల్లో తేలియాడుతూ కాలం గడిపేశారు.

‘‘మూడేళ్లు దాటితే తప్ప ట్రాన్స్ ఫర్ చేయరటండీ…’’ అంది అప్పలమ్మ.

‘‘రూల్సు బుక్కులో అన్నీ అలాగే ఉంటాయి లేవోయ్! ఆ రూల్సుకు బోల్డు హోల్సు కూడా ఉంటాయి. అలాంటివి వెదకి పట్టుకుని , ఎవరినైనా అడిగిగానీ తెలుసుకోలేకపోయావా?’’ తేలిగ్గా అన్నాడు ఆనందరావు.

‘‘ఉన్న హోల్సు అన్నీ తెలుసుకున్నాను గానీ… అవి మనకు ఉపయోగపడేలా లేవండీ…’’ దిగులుగా అంది అప్పలమ్మ.

‘‘ఒక ఈజీ  మార్గం చెప్పు’’ అడిగాడు.

‘‘అన్ మ్యారీడ్ వుమనప్ అయితే వెంటనే సొంత ఊరి దగ్గరగా పంపేస్తార్ట’’ తొలగని దిగులుతోనే అంది!

‘‘ఓస్ అంతేగా! ట్రాన్స్ ఫర్ కౌన్సిలింగ్ జరిగే రోజుకు తాళి తీసేసి వెళ్లి అన్ మ్య రీడ్ అంటే పోయె…’’

‘‘ఇంకా అన్ మ్యారీడ్ ఏంటండీ. మొన్నే మెటర్నిటీ లీవు కూడా తీసేసుకున్నాక!’’ గుర్తు చేసింది అప్పలమ్మ.

‘‘ఓహో’’ సాలోచనగా అని- ‘‘అయినా మెటర్నిటీ లీవుకు పెళ్లి కావాలన్న రూలెక్కడుందోయ్’’ అన్నాడు ఆనందరావు.

భార్య కళ్లలో కురిసిన నిప్పులు చురుక్కుమనిపించిన కొద్దిసేపటి తర్వాతగానీ- తాను ఏం తప్పు మాట్లాడాడో అతడికి అర్థం కాలేదు.‘‘సారీ, సారీ…’’ అన్నాడు నొచ్చుకుంటున్నట్లుగా.

‘‘జబ్బు పడ్డానని ఓ సర్టిఫికేటు పుట్టిస్తే సరిపోతుందిట’’ మళ్లీ ఆశగా అంది అప్పలమ్మ.

‘‘అయితే నీకు క్యాన్సరు తెప్పిద్దామా?’’ అడిగాడు ఆనందరావు.

‘‘క్యాన్సరు వస్తే కుదర్దు. నరాల బలహీనత, ఫిట్సు వంటి రోగాలు రావాలిట’’ అంది నీరసంగా.

‘‘ఇంత పుష్టిగా కనిపిస్తూ నీకు నరాల బలహీనత అంటే నవ్వుతారేమోయ’’ అన్నాడు ఆనందరావు. అప్పలమ్మ అందంగా నవ్వింది.

‘‘నా బుర్రలో ఓ మెరుపు మెరిసింది’’ అరిచాడు ఆనందరావు.

‘‘అప్పలమ్మ’’పిలిచాడు బంట్రోతు.

జిల్లా పరిషత్తు ఆఫీసు వరండాలో బెంచీపై కూర్చుని ఉంది అప్పలమ్మ. ఒడిలో బిడ్డను పెట్టుకుని.

లేచి, బిడ్డను భుజం మీదికి మార్చుకుని లోపలకు వెళ్లింది.

దరఖాస్తులోకి తేరిపారజూసిన డీఈవో ఆమెకేసి తిరిగి మిడిగుడ్లేసుకుని చూస్తూ… ‘‘అదేమిటమ్మాయ్! అన్ మ్యారీడ్ కోటాలో ట్రాన్స్ ఫర్ కు అప్లికేషన్ పెట్టావ్’’ అన్నాడు.

‘‘పైగా చంకలో బిడ్డతో వచ్చి’’ ఆయన పక్కనే కూర్చున్న ముగ్గురిలో ఎవరో ఒకరు అని, కిసుక్కున నవ్వారు.

డీఈవో అన్నందుకా, లేక పక్కన ఉన్నవాడు నవ్వినందుకా… అర్థం కాకమ దే… అప్పలమ్మ కళ్లలో కొళాయి తిప్పేసింది. దెబ్బకు అందరూ గాభరాపడిపోయారు.

ఆ మాట అడగ్గానే కొళాయి తిప్పడానికి, పాపం చాలా రోజుల్నించీ ప్రాక్టీసు చేసింది మరి!

ఒక్కసారిగా అంతా గాభరాపడిపోయారు. ‘‘ఏమైందమ్మాయ్’’ మంచినీళ్ల గ్లాసు అందిస్తూ అడిగాడు డిఈవో.

‘‘మీకు అప్లికేషను పెట్టిన నాటికి మా కేసు కోర్టులో పెండిగులో ఉంది సార్… వారం కిందటే తీర్జు వచ్చేసింది. మా వారు డైవోర్సు ఇచ్చేశారు సార్… ఇదిగో నా ప్రాణానికి ఈ పసిబిడ్డ కూడా…’’ కొళాయి ఆగిపోయినా గొంతులో గరగర జారిపోకుండా జాగ్రత్తగా చెప్పింది.

డీఈవో బుగ్గల మీంచి రెండు నీటి చుక్కలు జారి కింత అప్లికేషను మీద టప్పున పడ్డాయి.

స్కూలు సీను. లోపల

డీఈవో ఇన్ స్పెక్షను జరుగుతోంది. అంతా పూర్తయింది. ఇక స్కూలు లాంగ్ బెల్ మోగబోతుండగా…

డీఈవో అడిగాడు ‘‘ఏమ్మా! బాబు బాగున్నాడా…’’

‘‘బాగున్నాడు సార్’’ అప్పలమ్మ పూర్తి చేసేలోగానే ఆనంతరావు స్కూటరు ముందు ఓ పిల్లాణ్ని నిల్చోబెట్టుకుని బుర్రున అక్కడికి వచ్చేశాడు.

అంతలో లాంగ్ బెల్లు మోగింది.

‘‘అదిగో సార్. మా బాబే’’ స్కూటరులో బాబును డీఈవోకు చూపిస్తూ అంది అప్పలమ్మ.

‘‘అంటే… ఆయన… నువ్వు మళ్లీ…’’ పొంతనలేని పొడి మాటలతో సందేహం వెలిబుచ్చాడాయన.

‘‘ఈయన మొదటి ఆయనే సార్. అప్పుడు కోర్టు విడగొడుతూ, విడాకులివ్వబట్టే ఇప్పుడిలా కలిసి ఉంటున్నాం.’’

నమస్తే పెట్టి, నవ్వుతూ వెళ్లి స్కూటరు వెనక కూర్చుంది అప్పలమ్మ.

బదిలీ

కె ఎ మునిసురేష్ పిళ్లె

మౌలికంగా జర్నలిస్టు. రచయిత. సుమారు ముప్ఫయ్యేళ్లుగా రాస్తున్నారు. తండ్రి ఎల్లయ్య స్థాపించిన ఆదర్శిని పత్రికతో రచనలు మొదలు పెట్టారు. రెండు కథా సంపుటులు ‘పూర్ణమూ.. నిరంతరమూ..’, ‘రాతి తయారీ’, ఒక నవల ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’ ప్రచురించారు.

whatsapp msg

sureshpillai.com

<svg
aria-hidden="true" class="sab-facebook" role="img" xmlns="http://www.w3.org/2000/svg" viewbox="0 0 264 512"><path
fill="currentColor" d="M76.7 512V283H0v-91h76.7v-71.7C76.7 42.4 124.3 0 193.8 0c33.3 0 61.9 2.5 70.2 3.6V85h-48.2c-37.8 0-45.1 18-45.1 44.3V192H256l-11.7 91h-73.6v229"></path></svg><svg
aria-hidden="true" class="sab-twitter" role="img" xmlns="http://www.w3.org/2000/svg" viewbox="0 0 30 30"><path
d="M26.37,26l-8.795-12.822l0.015,0.012L25.52,4h-2.65l-6.46,7.48L11.28,4H4.33l8.211,11.971L12.54,15.97L3.88,26h2.65 l7.182-8.322L19.42,26H26.37z M10.23,6l12.34,18h-2.1L8.12,6H10.23z" /></svg><svg
aria-hidden="true" class="sab-instagram" role="img" xmlns="http://www.w3.org/2000/svg" viewbox="0 0 448 512"><path
fill="currentColor" d="M224.1 141c-63.6 0-114.9 51.3-114.9 114.9s51.3 114.9 114.9 114.9S339 319.5 339 255.9 287.7 141 224.1 141zm0 189.6c-41.1 0-74.7-33.5-74.7-74.7s33.5-74.7 74.7-74.7 74.7 33.5 74.7 74.7-33.6 74.7-74.7 74.7zm146.4-194.3c0 14.9-12 26.8-26.8 26.8-14.9 0-26.8-12-26.8-26.8s12-26.8 26.8-26.8 26.8 12 26.8 26.8zm76.1 27.2c-1.7-35.9-9.9-67.7-36.2-93.9-26.2-26.2-58-34.4-93.9-36.2-37-2.1-147.9-2.1-184.9 0-35.8 1.7-67.6 9.9-93.9 36.1s-34.4 58-36.2 93.9c-2.1 37-2.1 147.9 0 184.9 1.7 35.9 9.9 67.7 36.2 93.9s58 34.4 93.9 36.2c37 2.1 147.9 2.1 184.9 0 35.9-1.7 67.7-9.9 93.9-36.2 26.2-26.2 34.4-58 36.2-93.9 2.1-37 2.1-147.8 0-184.8zM398.8 388c-7.8 19.6-22.9 34.7-42.6 42.6-29.5 11.7-99.5 9-132.1 9s-102.7 2.6-132.1-9c-19.6-7.8-34.7-22.9-42.6-42.6-11.7-29.5-9-99.5-9-132.1s-2.6-102.7 9-132.1c7.8-19.6 22.9-34.7 42.6-42.6 29.5-11.7 99.5-9 132.1-9s102.7-2.6 132.1 9c19.6 7.8 34.7 22.9 42.6 42.6 11.7 29.5 9 99.5 9 132.1s2.7 102.7-9 132.1z"></path></svg><svg
height="512" class="sab-phone" role="img" viewbox="0 0 512 512" width="512" xmlns="http://www.w3.org/2000/svg"><path
d="m512.833707 108.630223c0-6.545455-1.212121-15.0909095-3.636363-25.6363641-2.424243-10.5454545-4.969697-18.8484848-7.636364-24.9090909-5.090909-12.1212121-19.878788-24.969697-44.363636-38.5454545-22.787879-12.36363641-45.333334-18.54545459-67.636364-18.54545459-6.545455 0-12.909091.42424242-19.090909 1.27272727s-13.151515 2.36363636-20.909091 4.54545455c-7.757576 2.18181818-13.515152 3.93939397-17.272727 5.27272727-3.757576 1.3333333-10.484849 3.8181818-20.181819 7.4545455-9.696969 3.6363636-15.636363 5.8181818-17.818181 6.5454545-23.757576 8.4848485-44.969697 18.5454545-63.636364 30.1818182-31.030303 19.1515151-63.090909 45.2727268-96.181818 78.3636368-33.090909 33.090909-59.2121214 65.151515-78.3636365 96.181818-11.6363637 18.666666-21.6969697 39.878788-30.1818182 63.636363-.7272727 2.181819-2.9090909 8.121212-6.5454546 17.818182-3.6363636 9.69697-6.1212121 16.424243-7.4545454 20.181818-1.3333333 3.757576-3.0909091 9.515152-5.27272729 17.272728-2.18181818 7.757575-3.69696969 14.727272-4.54545454 20.909091-.84848485 6.181818-1.27272727 12.545454-1.27272727 19.090909 0 22.30303 6.18181818 44.848484 18.5454545 67.636363 13.5757576 24.484849 26.4242425 39.272728 38.5454546 44.363637 6.060606 2.666666 14.3636364 5.212121 24.9090909 7.636363 10.5454545 2.424243 19.0909088 3.636364 25.6363638 3.636364 3.393939 0 5.939394-.363636 7.636363-1.090909 4.363637-1.454546 10.787879-10.666667 19.272728-27.636364 2.666666-4.60606 6.30303-11.151515 10.909091-19.636363 4.60606-8.484849 8.848484-16.181819 12.727272-23.09091 3.878788-6.90909 7.636364-13.393939 11.272728-19.454545.727272-.969697 2.848484-4 6.363636-9.090909s6.121212-9.393939 7.818182-12.909091 2.545454-6.969697 2.545454-10.363636c0-4.848485-3.454545-10.909091-10.363636-18.181819-6.909091-7.272727-14.424242-13.939393-22.545455-20-8.121212-6.060606-15.636363-12.484848-22.545454-19.272727s-10.363636-12.363636-10.363636-16.727273c0-2.181818.60606-4.90909 1.818181-8.181818 1.212122-3.272727 2.242425-5.757575 3.090909-7.454545.848485-1.69697 2.545455-4.606061 5.09091-8.727273 2.545454-4.121212 3.939393-6.424242 4.181818-6.909091 18.424242-33.212121 39.515151-61.69697 63.272727-85.454545 23.757576-23.757576 52.242424-44.848485 85.454545-63.272728.484849-.242424 2.787879-1.636363 6.909091-4.181818 4.121212-2.545454 7.030303-4.242424 8.727273-5.090909s4.181818-1.878788 7.454546-3.090909c3.272727-1.212121 6-1.818182 8.181818-1.818182 4.363636 0 9.939394 3.454546 16.727272 10.363637 6.787879 6.909091 13.212122 14.424242 19.272728 22.545454s12.727272 15.636364 20 22.545455c7.272727 6.909091 13.333333 10.363636 18.181818 10.363636 3.393939 0 6.848485-.848485 10.363636-2.545454 3.515152-1.69697 7.818182-4.303031 12.909091-7.818182 5.090909-3.515152 8.121212-5.636364 9.090909-6.363637 6.060606-3.636363 12.545455-7.393939 19.454546-11.272727s14.60606-8.121212 23.090909-12.727273c8.484848-4.60606 15.030303-8.242424 19.636363-10.909091 16.969697-8.484848 26.181819-14.90909 27.636364-19.272727.727273-1.69697 1.090909-4.242424 1.090909-7.636363z" /></svg><svg
aria-hidden="true" class="sab-user_email" role="img" xmlns="http://www.w3.org/2000/svg" viewbox="0 0 512 512"><path
fill="currentColor" d="M502.3 190.8c3.9-3.1 9.7-.2 9.7 4.7V400c0 26.5-21.5 48-48 48H48c-26.5 0-48-21.5-48-48V195.6c0-5 5.7-7.8 9.7-4.7 22.4 17.4 52.1 39.5 154.1 113.6 21.1 15.4 56.7 47.8 92.2 47.6 35.7.3 72-32.8 92.3-47.6 102-74.1 131.6-96.3 154-113.7zM256 320c23.2.4 56.6-29.2 73.4-41.4 132.7-96.3 142.8-104.7 173.4-128.7 5.8-4.5 9.2-11.5 9.2-18.9v-19c0-26.5-21.5-48-48-48H48C21.5 64 0 85.5 0 112v19c0 7.4 3.4 14.3 9.2 18.9 30.6 23.9 40.7 32.4 173.4 128.7 16.8 12.2 50.2 41.8 73.4 41.4z"></path></svg>

చమించేయండి
‘‘సాములందరికీ దండాలు.
మీరందరూ గొప్పోల్లు. గొప్ప గొప్ప ఇసయాలే మాట్టాడతా వుంటారు. మీబోటోల్లకి నా బాద రవ్వంత చెప్పుకోవాలని నా ఆశ.
మారాయలసీమలో రతనాలు రాసులుబోసి అమ్మినారని అంటాంటారు గదా! అమ్మినారో లేదో ఎవురికిదెల్సు? మీరు జూడ్లేదు గదా. కానీ మీరంటారు. అదేంది సాములా- అంటే, మీరు సదూకున్న పుస్తకాలలో ఉండాదంటారు. కానీ నేనన్ను. పుస్తకాలలో వుండేదంతా నిజమని నమ్మే మీబోటోల్లు ఎర్రిబాగులోల్లంటా! రతనాలు అమ్మినారంటే నేను మాత్తరమొప్పుకోను. నిజానికి ఆడ ఏముండాదో నాకు దెల్సు. రాల్లూరప్పలూ, కరువూ కాటకమూ, ఆకలీ ఏడ్పులూ, కచ్చలూ కార్పణ్యాలూ- అదంతా ఎందుకులెండి. సొల్లుకబుర్లూ, సోది కబుర్లూ జెప్పి యిసిగిస్తే చమించేయండి.
నేను కూలోడ్ని. నాకు దెల్సింది రెండే. కస్టం దెలుసు. అది మా కండ నిండా ఉంటాది. ఆకలిదెలుసు. అది మా కడుపు నిండా ఉంటాది. ఇంకొన్ని గూడా దెలుసు. కడుపు నిండనప్పుడు కోపంతో పెల్లాన్ని  గొట్టడం దెలుసు. కడుపు నిండినప్పుడు సారాయి దాగడందెల్సు. అయితే తాగడానికో కండీషనుంది. కడుపు నిండినాక కాసులు మిగలాలన్న మాట. తాగినాక మళ్లీ పెళ్లాన్ని గొట్టడం తెల్సు. అది గొడ్డుగదా. మన సంపరదాయాలూ నీతులూ అదే పలుపుతాళ్లతో మన దొడ్లో గట్టేసిన గొడ్డు. మొత్తానికి నాకు పెళ్లాన్ని గొట్టడం మాత్రమే తెలుసునని మీలో ఎవురికయినా కోపమొస్తే చమించేయండి.
మాయి తప్పుడు బతుకులే. తాగుబోతు బతుకులే. కాని ఒక్కటి మాత్రం నిజం. అయ్యా, మేం డబ్బుతో ఒళ్లు బలుపెక్కి తాగడం మొదులుబెట్టలా. ఏ పేదోడి బుతకు ఎట్టా కుంగిపోయినా దానికో కతుంటాది. మేము ఎందుకిట్టయిపోయినామో, మీకు తెల్దుగదా. కొంచెం దయబెట్టి యినండి. కడుపులో చల్ల కదలకుండా అవ్వ కుక్కిమంచం కాడ గూసోని కతలింటానో, అరటితోట్లో దాగుడుమూతలాడుకుంటానో గడపాల్సిన కూనలుగా ఉండే వయసులోనే, కడుపు చేతిలోబట్టుకోని కూలిపనులకు బోతిమి. అప్పుడేం పెద్ద పనుండేది  గాదు. కూలోల్లందరికీ నీల్లు మొయ్యడమో, అంగిడికిబొయ్యి రెడ్డికి, ఆయన లేనపుడు మేస్త్రీకి బీడీలు, సిగిరెట్లు సోడాలూ తెచ్చియ్యడమో – ఇదేపని. కాని మూతిమీద మగతనం పుట్టుకొచ్చే రోజులొచ్చేకాడికి అసలు కూలిపనంటే ఏందో తెలిసొచ్చింది. సద్దికూటేళకాడ్నించి సందేళ దాకా, వొంచిన్నడుమెత్తకుండా పన్జేస్తే మీక్కూడా దెలస్తాది. మంచమెక్కేకాడికి ఏకీలుకాకీలు ఇరిగిపోయినట్టండేది. ‘‘ఒల్లంతా నొప్పులుగుండాది రె డ్డా, రేపు పన్లోకి రానంటే’’, ‘‘ఓర్నీయవ్వ ఒల్లు నొప్పులని పని మానుకుంటావట్రా పిచ్చిముండాకొడకా, ఇదో ఈ రూపాయితో సారాయిదాగరా సిటికెలో బోత’’య్యని కూలికంటే రూపాయెక్కువిచ్చినాడు. అది మంచో చెడోదెల్సుకునే వయసుగాకపాయె. రోజుకూలీ రూపాయి బెరిగింది. ఆమందు కోసమేగదా అని అలవాటయిపోతిమి.
మెడకో గుదిబండ మాదిరి పెళ్లయింది. మొదట్లో అదిగూడా టౌనుకెల్లి కొత్త సినిమా జూసినంత మోజుగానే ఉండేది. కొంతకాలానికి పిలకాయలు కూడా బుట్టినాక, ఒక్క కూలితో మూడు కడుపులు నింపాల్సిన అవసరమొచ్చినాక, అసలు పెళ్లంటే ఎంత పెమాదమో తెలిసొచ్చింది. ఏంజేస్తాం? మన ఆలోచనలు ఆకులు బట్టుకోవాలనే కాడికే చేతులు కాలిపోయే ఉండాయి. ఇబ్బందులెన్నొచ్చినా, నొప్పులకు రెండో మందేదీ తెలీక అప్పుడప్పుడూ డబ్బు మిగిలినప్పుడు తాగతా తాగతా అదే అలవాటుతో బతకతా ఉంటిమి.
కానీ ఇప్పుడు రోజులెట్టయిపాయ…
ఎంత కస్టం జేస్తే అన్ని కాసులు రాల్తాయన్న రోజులు పాతబడిపాయె. రోజంతా కండ కరగదీసినా… పొయ్యి రగల్తాదన్న నమ్మకం లేకపాయ. దానికెవుడిది తప్పంటాము.  కడుపుకి కూడుదింటే ఆ రైతుదీ తప్పనలేం. వాడు మాత్రమేంజేస్తాడు. బూమి వోడిదే, సగంబూమినో, పెళ్లాం పుస్తెల్నో, కుదవేసో అమ్మో ఆ బూమిని సాగుజేస్తే- అప్పుటికయినా అది పండితేగదా, గట్టిగా అడగదామంటే వాడికేం మిగిలిందని? ఉన్న సొమ్ములు  గూడా రాలగొట్టుకోవడం తప్ప ఒకరకంగా మా బతుకునే మేలు. అమ్ముకోవడానికి మాదగ్గర అవేమీ లేవుకాబట్టి. కూలి లేనిరోజు కడుపు నిండదు.  నమ్మి బియ్యం అప్పిచ్చే అయ్యలేడు. రేపటికయినా అప్పు దీర్చేంతటి కూలి డబ్బులు మా చేతికొస్తాయని ఎవుడూ నమ్మకపాయ. కానీ అప్పిచ్చే మారాజు ఇంకోడుండాడు. అయితే వోడిచ్చేది బియ్యంగాదు. సారాయి. ఆ మాదిరిగా అప్పుకాతా కింద డబ్బుల్లేనప్పుడూ, ఒకసారయినా డబ్బిచ్చి తాగకపోతే బాగుండదని ఉన్నప్పుడూ మొత్తానికి రోజూ తాగుడికి అలవాటయిపోతిమి. బార్లూ బ్రాందీలూ తప్ప నాటుసారా కొంపలెరగని మీ బాసలో బానిసలయిపోతిమి. చమించేయండి.
నేను దరిద్రపు ముండాకొడుకునే. కాని పొట్లాలుగాకుండా సీసాలు తాగుతున్నందుకు మీరందరూ పతివ్రతలూ పవిత్రులైపోతిరి. రాళ్లు పగిలే ఎండలో ఒక్కరోజు పనిజేసుంటే మీకు దెలస్తాది. ఒళ్లు మాగిపోతాది ఎండ పొరకతోగొట్టినట్లంటాది. నెత్తురంతా చెమటగా కారి యింకిపోతే – పొద్దుగుంకేకాడికి నరాల్లో సారాయి నింపేస్తే అలవాటయిన పేణానికి అదో ఇది. సరేమీకెందుకు? పగులంతా సల్లగా కార్లలో తిరిగితిరి. కాని సాయంకాలానికి బారుజేరిపోతిరి. అయినా నన్ను మీతో పోల్చుకోవడమేంది. గాడిదని గందర్వుడితోబోల్చినట్టు? మీలో ఎవురయినా వీడు మనల్నే గాడిదంటండాడని బుజాల్దడుంకుంటే చమించేయండి.
నేను తాగితే నస్టపోయింది నా పెండ్లాం. డబ్బుల్లేక కూటికోటా తగ్గిపోతే ఎముకలాగ ఎండిపొయ్యేదదే. పీకల్దాకా తాగి పక్కటెముకలిరిగేటట్లు గొడితే తినిగమ్మునుండిపోయేదీ అదే! దాని కడుపు మండేసరికి మీరు మీ పంటపండించుకొంటిరి. ‘‘నా మొగుడు తాగి సస్తాఉండాడు. సంపేస్తాఉండాడు’’ అని, అదీ దానిలాంటి మరో లచ్చలమందీ ఏడ్చితే దానికి మీరు రాజకీయ రంగు బూసి నానా రంకు బాగోతాలాడిరి. ఎట్టయితే ఏమాయె? కడాపటికి సారాయిన్నిలిపేస్తిరి. నిలిపించేస్తిరి. అయ్యలారా  మీరు గొప్పోళ్లు. అయిదేళ్లకోమారు దప్పితే మా తలకాయను మీరు తల్చుకోరు. ఒక్కమాటజెప్తురా! మీ అమ్మా అబ్బలమీద పిల్లా పాపల మీదా పెమాణంజేసి చెప్తురా? సారాయిని నిలపడంకోసం కొట్లాడ్డం కాడనుంచి నిలిపేదాకా నికార్సుగా మీరీ పనిజేసినారా? పది రూపాయలు తీస్కోని ఓటేసిన కుక్కని నేను. పెశ్నిలడగడం తప్పంటారా. ఇంకోమారు చమించేయండి.
సారాయిని మీరే ఆపేస్తిరి. దొంగ సారాయిని కాపుసారాయని, కర్నాటక నించి, ఆడ్నించి, ఈడ్నించి వచ్చిన సారాయని జెప్పి మీరే అమ్మితిరి. ఇదే అదుననుకొని డబ్బుల పంట పండించుకొంటిరి. దిసమొలగా తిరిగే కాడ్నించీ చూస్తానే ఉండాం. మీసాలొచ్చిన కాడినించీ తాగతానే ఉండాం. ముసిల్దశలో ఆపేయమంటిరి. ఆపేస్తిమి.
కానీ మళ్లా మీరే అడ్డుకొంటిరి. కళ్ల ముందర సారాయిబెట్టి తాగొద్దంటే మేముండగలిగేదేనా?
లంజన్దీస్కొచ్చి పక్కన పండేసి… మీరు పెద్దోల్లు నేను బూతుముండావోడ్ని చమించేయండి. … కూడదంటే ఎట్టా కుదురుద్ది? కడాపటికి మేం తాగతానే ఉంటిమి. మా పెండ్లాల ఇన్నాళ్ల ఏడుపులూ ఏమయిపోయినట్లు? వాళ్ల ఉద్దెమాలూ, మీ రాజకీయాలకు బంటుల్లాగా పరుగెత్తడాలూ, మ  పోలీసోళ్ల చేతిలో లాఠీదెబ్బలు తినడాలూ ఇవన్నీ ఏమయిపాయ? రూలయితే జేసినారు గాని సారాయిని మాత్రం ఆపలేక పోతిరి.
ఈడ సారాయమ్మతా  ఉండారని మీకు తెల్దా? తప్పులు జేసేదీ మీరే, గొప్పోళ్లని పేరుగొట్టేసేదీ మీరే! ‘‘సాములారా యీడమ్మే దొంగసారాయి నుంచి రచ్చించండయ్యా’’ అంటే, అరె, అమ్మేది మాకు తెల్దే’’ అంటిరి. చాటుగా వచ్చి ‘‘ఉన్నపళాన సారాయి నిలిపేస్తే ఒక్కసారిగా చస్తావని కస్టపడి దొంగ సారాయి తెచ్చి అమ్మతావుంటే కంప్లయింటు జేస్తావట్రా- పో రూపాయి తక్కవకే కొనుక్కొని తాగుబో’’ అని సలహా జెప్పితిరి. మేం తాగి రోజూ కొంచెం కొంచెం చస్తాఉంటే మీకు తెలవదు! తెలవాలంటే ఏం జెయ్యాల? ఏంజెయ్యాలన్నదానికి నాకొకటి అన్పించింది.
ఇదో ఈ సేతిలో ఉండేదేంది – కాలీడబ్బా.
దీంట్లో ఉండే ఇండ్రీనేం జేసినానో మీకు తెలీదుగదా. ఆ దొంగసారా బానలో బోసినా. ఇప్పుటికెంత? పాతికమందికి పైగానే తాగితిమి.  రేపు పొద్దుపొడిసేకాడికి మా బతుకులు తెల్లారిపోతాయి. పొద్దుగుంకే కాడికి పాడెల్లేసిపోతయి. పోనిండి. దేసానికేం నస్టం లేదుగదా. ఆ మాటకొస్తే మా పెళ్లాలకు మాత్రమొచ్చిన కస్టమేముండాది. తాడు తెగడమంటే తన్నుల్దినడం పర్మినెంటుగా తప్పినట్లేగదా!
అయ్యా సాములూ,
ఇన్నాళ్లూ కళ్ల ముందర జూస్తానే, ‘‘సారా అమ్మతండారా మాకు తెల్దే’’ అంటిరి. రేపు గవుర్మెంటు ఆసుపత్రిలో మా శవాల్ని నిలవనా గోస్తే ఎట్ట చచ్చినామో తెలీకుండాబోదుగదా. అయ్యా అప్పుటికయినా తెరుసుకునే మూసుకొనుండే మీకళ్లు తెరుసుకోకుండాబోతయ్యా అని నా ఆశ! తెరుసుకుంటే దేశంలో బతికి మిగిలినోళ్లన్నా హాయిగా ఉండగలుగుదురు.
ఈరోజు  మేం జచ్చినంతమాత్రాన మీరొక్కసారిగా మనుషులుగా  మారిపోయి ఉన్నపళంగా మమ్మల్ని ఉద్దరించేస్తారని నేననుకుంటాడానా, లే. మీరు కదిలిపొయినట్టు నటిస్తురు. రేపు ఇంకొక దగ్గిర ఇంకొందరు జస్తె మీ మనసులు కరిగిపొయినట్టు నటిస్తురు. ఇంకొందురుగూడా చచ్చినప్పుడు కన్నీళ్లు ఏర్లయిపొంగుతున్నట్లు మళ్లీ నటించజూస్తురు.
అయ్యా, ఇంతమంది ప్రజానీకంలో కొందురైనా మనుషులుంటారు మనసుండేవోళ్లు. ‘‘ఈళ్ల సావులకు సమాదానమేం’’దంటూ మీ చొక్కా పట్టుకోకపోతారా అని నా ఆశ. పిసరంత ఆశతో పాతికమందిని చంపేస్తండానెందుకంటారా? అయ్యా ఎంత పెద్ద అగ్గి గుండాం అంటుకొనాలన్నా – ఒక చిన్న నిప్పు కణిక కావాలిగదా! అదేదో నేనేగానియ్యగూడదా.
అయ్యా మీలో రెండురకాల మనుషులకి రెండురకాల కోపం రావచ్చు. యీ క్రూరాత్మప్ముండాకొడుకు ఇంతమందిని చంపేసినాడే అని కొందరనుకోవచ్చు – యీడెమ్మ కడుపుమాద మన నోటికాడికొచ్చిన ఇంతింత ఆదాయాన్ని ఈడిట్ట నడిమంత్రానే ఆపేస్తిడే అని కొందరు తిట్టుకోవచ్చు.
అయ్యా సాములూ,
నేను పాపినే ఒప్పుకుంటాండాను.
అందరూ నన్ను చమించేయండి’’
ఆదర్శిని
17-8-1994

ఎడిటర్

ముప్ఫయ్యేళ్ల జర్నలిజం, రచన రంగాల్లో అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.

<svg
aria-hidden="true" class="sab-user_email" role="img" xmlns="http://www.w3.org/2000/svg" viewbox="0 0 512 512"><path
fill="currentColor" d="M502.3 190.8c3.9-3.1 9.7-.2 9.7 4.7V400c0 26.5-21.5 48-48 48H48c-26.5 0-48-21.5-48-48V195.6c0-5 5.7-7.8 9.7-4.7 22.4 17.4 52.1 39.5 154.1 113.6 21.1 15.4 56.7 47.8 92.2 47.6 35.7.3 72-32.8 92.3-47.6 102-74.1 131.6-96.3 154-113.7zM256 320c23.2.4 56.6-29.2 73.4-41.4 132.7-96.3 142.8-104.7 173.4-128.7 5.8-4.5 9.2-11.5 9.2-18.9v-19c0-26.5-21.5-48-48-48H48C21.5 64 0 85.5 0 112v19c0 7.4 3.4 14.3 9.2 18.9 30.6 23.9 40.7 32.4 173.4 128.7 16.8 12.2 50.2 41.8 73.4 41.4z"></path></svg>

మామా..దేవుడున్నాడా…!?
(ఒక పాప అమాయకంగా కోనేటి ఒడ్డున కూర్చుని ఉంటుంది.. ఇంకా తెరుచుకోని గుడి తలుపుల వైపు చూస్తూ ఉంటుంది)

పా పా..అక్కడేం చేస్తున్నావ్? (అమ్మా నాన్న అన్నయ్యల వాయిస్ తో మూడు సార్లు పిలుపు)…అటు ఇటు చూస్తుంది..

ఎవరూ కనిపించకపోవడంతో అయోమయంతో కూడిన మౌనం..

(ఇంతలో చిరునవ్వుతో) ఒక వ్యక్తి పాప దగ్గరికి వస్తాడు.. నీతో మాట్లాడను..స్ట్రేంజర్ (అంటూ పాప దూరంగా వెళుతుంది.. ..

దాంతో ఆ వ్యక్తి కొంచెం  దూరంగా వెళ్లి కూర్చుంటాడు..)

కొంచెం సేపు తర్వాత అతనివైపే పదే పదే చూసి.. పాప తనంత తాను దగ్గరికి వస్తుంది

స్ట్రేంజర్ దగ్గరికి ఎందుకొచ్చావు?( ఆ వ్యక్తి చిరునవ్వుతో ప్రశ్నిస్తాడు)

నిన్ను మళ్లీ మళ్లీ చూస్తే అచ్చం మా మామ లాగే ఉన్నావు..(పాప తేరిపార చూస్తూ బదులిస్తుంది)

పట్టి చూస్తేనే కదా..తెలిసేది.( నవ్వుతూ తన పక్కన చోటు చూపుతూ అంతర్గర్భితంగా చెబుతాడు)

అవును …ఇక్కడికి ఒక్కదానివే ఎందుకొచ్చావు..? (భృకుటి ముడివేసి పాపను ప్రశ్నిస్తాడు)

రోజూ వస్తాను.. రాత్రి హోం వర్క్ చేయలేదు… లెక్కలు అర్థం కావడం లేదు..అమ్మ తిట్టింది.. కోపం వచ్చింది.. దేవుడిని ఒకసారి

చూద్దామని తొందరగా వచ్చేశా..  అంతే.. ( తెరుచుకోని గుడి తలుపుల వైపు చూస్తూ పాప కొంచెం దీనంగా చెబుతుంది)

అవును.. నీ పేరేంటి? నిన్ను ఇక్కడ ఎప్పుడూ చూడలేదే..(పాప ఆసక్తిగా అడుగుతుంది)

వీరవెంకట గోపాల శ్రీనివాస.. సత్య.. శివ.. రామ.. నాగ సుబ్రహ్మణ్య..( కొద్దిగా కళ్లు మూసుకుని పాపకు చెబుతూ ఉంటాడు..)

అబ్బో అంత పేరే… నాకు వద్దులే.. ఆపేయ్… గుర్తుండదు( మధ్యలోనే కట్ చేస్తుంది పాప)

అచ్చం మా మామ లాగా ఉన్నావుగా.. మామా అని పిలవవచ్చా…( సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లుగా అడుగుతుంది)

మామ..(నొక్కి పలుకుతూ). నవీన నామకరణం.. మరో కొత్త పేరు..గమ్మత్తైన పేరు ( తనలో తాను అనుకుంటూ ఉంటాడు..

ఇంతలో కేశవ..మాధవ..నారాయణ.గోవింద ..మధుసూదన.. వేల వేల పేర్లు .బ్యాక్ గ్రౌండ్ లో అతనికి వినిపిస్తూ ఉంటాయి. )

ఏమిటీ చెప్పవే..( పాప పట్టి కుదిపి అడుగుతుంది)

ఓ చాలా బాగుంది..  బంగారంలా పిలు.. నీ ఇష్టం.. ఎలా కావాలనుకుంటే అలా పిలు ( తన్మయత్వంతో చెబుతాడతడు)

మీ మామ అంటే నీకంత ఇష్టమా..? (అతడు ప్రశ్నిస్తాడు…ఆమె కళ్లల్లోకి చూస్తాడు)

హా…. (సాగదీస్తుంది) నన్ను చిన్నపుడు ఎత్తుకునేవాడు.. తాయిలాలు కొనిపెట్టేవాడు.. ఆడించేవాడు..ఇప్పటికీ మా మామ వస్తే పండగే…( ఆనంద డోలికల్లో తేలియాడిన మధురస్మృతులను గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా చెబుతుందా పాప)

ఇంతకీ నువ్వేం చేస్తుంటావు.. ( యథాలాపంగా రొటీన్ గా అడుగుతుంది పాప )

డాక్టర్ గా పనిచేస్తుంటా ( బదులిచ్చాడతను)

చాలా మంది డాక్టర్లు ఉంటారుగా.. ఏ డాక్టర్ .. ? స్టెత స్కోప్ ఏది..?

గుడి కదా.. అవసరాన్ని బట్టి మన అవతారం.. ఐమీన్ వేషభాషలు (( పైన వేసిన శాలువా సవరించుకొంటూ చెబుతాడు.. వచ్చి

వారతిని జొచ్చి సోమకుని తెచ్చిత వేగమే.. మెచ్చి విధాతకు దశావతారాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నగా వినవస్తూ ఉంటుంది.)

డాక్టర్ గా ఏమేం చేస్తుంటావ్ ( పాప సాగదీసి అడుగుతుంది)

పురుడు పోస్తాను.. వైద్యం చేస్తాను.. ప్రాణం కాపాడతాను.. నాచేతుల్లో ప్రాణాలూ పోతుంటాయి (గంభీరంగా కళ్లజోడు తీస్తాడు.. నీటి పొర అలుముకుని ఉంటుంది)

అరెరే ఎందుకు ఏడుస్తున్నావు..? (పాప కళ్లు తుడుస్తుంది)

అయినా నల్లకళ్లజోడు .. ఎందుకు పెట్టుకున్నావు.. అంతా ఒకేలా కనిపిస్తుంది..కదా..

అంతా ఒకేలా కనిపించాలనే.. (చమత్కారంగా బదులిస్తాడు)

ఓహో ఫ్యాషనా… (పాప విరగబడి నవ్వుతుంది)

తింగరి మాలోకంలా ఉన్నావ్.. నీ కాళ్లకు ఒక సాక్సు తిరగేసి వేసుకున్నావే.. (కాళ్లవైపు చూస్తూ వెటకరిస్తుంది పాప)

నువ్వేమో పిలిస్తే రాలేదు..  నీ దగ్గరికి వచ్చే కంగారులో  చూసుకోకుండా వేసుకుని వచ్చేశా (సిరికింజెప్పడు..  ధ్వనిస్తూ ఉంటుంది బ్యాక్ గ్రౌండ్)

మా అమ్మ, అన్నయ్య, నాన్న పిలిచారనుకున్నాను.. ( పాప అర్ధోక్తిలో ఆగిపోతుంది)

నేనే పిలిచాను.. దూరం నుంచి.. నువ్వు ఇంటిలో వాళ్ల గురించే ఆలోచిస్తున్నావు కదా.. అలా వినిపించి ఉంటుంది( అతడు జవాబుగా సర్ది చెబుతాడు)

మా మమ్మీ సాక్సు తిరగేసి వేసుకుంటే తిడుతుంది తెలుసా.. మార్చి వేసుకునే వరకూ తిడుతూనే ఉంటుంది.. (పాప ఫిర్యాదు చేస్తుంది..)

అతని కాళ్లకు వేసిన సాక్సు తీసి మళ్లీ వేస్తుంది పాప (పాప సాక్స్ సర్దుతుంటే.. జ్నానానందమయం దేవం.. నిర్మల స్ఫటికాకృతిం.. అంటూ సున్నితంగా తలమీద చేయి వేసి మంత్రం చదువుతాడతను.. ఏదో అంటున్నావు… ఏమిటది (పాప తలపైకెత్తి అడుగుతుంది )

..నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావుగా.. నీకు మంచి జరగాలని…ఒక మంత్రం .. చెబుతున్నా ఉపకారికి ఉపకారం అన్నమాట (అతను సరదాగా బదులిస్తాడు).

ఓహో నేను ‘మమ’ అనాలన్నమాట.. ( పాప ఛలోక్తి విసురుతుంది)

నీకెలా తెలుసు..  (అతను తల ఊపుతూ అడుగుతాడు)

మా మామ పెళ్లి లో చూశాను. అయ్యోరు.. ఏదేదో చదివేసి.. మమ అని మామ చేత. అత్త చేత అనిపించేవారు.. అలాగైతే ఆ మంత్రాలన్నీ వాళ్లు చదివేసినట్లే నంట ( పాప తనకు తెలిసిన విషయాన్ని గొప్ప జ్ణానిలా గర్వంగా చెబుతుంది)

ఈసారి మార్చి వేసుకోకు..(సాక్సుల నుంచి చేయి తీస్తూ గద్దించినట్లు చెబుతుంది)

సాక్సు మారితే  సర్దడానికి నువ్వున్నావుగా (ఆటపట్టిస్తూ అంటాడతను)

నేనెందుకు మారుస్తాను.. ఎవరిది వాళ్లే మార్చుకోవాలి.. (కొంచెం కోపంగా, విసుగుగా చెబుతుంది పాప)

ఓహో ఎవరి పని వాళ్లే చేసుకోవాలన్నమాట.. (సాలోచనగా చెబుతాడతడు)

అవును.. అమ్మ ఎప్పుడూ అదే చెబుతుంది (పాప బదులిస్తుంది)

..మరి దేవుడి దగ్గరకు ఎందుకొచ్చావు.. నీ పని నువ్వు చేసుకోవచ్చుగా.. (పాప వైపు సూటిగా చూస్తూ అతడు ప్రశ్నిస్తాడు)

దేవుడిని  ఒకటి అడుగుదామని ..వచ్చా (చెప్పాలా? వద్దా అన్నట్లు సంశయంగా మధ్యలో ఆగిపోతుంది పాప)

నువ్వు ఇక్కడకు ఎందుకొచ్చావు.. ఎప్పుడూ ఇక్కడ చూడలేదు.. (మరోసారి ఎదురు ప్రశ్నిస్తుంది)

ఇంతలో పెద్దగా. గంటలు.. వినిపిస్తాయి… అతనికి మాత్రమే వినిపించేలా భజన… గోవిందా.. గోవిందా.. అంటూ వేల గొంతులు )

విచలితంగా.. దీర్ఘశ్వాస తీసుకుంటాడు..

మనోబుద్ద్యహంకార చిత్తాని నాహం… (సన్నగా చదువుతుంటాడు)

ఏమిటి.. ఏదో చదువుతున్నావు.. (పాప అతని పెదాల వైపు చూస్తూ అడుగుతుంది)

భజన.. గంటలు.. నీకు వినిపించడం లేదా.. (కళ్లు తెరిచి అడుగుతాడతను)

గుడి తెరిచారు.. గంటలు వినిపిస్తున్నాయి.. భజన లేదు.. (చెబుతుందా పాప)

ఓహో నావి పెద్ద చెవులులే.. (అతను సంజాయిషీ ఇస్తున్నట్లుగా చెబుతాడు)

ఏనుగు చెవులన్నమాట.. (పాప వెటకరిస్తుంది..)

మరి మంత్రం ఎందుకు చదువుతున్నావు.. (మరో ప్రశ్న వేస్తుంది)

నన్ను నేను సరిచేసుకుంటున్నాను లే.. నీకు వినిపించని, నాకు మాత్రమే వినిపించే సౌండ్ నుంచి నన్ను నేను తమాయించుకోవాలిగా.. (సర్దుకుని కూర్చుంటూ చెబుతాడు)

ఎవడ్రా అక్కడ కోనేరు దగ్గర.. చెత్త వేస్తున్నారా..  (దూరం నుంచి గంభీరంగా పెద్ద అరుపు)

తాతా.. నేనున్నాను (పాప గట్టిగా అరచి చెప్పింది)

సరే జాగ్రత్త… (అట్నుంచి సమాధానం)

నీకు కోపం వచ్చిందా.. ఏమీ అనుకోకు.. (పాప సముదాయింపుగా అడిగింది..)

నవ్వాడు.. తన పని తాను చేస్తుటే కోపం ఎందుకు? (అతడు బదులిచ్చాడు)

నువ్వు డాక్టర్ వి అని తెలియక తిట్టాడుగా (పాప తెలివిగా ప్రశ్నించింది)

నువ్వు మామా అని నీ భాషలో పిలిచావు.. అతను ఎవడ్రా అని అతని వ్రుత్తిలో పిలిచాడు..నాకు  రెండూ ఒకటిగానే వినిపించాయి.. ( బదులిచ్చాడతడు)

నువ్వుభలే చిత్రంగా మాట్టాడతావు.. ఇంతకీ దేవుడు ఉన్నాడంటావా? (మధ్యలో ఆగి అతని సమాధానం కోసం ఎదురుచూస్తుంది)

ఊ…(దీర్ఘశ్వాసతో చెబుతాడు)

25 . మరి కనిపిస్తాడా?…. (పాప ఎదురు ప్రశ్న)

హా.. (మరోసారి శ్వాస తీసుకుంటూ చెబుతాడు)

గుడిలో విగ్రహంలా కాదు.. నిజ్జంగా ..నిజమైన దేవుడు… (కొంచెం నిలదీసి అడుగుతుంది)

ఎలా కనిపించాలి…?. ఆ గుడిలో శంఖం చక్రం.. పెట్టారు.. ఈ గుడిలో బాణం పెట్టారు.. ఇంకో గుడిలో వేణువు పెట్టారు.. ఎలా కనిపించాలి.. నువ్వు గుర్తు పట్టలేవు.( తేలిగ్గా తేల్చేస్తాడతను)

నేను గుర్తు పట్టేలా కనిపించాలి.. (తన మనసులోని కోరికను బయటపెడుతుంది)

సరే లే.. ( హామీ ఇస్తున్నట్లు గా భరోసా గా చెబుతాడు)

మరి మాట్లాడతాడా? నాకు అర్థమవుతుందా?( తనలోని మరింత ఎక్కువైన ఆసక్తిని ప్రదర్శిస్తుంది పాప)

హా.. ప్రపంచంలో చాలా బాషలున్నాయి కదా..  యూనివర్శల్  లాంగ్వేజ్ లో మాట్లాడతాడు. ( నవ్వి చెబుతాడు  )

రెండు చేతులతో చెవులు మూసుకో .. ( ఆజ్ఞాపిస్తాడతను)

ఏం వినిపిస్తోంది ( అడుగుతాడు)

లబ్ డబ్.. లబ్ డబ్..  అది గుండె చప్పుడు.. ( పాప చెబుతుంది)

ఎలా వస్తోంది… ఎక్కడనుంచి వస్తోంది..( అడుగుతాడతను)

నాకెలా తెలుసు..( విసుగుగా చెబుతుంది)

చదువుకుంటే తెలుస్తుంది.. లోపల్లోపల కు వెళ్లి వెదికితే అర్థమవుతుంది..( చెబుతాడతను)

నువ్వు విచిత్రం పట్టినోడిలా మాటాడుతున్నావు… నాకు పజిల్ .. అర్థం కాని ప్రశ్న అది…

(పాప తన అశక్తతను వెల్లడిస్తుంది)

అర్థం కాని ప్రశ్న .. వెదుకులాటలోనే దేవుడున్నాడు..

ఏమిటో..నీ మాటలు నాకు అర్థం కావడం లేదు.. (పెదవి విరస్తుంది పాప)

అయినా నువ్వు .. గొప్పోడిలా కనిపిస్తున్నావు .. ఒప్పేసుకుంటున్నాను.. ( చేతులెత్తేస్తుంది పాప)

అలా ఒప్పేసుకుంటే నీకు ఆన్సర్ ఎలా దొరుకుతుంది..శోధించి సాధించాలి.. ఏప్లస్ బీ హోల్ స్వేర్.. ( ఏస్క్ీవరే ప్లస్ బీ స్కవేర్

ప్లస్ టూ ఏబీ.. ) అంటే అంతా కలిపేసి ఉన్న దానిని విడదీసి చూ్స్తే అర్థమైపోతుందన్నమాట.. ( అతడు ఈక్వేషన్ చెబుతాడు)

హెచ్ టూ ఓ లాగా.. ( తాను కూడా జత కలుపుతుంది పాప)

అవును.. ఏదైనా అంతే.. పెద్ద కూరగాయలను చిన్నచిన్మముక్కలు చేసి ఉడికిస్తే అరిగిపోతుంది.. కూరగాయను తినలేం కదా..

అంతే లెక్కలైనా.. విడదీసేస్తే సరి.. ( సింపుల్ లాజిక్ చెబుతాడతను)

నాకు అర్తం కాకపోతే అమ్మనో.. టీచర్ నో అడుగుతాను… నీలా కాకుండా వాళ్లు అర్తమయ్యేలా చెబుతారు.. ( పాప అతడిని గేలి చేస్తుంది). నవ్వుతాడతను..

గుడ్ .. వాళ్లు చెప్పింది ఫాలో అయిపో ( పాపకు అర్థమయ్యేలా చెప్పలేకపోయిన తన ఓటమిని అంగీకరిస్తాడు)

వాళ్లు చెప్పింది వింటే గొప్పదాన్ని అవుతానా..? (పాప అనుమానంగా అడుగుతుంది)

హా.. ( సింగిల్ మాటలో చెప్పేస్తాడతను)

అంటే నీలాగా.?.(సందేహంతో రెట్టించి అడుగుతుంది)

)?  హా..నాలాగా.. నీలాగా..  నీలాగా .. నాలాగా..(తిరగేసి రెండు సార్లు చెబుతాడు)

ఇద్దరూ నవ్వుకుంటారు..

32.మరి వెళదామా..

నాకు ఇక్కడే బాగుంది.. ఇంటికెళితే చెప్పకుండా వచ్చేశానని అమ్మ తిడుతుంది…( పాప గారాబంగా అంటుంది)

తిట్టదులే.. నువ్వు వెళ్లగానే కౌగిలించుకుని ముద్దులు పెడుతుంది…  బంగారూ అంటూ నాన్న ఒడిలోకి తీసుకుంటాడు..

అన్నయ్య చాక్లెట్ ఇస్తాడు.. సరేనా ( నచ్చ చెబుతాడతను)

నిజమా.. ప్రామిస్. (చేయి చాపుతుంది పాప)

ప్రామిస్.. ఇది గో ప్రసాదం.. ( చేతిలో ప్రసాదం పెడతాడు)

ఇందాకటి నుంచి కనిపించలేదే… ప్రసాదం..( అనుమానంగా చూస్తుంది)

నేను దాచాశానులే.. అవసరమైనప్పుడు ఇద్దామని.. చాలా సేపట్నుంచి మాట్టాడావు కదా.. నీకు ఆకలేస్తుంది అందుకే ఇచ్చా..

( పాప అనుమానాన్ని నివ్రుత్తి చేస్తాడు)

నిజమే నాకు ఆకలి వేస్తోంది..అమ్మ ఈ పాటికే టిఫిన్ చేసి ఉంటుంది.. ( ప్రసాదం తీసుకుంటూ..)

నువ్వు కూడా మా ఇంటికి రా.. నాతో పాటు ఎవరైనా ఉంటే మా అమ్మ తిట్టదు.. నువ్వు ప్రసాదం పెట్టావుగా … నీకు మా

ఇంట్లో చాయ్ ఇస్తా.. ( పాప ఆఫర్ చేస్తుంది)

సరే పద..

ఏమో నీ మాట నమ్ముతున్నాను..అమ్మ తిట్ల నుంచి ..దేవుడే కాపాడాలి నన్ను… అన్నట్లు దేవుడు కాపాడతాడా..( మరో అనుమానం వ్యక్త ంచేస్తుంది)

హా.. కచ్చితంగా.. ఇందాక నువ్వు ఆ పిల్లాడు కుక్కను కొడుతుంటే.. ఆపావు కదా.. అలాగే.. కాపాడతాడు..( పాపకు భరోసా ఇస్తాడు)

అయితే దేవుడు కూడా మనలాగే అన్నమాట.. ( సంతోషంగా చెబుతుంది)

ఊ… .. ( అతడు ఉత్సాహం కనబరుస్తాడు)

పాప చేయి పట్టుకుని పైకి లేపి చేయి వదిలేస్తాడు..

నా చేయి పట్టుకుని రా.. ( తన వెంట రాడేమోననే అనుమానంతో చేయి పట్టుకుంటుంది.. )

కొంచెం వెనకాల వస్తా.. ( అతడు)

ఏం..? ( పాప)

ఒక దమ్ము కొట్టి వస్తా.( అతడు)

. నువ్వు సిగరెట్ తాగుతావా..( ఆశ్చర్యంగా కళ్లు పెద్దవి చేస్తూ పాప)

హా … (కుతూ హలంగా పాప వైపు చూస్తూ అతడు)

నాకు అసహ్యం.. ( పాప మొఖం చిట్టిస్తుంది)

ఇందాక నేనంటే ఇష్టమన్నావు..( ఆట పట్టిస్తూ అతడు)

సిగరెట్ తాగేవాళ్లు అంటే నాకు చిరాకు…నువ్వు ప్రసాదం పెట్టావు… పలకరించావు.. మా మామలాగా కనిపించావు.. అందుకే

ఇష్టం..( పాప తనంటే ఎందుకు ఇష్టమో వివరించింది)

బాధ పడుతున్నాడేమో అని..ఒకసారి అతనిని తేరిపార చూసి మళ్లీ గోంతు సవరించింది..

మా అమ్మ గోరుముద్దలు పెడుతుంది.. గారాబం చేస్తుంది.. అప్పుడు ఇష్టం .. ఒక్కో్సారి తిడుతుంది చూడు .. అప్పుడు కోపం వస్తుంది..

అన్న నా బొమ్మలు చెడగొడతాడు అప్పుడు కోపం వస్తుంది.. నాతో ఆడుకుంటున్నప్పుడు ఇష్టం వేస్తుంది..  (పాప ఎక్స్ ప్లనేషన్ ఇచ్చింది)

అంటే నేను చేసిన పనుల వల్లే ఇష్టం వచ్చింది.. మీ మామలాగా ఉండటం వల్ల దగ్గరికి వచ్చావు.. ఇప్పుడు సిగరెట్ అంటే దూరం పోతున్నావు.. అంటే నా పనులే చూస్తున్నావు అన్నమాట.. నా పనులను బట్టే నీకిష్టం అన్నమాట..

(అతడు దీర్ఘం తీస్తూ అడిగాడు)

అవును… మా మామ అంటే నాకిష్టం.. మా మామ సిగరెట్ కాల్చడు.. అయినా నువ్వు సిగరెట్ కాల్చకూడదు.. అది తప్పు.. ( యాడ్ లో .. సౌండ్.. ) ఇద్దరి నవ్వులు

నువ్వు చెప్పినట్లు వింటాలే.. నెమ్మదిగా మానేస్తా.. ( పాపకు హామీ ఇచ్చాడతను)

సరే నీవెనకాలే వస్తూ ఉంటా.. నువ్వు పద ( పాపకు సూచించాడు)

ఆగి సందేహంగా చూసింది..

నీ అంతట నువ్వు వచ్చావు.. నీ అంతట నువ్వే వెళ్లాలిగా. ( పాపకు బాధ్యతను గుర్తు చేశాడు)

భయం వేస్తోంది… ( ఎందుకో నెమ్మదిగా అంది)

నీ వెనకాల ఉంటాను సరేనా..( కూడా బయలు దేరుతూ చెప్పాడు)

నిజంగా వెనకాలే రావాలి..( భరోసా కోరింది)

వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ అతను వెనకాల వస్తుంటే.. ఇంటికి చేరుకుంటోంది..

అతను  మెల్లగా అడుగులు వేస్తూన్నాడు ఆచితూచి.. నేలను చూసుకుంటూ..

అదేంటి.. అంత నెమ్మదిగా నడుస్తున్నావు.. ( తనను వదిలి వెళ్లిపోతాడేమోనని.. ఒక అడుగు వెనక్కి వేసి అడిగింది)

నేను కొంచె స్లో.. పాపా.. కాళ్లకింద పడి చీమ చితకా ..నలిగి పోతాయి కదా..( నర్మగర్భంగా బదులిచ్చాడు)

చీమలను కూడా చూసుకుని నడుస్తావా..(పాప నవ్వులు )

అదే దేవుడైతే పెద్ద పెద్ద రాక్షసులను చంపేస్తాడు తెలుసా…( గొప్పగా చెప్పింది )

47 ఇంత సెన్సిటివ్ అయితే ఆపరేషన్లు ఎలా చేస్తావు.. రక్తం చూస్తే  నాకే భయం..( పాప జాలిగా చూసింది)

అవసరమైనప్పుడు తప్పదుగా పాపా….( అతడు గంభీరంగా బదులిచ్చాడు.. యథాయథాహి ధర్మస్య .. బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్)

ఇంటికి చేరింది పాప..

చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లావే.. ఇంతసేపూ (నిలదీస్తూనే దగ్గరకు తీసుకుంది తల్లి )

గుడికి వెళ్లా..  అక్కడ మన మామ లాంటి మామ నాతో మాట్టాడాడు.. నాతోపాటు మన ఇంటికి కూడా  వచ్చాడు..( అంటూ వెనక్కి తిరిగి చూస్తుంది పాప)

నథింగ్.. అక్కడెవరూ లేరు..

అయ్యో వెళ్లిపోయాడే.. ప్రామిస్ చేశాడు.. ( పాప బాధగా నొచ్చుకుంటుంది)

ఎవరూ లేరులే.. ( మమ్మీ సముదాయింపు..)

అంకుల్ కి వీడియో కాల్..చేస్తుంది… పొలంలో మామ లిఫ్ట్ చేస్తాడు..

మామా…  అచ్చం నీలాంటి మామే.. గుడి దగ్గర కనిపించాడు..( పాప ఆత్రుతగా చెప్పసాగింది..)

మన ఇంటికొచ్చి  చాయ్ తాగుతానని ప్రామిస్ చేశాడు.. కానీ మాట తప్పాడు..( ఫిర్యాదు చేసింది పాప)

ఇదిగో నీకు టీ.. ( చాయ్ కప్పు చూపించింది పోనులో మామకు)

అట్నుంచి చప్పరించినట్లు సైగ..

సరే పాప.. నేను తాగేశానుగా…నువ్వు కూడా కానిచ్చేయ్.. ( మామ ఉత్సాహ పరిచాడు)

థాంక్యూ మామా.. ( గట్టిగా ఫోనులో చెప్పింది)

నువ్వు మాట తప్పావు.. అయినా నీ బదులు మా మామకు టీ ఇచ్చాను. (తనలో తాను గొణుక్కుంది కప్పు పట్టుకుని)

బై ..బై.. స్ట్రేంజర్ మామా.. ( గొంతులోపల్నుంచి సన్నగా వచ్చాయి ఆ మాటలు  )

అదే నవ్వు.. పొలంలోని మామ నోటి వెంట…

బై..బై…

బై బై … ఒకరికొకరు ఫోను లో వీడ్కోలు…

ఎడిటర్

ముప్ఫయ్యేళ్ల జర్నలిజం, రచన రంగాల్లో అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.

<svg
aria-hidden="true" class="sab-user_email" role="img" xmlns="http://www.w3.org/2000/svg" viewbox="0 0 512 512"><path
fill="currentColor" d="M502.3 190.8c3.9-3.1 9.7-.2 9.7 4.7V400c0 26.5-21.5 48-48 48H48c-26.5 0-48-21.5-48-48V195.6c0-5 5.7-7.8 9.7-4.7 22.4 17.4 52.1 39.5 154.1 113.6 21.1 15.4 56.7 47.8 92.2 47.6 35.7.3 72-32.8 92.3-47.6 102-74.1 131.6-96.3 154-113.7zM256 320c23.2.4 56.6-29.2 73.4-41.4 132.7-96.3 142.8-104.7 173.4-128.7 5.8-4.5 9.2-11.5 9.2-18.9v-19c0-26.5-21.5-48-48-48H48C21.5 64 0 85.5 0 112v19c0 7.4 3.4 14.3 9.2 18.9 30.6 23.9 40.7 32.4 173.4 128.7 16.8 12.2 50.2 41.8 73.4 41.4z"></path></svg>

ఒక గొంగళిపురుగు కథ
ఇంట్రావర్ట్ గా ఉంటూ.. జనంలో కలవలేకుండా.. మధనపడిపోతూ ఉండే వాడి కథ.