Sahityam

ఆ తరానికి గూగులమ్మ.. మాలతీ చందూర్
(తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో, మాలతీ చందూర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రసంగం. 20 ఆగస్టు 2025)

అందరికీ నమస్తే.

నా పేరు మునిసురేష్ పిళ్లె జర్నలిస్టుని, రచనలు కూడా చేస్తుంటాను. నా దైనందిన పాత్రికేయ, సాహిత్య రచన కార్యకలాపాలతో పాటు… కథావసుధ పేరుతో అనువాద సాహిత్యానికి ప్రత్యేకించిన ఒక వెబ్ మేగజైన్ కూడా నిర్వహిస్తున్నాను. ఇవాళ ఇంత మంచి కార్యక్రమంలో మాట్లాడడానికి ఈ అర్హతలే మీ ముందు నిలబెట్టాయని నమ్ముతున్నాను.

సుప్రసిద్ధ రచయిత్రి డాక్టర్ మాలతీచందూర్ గారి స్మారక ధర్మనిధి సదస్సులో ఆమె సాహితీ విశ్వరూపంలోని ఒక అంశ గురించి నా అనుభూతిని చెప్పగలగడం ఎంతో గౌరవప్రదం. అందుకు పద్మావతి విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయనశాఖకు కృతజ్ఞతలు.

1928 లో జన్మించి 2013లో తుదిశ్వాస విడిచిన మాలతీ చందూర్ తెలుగు సాహిత్యంలో ఒక విశ్వరూపం. అగ్రగణ్యులుగా, సాహితీ గండరగండలుగా, తెలుగుసాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహానుభావులుగా రకరకాల కీర్తి కితాబులతో వెలుగొందే సాహితీ స్రష్టల కంటె మిన్నగా విభిన్న రంగాల సాహితీ ప్రక్రియలలో సేవలందించిన నిరుపమాన కృషికి నిదర్శనం మాలతీ చందూర్. ఇప్పటికి మాత్రమే కాదు, మరికొన్ని తరాలు గడిచిపోయినప్పటికీ కూడా.. మాలతీ చందూర్.. తెలుగునాట పరిచయం అవసరం లేని పేరు. కథలు, నవలలు, అనువాద నవలలు, వంటలు- అందాలు అలంకారాల గురించిన వ్యాసాలతో మహిళాలోకానికి ప్రియమైన రచనలు ఇలా అనేక విధాలుగా తనలోని రచనా తృష్ణను తీర్చుకుంటూ అసిధారావ్రతం సాగించిన రచయిత్రి మాలతీ చందూర్.

వీటన్నింటికంటె అదనంగా ఆమె చేసిన రెండు రకాల సేవల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఒకటి- దాదాపు 300కు పైగా ఇంగ్లిషు నవలలను తెలుగులో పరిచయం చేయడం, రెండు- ప్రమదావనం, అడిగితే చెబుతా, నన్ను అడగండి వంటి రకరకాల శీర్షికలతో వివిధ పత్రికలలో ప్రశ్నలు- జవాబుల కార్యక్రమాలను నిర్వహించడం! ఈ రెండు పనులు లేకపోతే.. ఆమె మరిన్ని వందల కథలు, వందల నవలలు రాసిన ఒక తిరుగులేని రచయిత్రిగా మిగిలి ఉండేవారు. ఈ రెండు రకాల కృషి వలన ఆమెకు వ్యక్తిగతంగా దక్కినది తక్కువ. కానీ సాహిత్యాసక్తి కలిగిన ఆనాటి ప్రపంచానికి ఆమె అందించిన ఇంగ్లిషు నవలల పరిచయాలు ఎంతో గొప్ప మేలుచేశాయని చెప్పాలి. అలాగే ప్రశ్నలుజవాబులు వంటి ఫీచర్ నిర్వహించడం యావత్ సమాజానికీ తిరుగులేని మేలు చేసింది. బహుశా.. తన సమస్త సాహితీ సృజన కంటె కూడా ఈ రెండు ప్రక్రియలకోసం ఆమె ఎక్కువ శ్రమ తీసుకుని ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఇంగ్లిషునవలలను పూర్తిగా చదివి వాటిని తెలుగు పాఠకులకు పరిచయం చేయడం చాలా సమయాన్ని తీసుకునే వ్యవహారం. అలాగే.. ప్రశ్నలు జవాబులు కూడా. ఈ ఫీచర్ ప్రారంభిస్తున్నప్పుడు.. మహా అయితే వారానికి  ఇరవై ముప్పయి ఉత్తరాలు వస్తాయి.. వాటిని చదివి కొన్నింటికి సమాధానాలు ఇస్తే సరిపోతుంది అనుకున్నారట. కానీ.. వారానికి 500 వరకు ఉత్తరాలు వచ్చిపడుతుండేవి. పత్రికల్లో స్థలాభావం వల్ల.. కొన్నింటికే సమాధానాలు ఇచ్చి ఉండవచ్చు. కానీ. అవి ఆనాటి సమాజానికి, ప్రత్యేకించి మహిళాలోకానికి చేసిన మేలు, కలిగించిన విశ్వాసం చాలా ఎక్కువ.

కాలానికి నిలిచే మంచి రచన.. అంటే ఒక స్పష్టమైన నిర్వచనం ఉంది. ఎన్నికాలాలు గడిచిపోయినప్పటికీ కూడా.. చదివినవారిపై అది కలిగించగలిగే ప్రభావంలో మార్పు ఉండదు. బహుశా చదివేవారిలో ఆ సమయానికి ఉండే మనఃస్థితిని బట్టి, అన్వయంలో మార్పు ఉండొచ్చు. ఆ పుస్తకం తీసుకురాగలిగిన మార్పు ఒక వర్గంలో పాదుకొని ఉంటుంది గనుక.. కాలగమనంలో దాని వెలుగులు ప్రసరించే వర్గం మారవచ్చు. అంతే తప్ప.. దాని అవసరం లేకుండా పోదు.

ఉదాహరణకు సూర్యుడి వెలుగు ఉంటుంది. వ్యవసాయానికి పచ్చటి మొక్కలు పెరగడానికి సూర్య రశ్మి చాలా అవసరం అని మనకు తెలుసు. కానీ ఆధునిక ధోరణుల్లో ఇన్‌డోర్ లో వ్యవసాయం చేస్తూ.. ఆర్టిఫిషియల్ లైటింగ్ తో అవసరమైన వేడిని మొక్కలకు అందిస్తూ సేద్యం విధానాలు వచ్చాయి. ఈ పోకడ మరింత పెరగవచ్చు గాక.. కానీ సూర్యుడి వెలుగు ఈ ప్రపంచానికి అనవసరం అని చెప్పే రోజు మాత్రం ఎప్పటికీ రాదు. ఒక మంచి రచన కూడా అలాంటిదే.

మాలతీచందూర్ గారి ప్రశ్నలు– జవాబులు లేదా ప్రమదావనం వంటి వ్యాసాలు ఫీచర్లు ఒక తరం నాటి మహిళల సమస్యలను ఉద్దేశించినవే కావొచ్చు. ఆధునిక మహిళా సమాజానికి వాటి అవసరం ఎంత? అనేది ముఖ్యమైన ప్రశ్నగా మారవచ్చు. కానీ.. వాటి అవసరం ఉన్న వర్గాలు తప్పకుండా ఉంటాయి. ఆధునిక మహిళా సమాజం మొత్తం పూర్తి ఏకరీతిగా ఇంకా వికాసం పొందలేదు అనేది మనం గమనించాలి. అందుకే ఆమె రచనలే కాదు.. ఆమె సమాధానాలు కూడా సమాజాన్ని ఎప్పటికీ ప్రభావితం చేయగలిగేవే. 1952 నుంచి దాదాపు 55 ఏళ్లపాటు ఒక ఫీచర్ ను వివిధ పత్రికలలో ఒక రచయిత్రి నిర్వహించడం అనేది అపురూపమైన రికార్డు

ఇవాళ్టి రోజుల్లో ‘అడిగి తెలుసుకునే తత్వం’ చాలా వరకు తగ్గింది. మనం కూడా క్లాసులో టీచరు చెప్పింది పూర్తిగా అర్థం కాకపోతే.. ఇంటికొచ్చి గూగుల్ లో చెక్ చేసుకుంటాం. జ్ఞానానికి ఇంగ్లిషులో ఒక నిర్వచనం ఉంటుంది. Knowledge is knowing of what we dont know అని అంటారు పెద్దలు. మనకు ఒక విషయం తెలియదు అనే స్పృహ కలిగి ఉండడమే జ్ఞానం. ఆ స్పృహ ఉన్నప్పుడే మనం మన ఎరికలో తెలిసిన వారిని అడిగి, తెలియని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తద్వారా మన జ్ఞానం విస్తరిస్తుంది. ఇవాళ్టి రోజుల్లో ‘ఈ విషయం నాకు తెలియదు’ అని అనుకుంటున్న వాళ్లు ఎవ్వరూ లేరు. చేతిలో మొబైల్ ఫోను ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికీ ప్రతి విషయమూ తెలిసినట్టే భ్రమిస్తున్నాం! కానీ మాలతీ చందూర్– తాను ప్రశ్నలకు జవాబులు చెప్పేనాటికి పరిస్థితి ఇది కాదు.

ఇవాళ పత్రికలకు రాసి సమాధానాలు తెలుసుకునే వారు లేరు. ఆన్ లైన్ లో అయినా.. నిపుణులను అడిగి సమాధానాలు తెలుసుకునే వారు తక్కువ. అలాగే ఆన్ లైన్ లో జవాబులు చెప్పేవాళ్లలో ఎవరు నిపుణులో తెలుసుకోవడం కూడా కష్టం. వారైనా సరే.. గూగుల్ నుంచే సమాచారం సేకరించి మనకు చెబుతారేమో తెలియదు. అందుకే ఈ రోజుల్లో మనమే నేరుగా గూగుల్ నే అడిగి.. వచ్చే సమాధానాల్లో కొన్నింటితో తృప్తి పడుతుంటాం. ఇంతటి అవకాశం యాభయ్యేళ్ల కిందటి ప్రపంచానికి లేదు. కానీ.. వారు అడిగే సమస్త సందేహాలను మాలతీ చందూర్ నివృత్తి చేసేవారు. అందుకే ఆమె యాభయ్యేళ్ల కిందటి ప్రపంచానికి గూగులమ్మ.

నేను ఈనాడు జర్నలిజం స్కూలులో జర్నలిజం డిప్లమో చదువుతున్న రోజుల్లో మాకు తల్లాప్రగడ సత్యనారాయణమూర్తి అనే రిటైర్డు ప్రొఫెసరు పొలిటికల్ సైన్సు చెప్పేవాళ్లు. నేను ప్రత్యక్షంగా ఎరిగిన వారిలో.. ఇంతటి జ్ఞానసంపన్నులు ఉంటారా? అనుకునేలా నన్ను దిగ్భ్రమకు గురిచేసిన వ్యక్తి ఆయన. ఎవరికైనా మిత్రులకు ఆయన గురించి చెప్పాల్సి వస్తే.. నేనో మాట అనేవాడిని. మీరు గ్లోబును గిర్రున తిప్పి.. కళ్లు మూసుకుని మీ వేలుతో దానిని ఆపండి. మీ వేలు ఎక్కడ ఉందో ఆదేశం గురించి  చరిత్ర, రాజకీయాలు, సామాజిక స్థితిగతులు సమస్తం ఆయన చెబుతారు అంటుండేవాణ్ని. ఆ తరహాలో.. అప్పటి ప్రపంచానికి ఇదీ అదీ అనే వ్యత్యాసం లేకుండా.. ఎవ్వరికీ ఎలాంటి సహేతుక సందేహం వచ్చినా నివృత్తి చేశారు.

ఇప్పుడు అసలు ప్రశ్న వేసుకుందాం..

ఇప్పటి ప్రపంచానికి మాలతీ చందూర్ చెప్పిన సమాధానాల అవసరం ఎంత? ప్రత్యేకంగా ఆమె చెప్పిన సమాధానాలనే తెలుసుకోవాల్సిన అవసరం లేదని, ఏ సందేహాలు వచ్చినా సమాధానాలు అనేక మార్గాల్లో దొరుకుతున్నాయని అందరూ అనుకోవచ్చు. అలా అని వర్తమాన ప్రపంచం అనుకుంటున్నట్టు రుజువులు మనకు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. మాలతీ చందూర్ రచనలు, కథలు, నవలలు అన్నీ మార్కెట్లో దొరుకుతున్నాయి. పునర్ముద్రణలకు వస్తున్నాయి. కానీ.. ఆమె ప్రశ్నలు జవాబులు శీర్షికలకు సంబంధించిన పుస్తకాలు రెండు మూడు సార్లు పుస్తకరూపంలో వచ్చినా అవి మార్కెట్లో అలభ్యం. అతికష్టమ్మీద తప్ప కనీసం పీడీఎఫ్ ల రూపంలోకూడా దొరకడం లేదు.

ఆమె చెప్పిన జవాబులకు కొంత మేర కాలదోషం పట్టి ఉండవచ్చు. మరింత విస్తృతరూపాల్లో సమాధానాలు దొరుకుతుండవచ్చు. కానీ.. అడిగిన వారికి మాలతీచందూర్ ఎలా సమాధానాలు చెప్పారు.. అనే కోణంలో ఆ పుస్తకాల్ని మనం చదివితే.. అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలు మనకు కనిపిస్తాయి.

జర్నలిజంలో మాకు తొలిపాఠంగా ఓ సంగతి  చెబుతారు. వార్త అంటే 5 డబ్ల్యులు 1 హెచ్ ఉండాలంటారు. What, where, when, who, why  అనే అంశాలతో పాటు How అనేది చాలా ముఖ్యం. రచయితగా కొంత మంది మిత్రులు నన్ను అడుగుతూ ఉంటారు.. మంచి కథలు రాసే టెక్నిక్ చెప్పండి సర్ అంటూ ఉంటారు. నాకు జర్నలిజం తప్ప మరేమీ తెలియదు అంటూ.. నేను వారితో ఇదే విషయం చెబుతుంటాను. కథలో కూడా ఈ 5 డబ్ల్యులు ఉండాలి. వాటితో పాటు ఎలా చెబుతున్నాం HOW అనేది ముఖ్యం అంటుంటాను.

మహాభారతం ప్రారంభంలోనే  వ్యాసుడు తాను రాస్తున్న ఆ గ్రంథం గురించి ఒక మాట అంటాడు. ‘యదిహాస్తి తదన్యత్ర.. యన్నేహాస్తి నతత్ క్వచిత్’ అని! ప్రపంచంలో ఉన్న సమస్త విషయాలూ ఇందులో ఉన్నాయి.. ఇందులో లేనిది  మరెక్కడా లేదు అని చెప్పాడు. అంటే సమస్త మానవ భావోద్వేగాలు మహాభారతంలో ఉంటాయని ఆ రచయిత చెప్పుకున్నాడు. నేను ఆ విషయం మిత్రులైన రచయితలతో అంటుంటాను. మనం కొత్త సబ్జెక్టును కనిపెట్టి కథ రాయడం చాలా కష్టం. కానీ ఆ కథను ఎలా రాస్తున్నాం అనేది ముఖ్యం. How అనేది దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యం అని చెబుతుంటాను.

మాలతీ చందూర్ సమాధానాలు చెప్పడంలో ఏ విషయాల్లో, ఎవరికి, ఏ కాలంలో, ఎందుకు సమాధానాలు చెప్పారనేది మనకు కనిపిస్తుంది. ఇక ఆమె ఎలా చెప్పారు. HOW అనేది మన గమనించాలి. అందులోంచి మనం బోలెడు పాఠాలు నేర్చుకోవచ్చు.

ఆమె సమాధానాలు చెప్పిన తీరులో ఎంత తవ్వుకుంటే అంత దొరుకుతుంది.

అన్నమయ్య తన కీర్తనలో తిరుమలేశుణ్ని స్తుతించినట్టుగా..

ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు అన్నట్టుగా..

మాలతీ చందూర్ జవాబుల్లో.. మనం నేర్చుకోగలిగితే.. వ్యక్తిత్వ గుణవిశేషాలు, మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయాలు అనేకం మనకు కనిపిస్తాయి. నేను గమనించినంత మేరకు అయిదింటిని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను.

ప్రకృతిలో పంచభూతాలు ఎలాగో, వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకం కాగల అయిదు లక్షణాలు అవి.

అధ్యయనశీలత– పరిశోధన

నిర్మమో నిరహంకార

నిష్పాక్షికత

నిర్మొగమాటత్వం

సార్వకాలీనత

1. అధ్యయనశీలత– పరిశోధన

ఒక ప్రశ్న ఒక జవాబు మనకు చాలా సింపుల్ గానే కనిపిస్తాయి. కానీ ఆ ప్రశ్నకు ఆ జవాబు చెప్పాలంటే ఎంతటి విస్తృత అధ్యయనం అవసరమో దిగితేనే తెలుస్తుంది. యూనివర్సిటీ విద్యార్థులుగా మీకు ఆ సంగతి బాగా తెలుసు. ఒక పీహెచ్డీ పూర్తిచేయడానికి ఎన్ని పుస్తకాలను అధ్యయనం చేస్తారో మీకు తెలుసు. నిజానికి మాలతీ చందూర్ సమాధానాల్లో కొన్నింటిని గమనించినప్పుడు ఆమె ఎంతో పరిశోధన చేస్తే తప్ప– ఒక చిన్న ప్రశ్నకు ఆ సమాధానం చెప్పడం సాధ్యం కాదని మనకు అనిపిస్తుంది.

ఒక ప్రశ్నను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను

ఇరాన్ లో ముల్లా ఖొమైనీ– షా ఆఫ్ ఇరాన్ మధ్య అప్పట్లో శత్రుత్వం ఉంది. దాని పర్యవసానం ఒక సినిమా థియేటర్ లో లోపల ప్రేక్షకులు ఉండగా బయట గడియపెట్టి తగలబెట్టేశారు. ఆ దుర్ఘటన గురించి అడిగినప్పుడు.. మాలతీ చందూర్.. మొత్తం ఇరాన్ లోని అప్పటి వర్తమాన రాజకీయ చరిత్రను మొత్తం వివరిస్తూ సమాధానం చెప్పారు.

ఈ సమాధానం ఈ రోజుల్లో చెప్పడం చాలా సులభం. గూగుల్ ను అడిగితే సమస్త వివరాలు చెప్పేస్తుంది. ఇంకా కావలిస్తే.. ఇలాంటి సినిమా థియేటర్ ప్రమాదంలో ప్రపంచంలో ఎన్ని, ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ జరిగాయో కూడా చెబుతుంది. కానీ.. 1979 నాటికి ఈ సమాధానం ఇంత వివరంగా చెప్పడం అనూహ్యం. తెలుగులో వచ్చే పత్రికలు, అప్పటికి అందుబాటులో ఉన్న రేడియో వార్తలు విన్నంత మాత్రాన సరిపోదు. అంతర్జాతీయ విషయాలు కూడా వివరంగా ఇచ్చే ఇంగ్లిషు పత్రికలు చదివినాకూడా.. ఈ జవాబు ఇంత సంపూర్ణంగా రాదు. ఇంగ్లిషు పత్రికల్లోనూ అనేక ఎడిటోరియల్ వ్యాసాలు, ప్రత్యేక కథనాలు కూడా చదివితే తప్ప.. ఇలాంటి సమాధానం తయారు కాదు. మనం ఒక ప్రశ్నకు చిన్న సమాధానమే చెబుతుండవచ్చు.. కానీ చేసే పని సంపూర్ణంగా ఉండాలని అనుకునే తపనలోంచి, ఎంతటి లోతైన అధ్యయనానికైనా వెరవని, వెనుదీయని తత్వాన్ని ఈ ప్రశ్నద్వారా మనం మాలతీ చందూర్ ను చూసి నేర్చుకోవాలి. ఇతరులు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పడం ద్వారా.. ఆమె అనేక సంగతులు నేర్చుకునే వారని మనం గ్రహించాలి.

మనిషిలో అధ్యయన శీలత ఉండాలి. కేవలం మన చదువులు, మన పీహెచ్డీలకు మాత్రమే కాదు. ఏ విషయంలోనైనా  మనలో నేర్చుకునే తత్వం, విద్యార్థి లక్షణం జీవితాంతం ఉండాలి. ఆ తత్వం మనల్ని ఎప్పటికప్పుడు ఉన్నతీకరిస్తుంటుంది. మనల్ని పరిపూర్ణులుగా తయారుచేస్తుంటుంది. ఆ తత్వాన్ని, వ్యక్తిత్వ లక్షణాన్ని  తనలో పదిలంగా కాపాడుకున్నారు గనుకనే.. మాలతీ చందూర్ తుదిశ్వాస విడిచిన పుష్కరం తర్వాత కూడా మనం ఆమె కృషిని గుర్తుచేసుకుంటున్నాం.

‘ఇంతనేనంటే సంద్రమెంతో యనుకొంటి.. మనకీ సూరీడుకీ మద్దెనుండేదేనా..’ అన్నదట నండూరి వారి యెంకి. స్త్రీ హృదయానికీ సముద్రానికీ ఉండే తేడా చెప్పాల్సిందిగా చంద్రగిరి నుంచి ఎవ్వరో కోరితే మాలతీ చందూర్ కోట్ చేసిన మాట ఇది.

ఆ రకంగా… మన బుద్ధికీ వికాసానికీ, ఉన్న జ్ఞానానికి– ఉండవలసిన అధ్యయనశీలతకీ మధ్యన ఉండే ప్రేరకశక్తి, స్ఫూర్తిదాయక వ్యక్తి మాలతీ చందూర్.

2. నిర్మమో నిరహంకార

భగవద్గీతలో పరమాత్ముడు ఎవరిని ఇష్టపడతారనే లక్షణాల గురించి కృష్ణుడు చెప్పినట్టుగా మనకు ఒక శ్లోకం ఉంటుంది.

నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ– అనేది శ్లోకపాదం.

ఈ శ్లోకపాదంలో తొలిసగం మనందరికీ చాలా ముఖ్యమైనది. మాలతీ చందూర్ జవాబులను జాగ్రత్తగా గమనిస్తే ఆమెలో ఆ లక్షణం పుష్కలంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మనం చేసిన పని మీద మనకు మమకారం ఉండకూడదు. మనం చేసిన పని గొప్పదని అనుకునే తత్వం మితిమీరితే వచ్చే మొదటి ఇబ్బంది ఇతరులు చేసే పనిలోని గొప్పతనాన్ని గుర్తించలేకపోవడం. అందుకే మన పనుల పట్ల మనం మమకారం తగ్గించుకోవాలి. అలాగే నిరహంకారంగా ఉండాలి. మనం చేసే పనిలో లోపం ఎవరైనా గుర్తించి చెబితే.. దానిని స్వీకరించే పరిస్థితి ఉండాలి. లోపాల్ని స్వీకరించకపోతే.. మన ఎదుగుదల ఇక్కడితో ఆగిపోతుందని మనం తెలుసుకోవాలి.

ఈ రెండు లక్షణాలు మనకు మాలతీ చందూర్ జవాబుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె చెప్పిన సమాధానాల్లో తప్పులున్నట్టుగా మరొకరు ఎవరైనా లేఖ రాస్తే.. తన తప్పులు ఒప్పుకుంటూ ఆమె ఆ లేఖలను కూడా ప్రచురించిన వైనం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నేనే కరెక్టు అనే అహంకారానికి పోకుండా, తన లోపాలు పాఠకులకు తెలిసిపోతాయనే భయం లేకుండా ఆమె వ్యవహరించడం మనం నేర్చుకోవాల్సిన లక్షణం.

ఇందుకు మనకు ఆమె నిర్వహించిన ఫీచర్ లోనే అనేక ఉదాహరణలు దొరుకుతాయి.

తన లోపాన్ని తెలియజెప్పిన వారి పట్ల కినుక వహించడం కాదు.. వారిని అభినందించడం మనం గమనించాలి. ఇలాంటివి అనేకం మనకు కనిపిస్తాయి. తన జవాబుల్లో లోపాలను, తప్పులను ఎవరు తెలియజెప్పినా.. ఆమె వాటిని గౌరవిస్తూ వచ్చారు. బహుశా చెప్పిన జవాబుల పట్ల మమకారం గానీ, తప్పులను ఒప్పుకోలేని అహంకారంగానీ లేకుండా ఉండే ఈ తత్వం బహుశా ఆమెలోని అధ్యయన శీలికి మరింత పదును పెట్టి ఉంటుంది. ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి.

निंदक नियरे राखिए, ऑंगन कुटी छवाय।

बिन पानी, साबुन बिना, निर्मल करे सुभाय।।

కబీర్ దాస్ రాసిన దోహా ఇది. మనల్ని నిందించే వారికి, విమర్శించే వారికి మన వాకిట్లోనే ఒక గుడిసె ఇచ్చి మనతోనే ఉంచుకోవాలని, వాళ్ల విమర్శల వల్ల.. నీళ్లు, సబ్బు అవసరం లేకుండానే.. మనం నిర్మలంగా తయారవుతామని కబీర్ దాస్ అంటారు.

బహుశా ఈ వ్యక్తిత్వ విశేషం మాలతీ చందూర్ కు సహజంగానే అలవాటై ఉండాలి. ఈ లక్షణం ఆమె సమాధానాలను మరింత పరిణతి రావడానికి, మరింత ఆదరణ పెరగడానికి ఆమెకు దోహదం చేసి ఉంటుంది. ఈ లక్షణాన్ని మనం కూడా అలవాటు చేసుకోవాలి.

3. నిష్పాక్షికత

మనం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి పాదాల దగ్గరున్నాం. తిరుమల వెళితే.. దేవదేవుడిని వేవేల రకాలుగా స్తుతించే భక్తుల తీరును మనం గమనిస్తుంటాం. భగవన్నా స్మరణతో నినాదాలను సర్వత్రా చూస్తుంటాం. కానీ దేవుడిని స్తుతించే మాటలలో ఒక్కటి మాత్రం నాకు నచ్చదు. ఆశ్రితజన రక్షకా అనే పదం నాకు తిరుమలేశుని గురించి సరైన వ్యక్తీకరణ కాదనిపిస్తుంది. ఆశ్రితులను మాత్రమే ఆదరించడం, వారిని కాపు కాయడం ఫ్యాక్షనిస్టు లక్షణం కదా. ‘సర్వత్ర సమబుద్ధయః’ అని కృష్ణుడు చెప్పిన లక్షణం అది కాదు కదా.. అని అనిపిస్తుంది. మనలో ఎంతో కొంత నిష్పాక్షికత ఉండాలి. మన వర్గం, మన కులం, మన ప్రాంతం అనే భావనలతో తప్పుడు పనులను సమర్థించడం, ఒక సంఘటనను విశ్లేషించేప్పుడు అనుచితమైన మొగ్గు చూపించకుండా ఉండడం ముఖ్యం.

ఈ నిష్పాక్షికత మనకు మాలతీచందూర్ జవాబుల్లో కనిపిస్తుంది. ఆమె మహిళ గనుక, ఆమె ఫీచర్ కు ప్రశ్నలు పంపేవాళ్లు, ఆదరించే వాళ్లు ఎక్కువగా మహిళలు గనుక.. మహిళా పక్షపాతంతో ఆమె సమాధానాలు ఉండవు. కొన్ని సామాజిక అంశాలను ప్రస్తావిస్తున్నప్పుడు ప్రశ్న అడిగిన మహిళలోనే లోపం కనిపిస్తే, ఆమె చెప్పడానికి ఎన్నడూ సంకోచించలేదు. మహిళా పక్షపాతి అని ఎన్నడూ అనిపించుకోలేదు. తనకు ఏది న్యాయం అని తోచిందో అది మాత్రమే తన జవాబుల్లో చెబుతూ వచ్చారు.

ఈ తత్వం ఉండాలి. సాధారణంగా మనం, మన ఫ్రెండ్స్ లో అయినా సరే.. ఎవరు వచ్చి మనతో సమస్య చెప్పుకుంటే వారు కరెక్టు అనే భావనతో ఉంటాం. ఈ తత్వం కరెక్టు కాదు. ఒక సమస్య వచ్చినప్పుడు, కనీసం మనకు ఇతరులతో విభేదాలు వచ్చినప్పుడు.. కాస్త నింపాదిగా నిష్పాక్షికంగా ఆలోచించే అలవాటు చేసుకుంటే బహుశా మన వ్యక్తిత్వం ఎంతో శోభిస్తుంది. ఎదుటి వారిలో లోపం ఉంటే ఓకే.. కానీ మనలోనే లోపం ఉందని మనం గమనిస్తే.. పైన చెప్పుకున్నట్టు నిరహంకారంగా దానిని ఒప్పుకుంటే.. అది మనకే లాభిస్తుంది.

4. నిర్మొగమాటత్వం

మనకు స్మృతులు ఒక విషయం చెబుతాయి.

సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్
నబ్రూయాత్ సత్యమప్రియం.. ప్రియం చ న అనృతం బ్రూయాత్
ఏతత్ ధర్మ సనాతనః

అంటారు.

ఎదుటివారితో నిజమే చెప్పాలి. ఎదుటివారికి ప్రీతికరంగా ఉండేదే చెప్పాలి. ఎదుటివారు ఇష్టపడేది కాకపోతే నిజాన్ని చెప్పకపోవడం మంచిది. వారికి ఇష్టం కదా అని అబద్ధం చెప్పకుండా ఉండాలి.. అని చెబుతారు. స్మృతులు ఇదే ధర్మం అని బోధిస్తాయి గానీ.. మితిమీరిన లౌక్యాన్ని ఇది మనకు నేర్పుతుంది. నిజానికి మనలో కొంచెం నిర్మొగమాటత్వం ఉండాలి. ఆ లక్షణం మన వ్యక్తిత్వానికి గౌరవాన్ని అందిస్తుంది. నిర్మొగమాటంగా మాట్లాడితే.. తొలుత ఎవరైనా నొచ్చుకున్నా.. ఆ తర్వాతనైనా మిమ్మల్ని గౌరవిస్తారు. అది నేర్చుకోవాలి.

కథలకు అవసరమైన పరిశీలనను నాకు నేర్పిన గురువు మధురాంతకం రాజారాం గారి మాట ఒకటి ఇక్కడ చెప్పుకోవాలి. ‘నేను నా భార్యను అమితంగా ప్రేమిస్తాను అని చెప్పుకునే వాళ్లను నేనెరుగుదును. కానీ.. వారి శ్రీమతి పరిస్థితి మొదటి తరగతి ఆడఖైదీ కంటె భిన్నంగా ఏమీ ఉండదు’ అని ఆయన ఓ బంగారుపొయ్యి అనే అద్భుతమైన కథలో రాస్తారు.

మనం సమాజంలో చాలా మందిని చూస్తుంటాం. భార్య మీద ప్రేమ అనే ముసుగులో అశక్తురాలిగా, పరాధీనగా తయారుచేసే వర్గం ఒకరుంటారు. ‘మా ఆయన అపరిచితుడు’ అనే ఒక కథలో నేనో ఉదంతం రాశాను. ఒక స్నేహితురాలి జీవితంలో వాస్తవ సంఘటన అది.

భర్త చనిపోయారు. ఆమెకు తన పదోతరగతి సర్టిఫికెట్ ఎక్కడ ఉన్నదో తెలియదు. కనీసం తను పదో తరగతి ఎప్పుడు చదివిందో కూడా తెలియదు.

ఇలాంటి సంగతుల్ని నిష్కర్షగా చెప్పుకోవడం అవసరం. కొంతమందికి భార్యలను మైనపు ముద్దలుగా చేయాలని ఉంటుంది అని మాలతీ చందూర్ నిర్మొగమాటత్వానికి నిదర్శనం.

5. సార్వకాలీనత

ఒక వ్యక్తి ఆలోచనలో సార్వకాలీనత ఉండడం గొప్పవిషయం. ఇవాళ్టి ఆలోచన రేపటి తరానికి కూడా మార్పు అవసరం లేనిదిగా కనిపిస్తే.. వారి దృక్పథం గొప్పది అని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి లక్షణాన్ని మనం కూడా నేర్చుకోవాలి.

కొన్ని దశాబ్దాల కిందట మాలతీ చందూర్ చెప్పిన కొన్ని సమాధానాలు చదువుతున్నప్పుడు ఆమె టైమ్ మిషిన్ లో ప్రయాణించి ఇవాళ్టి పరిస్థితులను  చూసి అలా రాశారా? అని మనకు అనిపిస్తుంది. ఆ దార్శనిక, సార్వకాలీన దృక్కోణం మనల్ని అబ్బురపరుస్తుంది.

తనకు ఎదురైన ప్రశ్నకు.. సుదీర్ఘమైన వివరాలతో గూగుల్ ను మించిన సంగతులు చెప్పి ఆమె ఒపీనియన్ కూడా జోడించి చెబుతారు. గూగుల్ మనకు ఒపీనియన్ చెప్పదు. ఇవాళ సోషల్ మీడియాకు బానిసలైన సమాజపు పరిస్థితిని ఆ రోజుల్లో ప్రస్తావించిన ఆమె గమనింపు గొప్పది.

ఇవాళ మనం సోషల్ మీడియా ఉచ్చులో బతుకులీడుస్తున్న పరిస్థితికి ఇది దర్పణం. ఇవాళ మనం సమకాలీన పరిణామాలను స్వయంగా తెలుసుకునే, విశ్లేషించుకునే, నిర్ణయాలను తీసుకునే స్థితిలో లేం. సోషల్ మీడియాలో ఎవరో వమనం చేసుకునే అభిప్రాయాలను మన బుర్రలలోకి ఎక్కించుకుని దారితప్పుతూ ఉంటాం. దాదాపు నలభై అయిదేళ్ల కిందట కూడా ఇదే పరిస్థితి.. ఆమె విశ్లేషించిన తీరు గొప్పగా ఉంటుంది.

మతమార్పిడుల గురించి, ప్రేమల గురించి రకరకాల ప్రశ్నలు వచ్చినప్పుడు.. అలాంటివన్నీ కూడా సమాజంలో అర్థన్యాయం, వర్గన్యాయం బట్టే ఉంటాయంటూ మాలతీచందూర్ సూత్రీకరించడం సార్వకాలీనతను స్ఫురింపజేస్తుంది. కులాలు, మతాలు, ప్రాంతాలు ప్రాతిపదికగా ఎన్ని గొడవలు మనకు కనిపిస్తూ ఉన్నప్పటికీ.. ఈ అంతాలు అన్నింటినీ మించి.. అర్థన్యాయం, వర్గన్యాయమే శాసిస్తుంటాయని మనం గమనించవచ్చు. ఆమె మాటల్లోని సార్వకాలీనత అపూర్వమైనది.  మనం నేర్చుకోదగినది.

కొన్ని తరాలకు చైతన్యప్రదాత, తన జవాబుల ద్వారా తార్కికమైన ఆలోచనను, జ్ఞానాన్ని కొన్ని దశాబ్దాల పాటు మహిళల మేథోక్షేత్రాల్లో విత్తినటువంటి వ్యక్తి మాలతీ చందూర్.

మాలతీ చందూర్ ను చదవడం ద్వారా, ఆమె జవాబులను బిట్వీన్ ది లైన్స్ అధ్యయనం చేయడం ద్వారా..  ఆమెలోని ఈ అయిదు వ్యక్తిత్వ గుణ విశేషాల్లో సహస్రాంశం మనకు దక్కాలని కోరుకుందాం.

నలుగురిలో మార్పు తీసుకురావడం, వారి ఆలోచనల్లోను, వారి సంస్కారాల్లోను, బుద్ధిలోనూ గుణాత్మకమైన పురోగతిని నిర్దేశించడం అనేవే గనుక.. సంస్కర్తల యొక్క లక్షణాలు అయితే.. అస్తుత సంస్కర్త మాలతీ చందూర్.

ఆమె వర్ధంతి సందర్భంగా నా మనఃపూర్వక నివాళి

చివరగా ఒక మాట చెప్పి ముగిస్తాను

ప్రమదావనం శీర్షికకింద ప్రశ్నలు జవాబులు నిర్వహిస్తున్న రోజుల్లో బాపు గారు ఒక కార్టూన్ గీశారు. ఆ కార్టూన్ ను కూడా ఆ పేజీలోనే ప్రచురించారు. మామూలుగానే, అధికారం చెలాయించే లావుపాటి భార్య, భయభక్తులతో మెలిగే బక్కపలచటి  భర్తల కార్టూన్లకు బాపు ప్రసిద్ధి. ఆ కార్టూన్ ఇలా ఉంటుంది.

భార్య హాల్లో కూర్చుని వచ్చిన ఉత్తరాలు చూస్తూ ఉంటుంది. అందులో ఓ ఉత్తరంలో సమాచారం ఇలా ఉంటుంది. ‘మాలతి గారూ.. మా ఇంటావిడతో వారానికి ఒక్కరోజైనా వంట చేయించేందుకు సలహా చెబుదురూ..’ అని! అంటే ఆ ఉత్తరాలు చదువుతున్న ఆవిడ మాలతీ చందూర్ అని మనం అనుకోవాలి. ‘మాలతి గారూ..’ అని సంబోధన సహా ఉత్తరంలో ఉంటుంది. కార్టూన్లో ఆమె దానిని చదువుతుండగా.. భర్త వంటింట్లోంచి నక్కి చూస్తుంటాడు. ఆ ఉత్తరం చూసి ఆమె దొంగచాటుగా చూస్తున్న భర్తనుద్దేశించి అంటుంది.. ‘కార్డు ముక్కకు డబ్బులెవరిచ్చారూ’ అని! అంటే పోస్టు కార్డు కు కూడా డబ్బులు లేనంత నియంత్రణలో ఆమె భర్తని అదుపాజ్ఞల్లో ఉంచుతున్నదన్నమాట.

తమాషా ఏంటంటే.. మాలతీ చందూర్ గారి ప్రమదావనం శీర్షిక మీద బాపు గారు వేసిన ఈ కార్టూన్ ను,  ఆమె పేజీలోనే ప్రచురించారు. ఆమె మీద సెటైర్ అయినప్పటికీ.. ఆమెకూడా సరదాగానే తీసుకున్నారు. ఈ కార్టూన్ లో ఇంతవరకే మనకు అర్థమవుతుంది. కానీ మాలతీ చందూర్ గారితో పరిచయం ఉన్నవారికి మాత్రమే అర్థమయ్యే మరో పంచ్ కూడా ఇందులో ఉంది. మాలతీ చందూర్ ఇంట్లో వంట చేసేవారు కాదు. ఇంట్లో ఆమె అక్క కూడా ఉండేవారు. వంట పనులన్నీ ఆమె చేసేవారు. చందూర్ వంటల పుస్తకాలు కూడా రాశారు.. గొప్ప క్రేజీగా ఆ వంటల పుస్తకాలు ఆరోజుల్లో అమ్ముడయ్యేవి కానీ, ఆమె ఇంట్లో వంట చేసేవారు కాదు. ఈ లక్షణాన్ని కూడా హాస్యస్ఫోరకంగా స్ఫురింపజేసేలా బాపు తన కార్టూన్లో చెప్పడం విశేషం.

..కె.ఎ. మునిసురేష్ పిళ్లె
99594 88088

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు
‘కథానిధి’ కథల గతితార్కిక, శిల్ప వివేచన

సాహిత్యం ఆకాశం నుంచి ఊడిపడదు. అది ఏ శూన్యం నుంచో పుట్టుకొచ్చే భావవాద స్వప్నం అంతకన్నా కాదు. ఒక దేశపు లేదా ఒక ప్రాంతపు భౌతిక, ఆర్థిక పరిస్థితుల నేల నుంచి మొలకెత్తే సజీవ సామాజిక చైతన్యమే నిజమైన సాహిత్యం. వర్గ సమాజంలో మనిషి అనుభవిస్తున్న అస్తిత్వ వేదన, సామాజిక దోపిడీ, పతనమవుతున్న మానవ సంబంధాలు, యాంత్రికమవుతున్న బతుకు చిత్రాలు… ఇవన్నీ కథా సాహిత్యానికి ప్రాథమిక ముడిసరుకులు.

ఒక కథ కేవలం వ్యక్తుల మధ్య జరిగే సంఘటనల సమాహారం మాత్రమే కాదు, అది ఆనాటి చారిత్రక, ఆర్థిక, సామాజిక గతితార్కిక వైరుధ్యాలకు సజీవ సాక్ష్యం. మార్క్సిస్టు, మానవీయ, దళిత, బహుజన, స్త్రీవాద సౌందర్యశాస్త్ర కోణాల నుంచి సాహిత్యాన్ని దర్శించినప్పుడు, ఒక కథ సమాజంలో నిరంతరం జరుగుతున్న మార్పులను ఎంత వాస్తవికంగా ప్రతిబింబించింది, శిల్పపరంగా ఎంతటి వైవిధ్యాన్ని ప్రదర్శించింది అన్నదానిపైనే దాని చారిత్రక విలువ ఆధారపడి ఉంటుంది.

భూక్యా గోపినాయక్,
99891 59196

ఈ సునిశిత విమర్శనాత్మక దృక్పథంతో చూసినప్పుడు, 9 ఆగస్టు 2026 నాటి వివిధ దినపత్రికల ఆదివారం అనుబంధాల్లోని విశిష్టమైన కథలతో కె.ఎ. మునిసురేష్ పిళ్లె సమర్పించిన “కథానిధి” సంకలనం మన సమకాలీన సామాజిక లోగిళ్లకు ఒక నిలువుటద్దంలా నిలుస్తుంది. ఈ సంకలనంలో మొత్తం 11 కథలు చోటుచేసుకున్నాయి. కార్పొరేట్ భూదాహం, వలస కార్మికుల అస్తిత్వ వేదన, పితృస్వామ్య ధిక్కారం, ఆధునిక యాంత్రిక జీవనం, సైబర్ నేరాలు, ఉపాధ్యాయుల సామాజిక బాధ్యత—ఇలా ఆధునిక మానవుడు ఎదుర్కొంటున్న ప్రతి సామాజిక పార్శ్వాన్నీ ఈ కథలు అత్యంత లోతుగా స్పృశించాయి. ఈ కథల వెనుక ఉన్న తాత్విక లోతులను, సామాజిక నేపథ్యాలను, శిల్పగత వైరుధ్యాలను అత్యంత సమగ్రంగా, నిష్కర్షగా ఒక సద్విమర్శ చేద్దాం.

1. కళింగాంధ్ర ప్రాదేశిక అస్తిత్వ పోరాటం –
కార్పొరేట్ దోపిడీపై ధిక్కారం

‘కళింగోరలు’ (రచన: అట్టాడ అప్పల్నాయుడు – తెలుగుప్రభ)

సాహిత్యం ఎప్పుడూ పీడిత ప్రజల పక్షాన నిలబడాలి. ఉత్తరాంధ్ర (కళింగాంధ్ర) ప్రజల జీవన పోరాటాలను, వారి మట్టి మీది మమకారాన్ని, నయా ఉదారవాద కార్పొరేట్ శక్తుల భూదాహాన్ని అట్టాడ అప్పల్నాయుడు తనదైన మాండలికంలో అత్యంత బలంగా చిత్రించిన కథ ఇది. ఆధునిక అభివృద్ధి పేరిట ఒక భారీ పరిశ్రమ కోసం, విమానాశ్రయం కోసం ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు పూనుకుంటుంది. కానీ తరతరాలుగా ఆ మట్టిని నమ్ముకున్న గ్రామస్తులు భూములు ఇవ్వడానికి నిరాకరిస్తారు. వారిని దారికి తెచ్చుకోవడానికి అధికార యంత్రాంగమంతా (ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ) కలిసి ఒక గ్రామ సభను ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టాలని కుట్ర పన్నుతారు. ఆ సమయంలో ఆకుపచ్చ చీరలు, ఎర్ర జాకెట్లు ధరించిన మహిళల సమూహం ‘కళింగోరలు’ సభను అడ్డుకుని, పాలకులను సూటిగా ప్రశ్నించి పారద్రోలడం ఈ కథ ఇతివృత్తం.

రచయిత అట్టాడ అప్పల్నాయుడి కలం ఎప్పుడూ కళింగాంధ్ర మట్టి వాసనను అద్భుతంగా పట్టుకుంటుంది. కథలో జోగయ్య అనే సామాన్యుడితో పాటు ‘బాహుదా’ అనే ఒక పెంపుడు కుక్క కూడా పాలకుల తీరుపై సెటైర్లు వేయడం విశేషం. “భూములు లేనోలంతా యిలాగే కవుర్లాడతారు… ఉన్నోడికి తెలుస్తాది పేగు తెగిన బాధ” అని ఆ కుక్క చేత అనిపించడం గొప్ప శిల్ప చాతుర్యం, అద్భుతమైన ప్రతీకాత్మకత. నదుల నీరు వృధాగా పోతుంటే ప్రాజెక్టులు కట్టరు, చెరకు, జనపనార మిల్లులు మూతపడితే తెరవరు, కానీ మాకు అక్కర్లేని విమానాశ్రయాలు, ఫ్యాక్టరీలు ఎందుకని కళింగోరలు అడిగిన ప్రశ్న నేటి అభివృద్ధి నమూనా పై విసిరిన ఒక బ్రహ్మాస్త్రం.

ఈ సమీక్షలోని కథలన్నింటినీ చదవడానికి ‘9 ఆగస్టు 2026 కథానిధి ఆదివారం కథలు’ సంకలనం
ఈ కింది లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి

click here

9 ఆగస్టు 2026 నాటి కథానిధి కథలపై ఈ సమగ్ర సమీక్షను యూట్యూబ్ లో వినవచ్చు

అయితే, ఒక గొప్ప కథ ఎప్పుడూ ఉపన్యాసంగా మారకూడదు. కథాకథనంలో కొన్నిచోట్ల రాజకీయ ఉపన్యాస ధోరణి ఎక్కువైంది. ముగింపులో కళింగోరలు ఒక్కసారిగా వచ్చి సభను జయించడం, అధికారులు పారిపోవడం అనేది కాస్త నాటకీయంగా అనిపిస్తుంది. వ్యవస్థాగతమైన పోలీసు, అధికార యంత్రాంగాన్ని ఎదిరించే ప్రజల పోరాటాలను మరీ ఇంత సులభీకరించి చూపించడం వల్ల, ఆ పోరాటాల వెనుక ఉండే అసలైన రక్తం, కన్నీరు మరుగున పడే ప్రమాదం ఉంది. అయినప్పటికీ, ప్రాదేశిక అస్తిత్వ రక్షణ కోసం అట్టాడ అప్పల్నాయుడు ఎత్తిన అక్షరాయుధం ఈ కథ.

2. శ్రమదోపిడీ వలయంలో
వలస బతుకుల మరణశాసనం

‘సుక్రబల్ముచు’ (రచన: కె.ఎన్. మల్లీశ్వరి – ఆదివారం ఆంధ్రజ్యోతి)

వలస కార్మికుల జీవితాల్లోని అమానవీయతను, ఆధునిక అభివృద్ధి వెనుక వారు చిందిస్తున్న నెత్తురును అత్యంత ఆర్ద్రంగా, వాస్తవికంగా ఆవిష్కరించిన కథ ‘సుక్రబల్ముచు’. జార్ఖండ్ నుంచి కొత్తవలస-విజయనగరం రైల్వే విద్యుద్దీకరణ పనుల కోసం వచ్చిన ముండారీ గిరిజన కార్మికుడు సుక్ర. భాష రాకపోవడం వల్ల అతను తోటి కార్మికుడు దండాసితో కూడా పూర్తిగా కలవలేక ఒక రకమైన పరాయీకరణకు గురవుతాడు. పాతబడిపోయిన భద్రతా బెల్టు (నడుము బెల్టు) తెగిపోయి ముప్పై అడుగుల పైనుంచి కిందపడి సుక్ర దారుణంగా మరణిస్తాడు.

కాంట్రాక్టర్ ప్రపుల్ల, అతని కొడుకు సంతోష్ ఈ శవానికి కొంత పరిహారం ఇచ్చి కేసును నీరుగార్చాలని చూస్తారు. ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ కథకు అసలైన గతితార్కిక ముగింపునిస్తాయి.

భాష రాని వలస కూలీల అస్తిత్వ వేదనను ఎంచుకోవడం రచయిత్రి సామాజిక బాధ్యతకు నిదర్శనం. ప్రతి కార్పొరేట్ అభివృద్ధి నిర్మాణంలోనూ పునాది రాళ్ల కింద నలిగిపోతున్న అభాగ్యుల గురించి తెలుగు కథ మాట్లాడుతోందనడానికి ఇదొక సాక్ష్యం. సుక్ర చనిపోయిన తర్వాత తోటి కార్మికుడు దండాసి ఆ తెగిపోయిన బెల్టును కటింగ్ ప్లేయర్ తో కోసి నీటికుంటలో పడేయడం, శవాన్ని కదిలించినందుకు మనసులో పడే తీవ్రమైన ఘర్షణ వాస్తవికతకు అద్దం పట్టింది. తోటి కార్మికులకు పని ఆగిపోకూడదన్న ఉద్దేశ్యంతో, పోలీసుల కేసుల భయంతో అతనా తప్పు చేస్తాడు. ఇది బతుకు భయం తెచ్చిన ఒక క్రూరమైన వాస్తవం.

ముగింపులో ఒక చేదు నిజం ఉంది. గిరిజన మహిళ దామికి కాంట్రాక్టర్ల మనుషులు పరిహారం ఇవ్వబోతే, ఆమె లక్ష రూపాయలకు తక్కువైతే ఒప్పుకోనని కచ్చితంగా బేరం ఆడుతుంది. సంతోష్ ఆమెకు పదివేల కట్టలు, పిల్లల చేతిలో డబ్బులు పెట్టగానే ఆమె వారి పాదాలపై పడి మొక్కుతుంది. ఈ ముగింపు అత్యంత క్రూరమైన వాస్తవికతను కళ్లకు కట్టింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒక పేద కార్మికుడి ప్రాణానికి ఉన్న వెల ఎంత తక్కువో, ఆ డబ్బే వాళ్ల పాలిట ఎంత పెద్దదో ఈ ముగింపు చెబుతుంది. ఆ కాంట్రాక్టర్ల ఔదార్యంగా కనిపిస్తున్నది వాస్తవానికి ఒక దారుణమైన దోపిడీ. సుక్ర ప్రాణానికి వాళ్లు కట్టిన వెలను తీసుకుని, ఆ నిరుపేదలు తిరిగి ఆ కాంట్రాక్టర్లనే ఆశీర్వదించి వెళ్లడం వర్తమాన సామాజిక విషాదానికి పరాకాష్ట.

అయితే కార్మికుల కష్టాలను చూపించిన తీరు బాగున్నా, రచయిత్రి కేవలం వాళ్లపై ‘సానుభూతి’ చూపించడానికే పరిమితం అయ్యారు తప్ప, వర్గ చైతన్యాన్ని చూపించలేకపోయారు.సుక్ర చనిపోగానే, అతని తోటి కార్మికుడు దండాసి యాజమాన్యాన్ని నిలదీయాలి. కానీ, కాంట్రాక్టు ఆగిపోతుందన్న భయంతో, సుక్ర మరణానికి కారణమైన ‘తెగిపోయిన నడుం బెల్టు’ను ఆధారంగా లేకుండా నీళ్లలో పారేస్తాడు. కార్మికుల్లో ఈ స్థాయి భయాన్ని, పిరికితనాన్ని ఎందుకు చూపించినట్టు? వాళ్లలో కనీస ఐక్యత లేనట్లు రాయడం శ్రామికవర్గాన్ని తక్కువ చేయడమే.

ఇక చివర్లో సుక్ర భార్య దామి, కాంట్రాక్టర్లు ఇచ్చిన డబ్బులు చూసి మురిసిపోవడం, భర్తను చంపిన వాళ్ల కాళ్లమీదే పడి పిల్లలతో సహా మొక్కడం దారుణం. రచయిత్రి దీనిద్వారా వాళ్ల అమాయకత్వాన్ని చూపి పాఠకులచేత కంటనీరు పెట్టించాలనుకున్నారు. కానీ సాహిత్యం చేయాల్సింది ఏడ్పించడం కాదు, ఎదురుతిరిగేలా ఆలోచింపజేయడం. దోపిడీకి గురవుతున్న వాళ్లకు తమను దోచుకుంటున్నదెవరో తెలిసేలా చైతన్యం నింపాలి.

మొత్తం మీద, ఈ కథ యజమానుల క్రూరత్వాన్ని ఎండగట్టింది కానీ, కార్మికులకు మాత్రం బానిస బుద్ధినే అంటగట్టింది. కూలీలు కేవలం దయకు పాత్రులైన అభాగ్యులు కారు, తమ శ్రమను దోచుకునే వ్యవస్థపై తిరగబడాల్సిన శ్రామికులు అన్న ప్రాథమిక వర్గ స్పృహ ఈ కథలో పూర్తిగా లోపించింది.

3. పితృస్వామ్య ధిక్కారం –
ఆత్మగౌరవానికి దేహపు కోత

‘చేదుకట్టు’ (రచన: చాగంటి ప్రసాద్ – సాక్షి ఫన్డే)

ఒక మహిళ తన కాళ్ల మీద తాను నిలబడే క్రమంలో పితృస్వామ్య అణచివేతను ఎలా ఛేదించిందో చెప్పే స్ఫూర్తిదాయకమైన కథ ‘చేదుకట్టు’. కోనసీమ నుంచి వచ్చిన సావిత్రి హైదరాబాద్ లోని ఒక అపార్ట్మెంట్లో పనులు చేసుకుంటూ బతుకుతుంటుంది. ఆమె భర్త సూరిబాబు పనికిమాలిన వాడు, తాగుబోతు, పైగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కు బానిస. సావిత్రి రోడ్డు మీద రొట్టెలు అమ్మి, ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు అమ్మి పిల్లలను పోషిస్తుంటే, ఆ డబ్బు కూడా వాడు బెట్టింగ్ లో తగలేస్తాడు.

ఒక దశలో సావిత్రికి గాల్ బ్లాడర్ (చేదుకట్టు) ఆపరేషన్ జరిగి మంచాన పడుతుంది. కోలుకున్న తర్వాత ఆ పనికిమాలిన భర్తను వదిలేసి, కొబ్బరి పెంకులతో చేసిన బొమ్మలను తయారు చేసి, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా అమ్ముతూ ఒక వ్యాపారవేత్తగా తన పిల్లలతో సంతోషంగా ఎదుగుతుంది.

పితృస్వామ్య సమాజంలో ఒక మగవాడు పని చేయకపోయినా, వాడికి పెళ్లాం సేవలు చేయాలనే మూస ధోరణి ఉంది. కానీ ఈ కథలో “పని చేయలేని అశక్తుడితో సర్దుకుపోవచ్చు, కానీ పని చేయదలచుకోని వాడితో ఎంతకాలం సర్దుకుపోగలం?” అన్న సావిత్రి ఆలోచనలో ఆధునిక స్త్రీ కనబరిచే పరిణతి కనిపిస్తుంది. శరీరంలో చెడిపోయిన ‘గాల్ బ్లాడర్’ (చేదుకట్టు) ను ఎలాగైతే ఆపరేషన్ చేసి తీసి పారేస్తామో, జీవితాన్ని నాశనం చేసే భర్త అనే చేదుకట్టును కూడా అలాగే కత్తిరించి పారేయాలన్న ప్రతీక కథకు అద్భుతమైన శీర్షికను, తాత్విక ముగింపును ఇచ్చింది.

అయితే, ఐదో తరగతి మాత్రమే చదివిన సావిత్రి, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లలో డిజిటల్ మార్కెటింగ్ చేసి శిల్పారామంలో ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయికి ఎదగడం అనేది కాస్త సినిమాటిక్ గా, ఫెయిరీ-టేల్ సక్సెస్ లా అనిపిస్తుంది. కార్పొరేట్ మార్కెట్ మాయాజాలంలో ఒక నిరక్షరాస్య మహిళ ఎదుర్కొనే ఆచరణాత్మక సవాళ్లను కూడా కథలో ఇమిడ్చి ఉంటే, ఆమె విజయం మరింత స్ఫూర్తిదాయకంగా, వాస్తవికంగా ఉండేది.

4. వ్యవసాయ సంక్షోభాన్ని కప్పిపుచ్చే
పితృస్వామ్య కుహనా వాదం

‘సెల్లు సిత్రం’ (రచన: అశోక్ పోతరాజు – నమస్తే తెలంగాణ బతుకమ్మ)

సాంకేతికత పల్లె జీవితాలను ఎలా ఛిన్నాభిన్నం చేస్తోందో, స్మార్ట్ ఫోన్ల వ్యసనం, సైబర్ నేరాలు ఒక రైతు కుటుంబాన్ని ఎలా బలిగొన్నాయో చెప్పే ఉద్దేశ్యంతో రాసిన కథ ఇది. మల్లేష్ ఒక కష్టపడే రైతు. అతని భార్య పద్మకు ఫోన్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడటం పిచ్చి. ఒకవైపు వానల వల్ల మల్లేష్ పంట నష్టపోయి, అప్పుల పాలై బాధపడుతుంటాడు. అదే సమయంలో, పద్మ ఫోన్లో వచ్చిన ఒక ఫేక్ లింక్ ను క్లిక్ చేసి, ఉన్న డబ్బులన్నీ సైబర్ నేరగాళ్ల వలన పోగొట్టుకుంటుంది. అప్పు ఇచ్చిన పటేల్ వచ్చి ఊర్లో వాళ్ల ముందు అవమానిస్తాడన్న భయంతో, ఆ రాత్రే మల్లేష్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ చావుకు పద్మ ఫోన్ వాడటమే కారణమని రచయిత తీర్పునిస్తాడు.

ఇది పితృస్వామ్య దృక్పథంతో రాసిన కథ. భారతదేశంలో వ్యవసాయ సంక్షోభం వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ వ్యవస్థాగతమైన దారుణాన్ని వదిలేసి, ఒక రైతు చావుకు అతని భార్య వాడే స్మార్ట్ ఫోన్ కారణం అని తేల్చడం రచయిత పరిమితమైన దృష్టికోణానికి నిదర్శనం.

అప్పుల వాళ్లు ఇంకా ఇంటికి రాలేదు, కేవలం వాళ్లు ఏమంటారో అన్న భయం కొద్దీ అతను ఉరి వేసుకోవడం అనే మానసిక స్థితిని రచయిత నమ్మశక్యంగా చిత్రించలేకపోయారు. ఆడవాళ్లు టెక్నాలజీ వాడితే సంసారాలు నాశనమైపోతాయన్న అచ్చమైన పితృస్వామ్య అహంకారం ఈ కథ నిండా కనిపిస్తోంది. ఫోన్ అనేది ఒక సాధనం మాత్రమే. నిజమైన దోపిడీదారులు బ్యాంకులను లూటీ చేస్తున్న పెట్టుబడిదారులు మరియు పల్లెల్లో వడ్డీ వ్యాపారులు. వాళ్లను వదిలేసి ఇలా ఒక సామాన్య మహిళను దోషిగా నిలబెట్టడం ద్వారా రచయిత సామాజిక వాస్తవికతను వక్రీకరించాడు.

5. నగరారణ్యంలో ఊపిరి కోసం ఆరాటం –
మధ్యతరగతి భ్రమలు

‘అద్దెకి ఆకాశం’ (రచన: సౌమ్య నిట్టల – ఈనాడు ఆదివారం)

పట్టణీకరణ, రియల్ ఎస్టేట్ విజృంభణ మధ్యతరగతి మానవుడికి ప్రకృతిని, కనీసం ఆకాశాన్ని కూడా ఎలా దూరం చేస్తున్నాయో చెప్పే సున్నితమైన కథ ‘అద్దెకి ఆకాశం’. నెలకు 50 వేల రూపాయలు సంపాదించే శ్రీధర్ కు భార్య హేమ, ఇద్దరు పిల్లలు ఉంటారు. అపార్ట్మెంట్ కల్చర్ లో పుట్టి పెరుగుతున్న తన పిల్లలకు పచ్చని మొక్కలు, సూర్యాస్తమయం, చుక్కల ఆకాశం చూపించడం కోసం నెలకు అదనంగా ఐదు వేల రూపాయలు చెల్లించి తన ఇంటి పైన ఖాళీగా ఉన్న మేడ వాటాను అద్దెకు తీసుకుంటాడు శ్రీధర్. భర్త ఆలోచన వెనుక ఉన్న లోతును అర్థం చేసుకున్న భార్య హేమ దానికి అంగీకరించడం ఈ కథ ఇతివృత్తం.

“మహానగరంలో భూమైనా సులువుగా దొరుకుతుంది కానీ ఆకాశం దొరకడం అసాధ్యం” అన్న వాక్యం ఈ కథకు ప్రాణం. కాంక్రీట్ జంగిల్ లో స్వచ్ఛమైన గాలి, వెలుతురు ఎంత ఖరీదైనవో కథ చాలా ఆర్ద్రంగా చెప్పింది. ప్రతి రూపాయిని లెక్కేసుకునే మధ్యతరగతి గృహిణి హేమ పాత్ర, ఆమెకు భర్తపై ఉన్న ప్రేమ చాలా సహజంగా చిత్రించబడ్డాయి.

అయితే, మార్క్సిస్టు కోణంలో చూస్తే ఇది పక్కా మధ్యతరగతి బూర్జువా రోమాంటిసిజం. ప్రకృతి వనరులను రియల్ ఎస్టేట్ మాఫియా కొల్లగొడుతుంటే, వాటిని అనుభవించడానికి కూడా అద్దె కట్టే స్థాయికి మనిషి దిగజారిపోయాడు. ఈ రాజీ పడటాన్ని రచయిత్రి ఒక ‘అందమైన కుటుంబ చిత్రంగా’ వర్ణించింది. దొరికిన కాడికి దోచుకునే ఇళ్ల ఓనర్ల వ్యవస్థను ప్రశ్నించకుండా, ఉన్న జీతంలోంచే కోత కోసుకుని ‘ఆకాశానికి అద్దె’ కట్టడాన్ని గొప్పగా చూపించడం సామాజిక గతితార్కికతకు విరుద్ధం. శిల్పపరంగా చూసినా, ఇదొక కథ కంటే ఒక ‘స్కెచ్’ లాగా అనిపిస్తుంది.

6. వృద్ధాప్యపు కడపటి వసంతం –
సానుకూల దృక్పథం

‘ఒకరికొకరు’ (రచన: సిహెచ్. ప్రతాప్ – విశాలాంధ్ర)

పిల్లలు విదేశాలకు వెళ్లి స్థిరపడిన తర్వాత, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొనే ఒంటరితనాన్ని చెప్పే కథ ‘ఒకరికొకరు’. రాఘవరావు, జానకమ్మ దంపతులు తమ ఆస్తులన్నీ అమ్మి కొడుకు కార్తీక్ ను అమెరికా పంపుతారు. అతను అక్కడే స్థిరపడి తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేస్తాడు. జానకమ్మకు పక్షవాతం వచ్చినప్పుడు కూడా కొడుకు రాడు. ఈ వయసులో మనకు మనమే దిక్కు అని నిర్ణయించుకున్న ఆ వృద్ధ దంపతులు, తమ శేష జీవితాన్ని పక్కింటి పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడానికి అంకితం చేస్తారు. ఒకసారి జానకమ్మ తన పుట్టిన ఊరు చూడాలనుకుంటే, రాఘవరావు ఎంతో కష్టపడి ఆమెను తీసుకెళ్లి ఆనందపరుస్తాడు.

కొడుకు రాలేదని శోకిస్తూ కూర్చోకుండా, తమ ఆనందాన్ని ఇరుగుపొరుగు పేద పిల్లలకు చదువు చెప్పడంలో వెతుక్కోవడం ఈ కథలోని గొప్ప సానుకూల అంశం. వృద్ధ దంపతుల మధ్య ఉండే పరస్పర ప్రేమను రచయిత చాలా ఆర్ద్రంగా వర్ణించారు.

కానీ, కథా వస్తువు చాలా పాతది. ఎన్.ఆర్.ఐ కొడుకులు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం అనే ఇతివృత్తం మీద ఇప్పటికే వందలాది కథలు వచ్చాయి. కథలో చెప్పుకోదగ్గ నూతన శిల్ప ప్రయోగం ఏమీ లేదు. ఇదొక సరళమైన వర్ణనాత్మక కథనంగా సాగిపోయింది. పిల్లలను ఒక ‘ఇన్వెస్ట్మెంట్’ గా చూసే పాతకాలపు ఆలోచనా విధానాన్ని ఇంకాస్త విమర్శనాత్మకంగా పరిశీలించాల్సింది.

7. ఉపాధ్యాయుని సామాజిక బాధ్యత –
ఒక ఆదర్శవాద చిత్రం

‘వెలుగుపూల దారిలో..’ (రచన: పాలకొల్లు రామలింగస్వామి – ప్రజాశక్తి స్నేహ)

ఉపాధ్యాయుల సామాజిక బాధ్యతను, వారు తలచుకుంటే ఒక విద్యార్థి కుటుంబం ఎలా బాగుపడుతుందో చెప్పే ప్రయోజనాత్మక కథ ఇది. సూర్యం మాస్టారు మరియు తోటి ఉపాధ్యాయులు రాత్రి పూట విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి చదువును పర్యవేక్షిస్తుంటారు (నైట్ విజిట్). అలా వెళ్లినప్పుడు, షణ్ముఖరావు తండ్రి (కూర్మయ్య) తాగి వచ్చి భార్య రామలక్ష్మిని కొడుతుండటం చూస్తారు. సూర్యం మాస్టారు జోక్యం చేసుకుని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించి, కూర్మయ్య మందు మానేలా చేస్తాడు. దాంతో ఆ ఇల్లు చక్కబడుతుంది, షణ్ముఖరావు ట్రిపుల్ ఐటీలో సీటు సాధిస్తాడు.

గురువు అంటే కేవలం తరగతి గదిలో పాఠాలు చెప్పి వెళ్లిపోవడం కాదు, విద్యార్థి సామాజిక నేపథ్యాన్ని కూడా బాగు చేయాలన్న సందేశం ఈ కథలో గొప్పగా ఉంది.

కానీ కథలో విలన్ (కూర్మయ్య) మారే తీరు చాలా కృత్రిమంగా ఉంది. దశాబ్దాలుగా తాగుడుకు బానిసైన వ్యక్తి, మాస్టారు ఒకసారి బెదిరించగానే పూర్తిగా మారిపోయి పదిరోజుల్లో మంచివాడైపోవడం వాస్తవికతకు దూరంగా ఉంటుంది. మద్యం అనేది ఈ ప్రభుత్వాలు కార్మిక వర్గాన్ని మత్తులో ఉంచడానికి వాడుతున్న వ్యవస్థాగత ఆయుధం. ఆ మత్తులో ఉన్నవాడికి కౌన్సెలింగ్, ఆర్థిక భద్రత కావాలి. ఒక మాస్టారు వచ్చి వార్నింగ్ ఇవ్వగానే వాడు సద్దుకుంటాడనుకోవడం అచ్చమైన బూర్జువా ఆదర్శవాదం. ఇదొక నీతి కథ వలె ముగిసింది.

8. కులాంతర, వర్గాంతర ప్రేమ –
వాస్తవికత లోపించిన శిల్పం

‘జ్యోతిర్మయం’ (రచన: రాజు యెదుగిరి – నవతెలంగాణ సోపతి)

సాంప్రదాయకమైన వివాహ వ్యవస్థలోని మూసలను బద్దలు కొడుతూ, ప్రేమకు కులం, హోదా అడ్డుకాదని చెప్పే అభ్యుదయ కథ ‘జ్యోతిర్మయం’. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన కిషోర్, తన పక్కనే బస్తీలో ఉంటూ అపార్ట్మెంట్లో పనులు చేసుకునే ‘జ్యోతి’ అనే మహిళను ప్రేమిస్తాడు. జ్యోతికి అప్పటికే చిన్న వయసులోనే పెళ్లై, ఇద్దరు పిల్లలు పుట్టి, తాగుబోతు భర్త చనిపోయి ఉంటాడు. ఆ విషయం తెలిసినా సరే, కిషోర్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడు. ఒకరోజు ఆమెకు తన ప్రేమను వ్యక్తపరుస్తాడు.

ఒక చదువుకున్న బ్రహ్మచారి, ఇద్దరు పిల్లలున్న నిరుపేద వితంతువును, అదీ ఒక పనిమనిషిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడం చాలా ప్రగతిశీలమైన ఆలోచన. కానీ శిల్పపరంగా కథ చాలా పేలవంగా ఉంది. సంభాషణలు సహజంగా లేవు. ఇద్దరు పిల్లలున్న ఒక వితంతువు, ఒక సాఫ్ట్ వేర్ యువకుడు తనను ప్రేమిస్తున్నానని చెప్పగానే వెంటనే అతన్ని కౌగిలించుకుని ఒప్పుకోవడం వాస్తవిక మానవ మనస్తత్వానికి విరుద్ధం. సమాజం, బస్తీ వాతావరణం, తన పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఆమెలో ఉండాల్సిన భయం, సంకోచం కథలో ఎక్కడా చిత్రించబడలేదు. మగవాడు వచ్చి “నేను ఉద్ధరిస్తాను” అనగానే ఆడది ఒప్పుకోవాలి అన్న పితృస్వామ్య ‘రక్షక భ్రమల’తో ఈ కథ నడిచింది.

9. వేరు పారని ఆధునిక మూలాలు –
ఎన్.జి.ఓ గ్లామర్

‘జన్మభూమి’ (రచన: ములుగు లక్ష్మీమైథిలి – వార్త)

పట్టణాల్లో స్థిరపడిన యువత తమ గ్రామాలను మర్చిపోకూడదని చెప్పే కథ ‘జన్మభూమి’. రవి అనే యువకుడు సిటీలో పెద్ద ఉద్యోగం చేస్తుంటాడు. తన ఊరిని “పల్లెటూరిలో ఏముంటుంది” అని తండ్రి దగ్గర చులకనగా మాట్లాడతాడు. కానీ, భారీ వర్షాల వల్ల ఊళ్లో పంటలు మునిగిపోయాయని తెలుసుకుని, తన స్నేహితులతో కలిసి ఊరికి వెళతాడు. తాను నడుపుతున్న ఎన్.జి.ఓ, కంప్యూటర్ డేటా ద్వారా అధికారులకు సమాచారం ఇచ్చి రైతులకు నష్టపరిహారం అందేలా చేస్తాడు.

ఆధునిక సాంకేతికతను వ్యవసాయ సంక్షోభ నివారణకు ఎలా వాడుకోవచ్చో సూచించడం అభినందనీయం. కానీ కథలో శిల్పం మచ్చుకైనా కనిపించదు. ఇది కథలా కాకుండా ఒక ప్రభుత్వ పథకం కరపత్రంలా, లేదా ఒక ఎన్.జి.ఓ బ్రోచర్ లా సాగిపోయింది. గ్రామీణ వ్యవసాయ సంక్షోభానికి మూల కారణాలను వదిలేసి, పట్నం నుంచి వచ్చిన సాఫ్ట్ వేర్ బాబు డేటా ఇవ్వగానే రైతుల కష్టాలు తీరిపోతాయని చూపించడం వాస్తవ దూరమైన విషయం.

10. వ్యక్తిగత భావోద్వేగాలు –
సామాజిక స్పృహ

‘అమ్మకు మొదటి ఉత్తరం’ (రచన: డా. డివిజి శంకరరావు – సూర్య)

ఇది ఒక కొడుకు తన చనిపోయిన తల్లికి రాసిన ఆత్మీయమైన లేఖ. హాస్టల్ లో ఉన్నప్పుడు తండ్రికి మాత్రమే ఉత్తరాలు రాసిన కొడుకు, తల్లి చేసిన నిశ్శబ్ద త్యాగాలను గుర్తుచేసుకుంటూ, అప్పట్లో ఆమెకు కనీసం “ఐ లవ్ యూ” అని చెప్పలేకపోయినందుకు పశ్చాత్తాపపడుతూ రాసిన భావోద్వేగ భరితమైన లేఖ ఇది. మానవ సంబంధాల్లోని సున్నితత్వాన్ని తాకిన కథ.

11. టీనేజ్ వయసులో పుట్టే ఆకర్షణ

‘ప్రేమయాత్ర’ (రచన: మల్లాది వెంకటకృష్ణమూర్తి – సాక్షి ఫన్డే)

టీనేజ్ వయసులో పుట్టే ఆకర్షణ, భయం, అమాయకత్వాలను తేలికగా చెప్పిన కథ ‘ప్రేమయాత్ర’. ఇంటర్ చదివే ఒక అబ్బాయి తన క్లాస్ మేట్ వాల్గంటిని ప్రేమిస్తాడు. ఆమెకు లేఖ ద్వారా ప్రేమను చెప్పాలనుకుంటాడు. కానీ వేరే క్లాసులో ఒక అబ్బాయి ప్రేమలేఖ ఇస్తే, అతను సస్పెండ్ అవ్వడం చూసి భయపడి తన లేఖను చించేస్తాడు. చివరకు వాల్గంటి స్వయంగా వచ్చి అతన్ని కాఫీకి పిలిచి తన ప్రేమను చెప్పడం కథ ముగింపు. మల్లాది మార్క్ సరళమైన కథనం ఉన్నప్పటికీ, సమాజం అనేక సంక్షోభాల్లో ఉన్నప్పుడు ఇలాంటి తేలికపాటి కథల వల్ల ఎలాంటి సామాజిక ప్రయోజనం ఉండదు.

వస్తు విస్తృతి – శిల్ప లేమి

‘కథానిధి’ సంకలనంలోని ఈ 11 కథలను గతితార్కిక కోణంలో పరిశీలించిన తర్వాత నాకనిపించిన దార్శనికత ఏమిటంటే—నేటి తెలుగు కథ తన వస్తువును ఎంచుకోవడంలో చాలా ముందుంది. సైబర్ నేరాలు, కార్పొరేట్ భూసేకరణ, వలస కార్మికుల మరణాలు, అపార్ట్మెంట్ కల్చర్, పితృస్వామ్య ధిక్కారం వంటి అత్యంత సమకాలీన అంశాలను కథకులు సాహసోపేతంగా పట్టుకుంటున్నారు.

కానీ, శిల్పం పరంగా చూస్తే అనేక కథలు ఇంకా పాతకాలపు నాటకీయత, కృత్రిమ ముగింపుల నుండి బయటపడలేదు. ఒక సామాజిక సమస్యను లేవనెత్తినంత బలంగా, ఆ సమస్య తాలూకు పరిష్కారాన్ని లేదా మానసిక సంఘర్షణను వాస్తవికంగా చిత్రించడంలో కొందరు రచయితలు తడబడ్డారు. తాగుబోతులు రాత్రికి రాత్రే మంచివాళ్లు అయిపోవడం, అనుకున్న వెంటనే వ్యాపారాలు సక్సెస్ అయిపోవడం వంటివి సీరియస్ కథల విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. బూర్జువా సెంటిమెంట్ల కన్నీళ్లు తుడవడం మానేసి, కార్మిక వర్గపు చెమటను, రక్తాన్ని నిజాయితీగా అక్షరాల్లో పెట్టడం రచయితలు నేర్చుకోవాలి.

అయినప్పటికీ, ఈ ‘కథానిధి’ సంకలనం తెలుగు కథ బతికే ఉంది, అది కాలపు గాయాలకు మందు రాస్తూనే ఉంటుంది అని నిరూపించింది. కార్పొరేట్ భూదాహాన్ని ప్రశ్నించే దమ్ము, అహంకారపు చేదుకట్టును కోసిపారేసే ఆత్మగౌరవ ధిక్కారం తెలుగు కథకు ఉన్నంత కాలం… సమాజానికి అక్షరాలే అసలైన కాపలాదారులు!

యూట్యూబ్: గన్నవరపు నరసింహమూర్తి కథ ‘సముద్రం’
ఆకుల మల్లేశ్వరరావు స్వరంలో

గన్నవరపు నరసింహమూర్తి కథ ‘సముద్రం’

ప్రచురణ ఈనాడు ఆదివారం, 16 ఆగస్టు 2026

9.8.26 కథానిధి : భూక్యా గోపీ నాయక్ సమీక్ష
9 ఆగస్టు 2026 ‘‘ఆదర్శిని కథానిధి’’  కథలపై

భూక్యా గోపి నాయక్ సమగ్ర సమీక్ష

16.8.26 కథానిధి : వెంకటేష్ పాత్రుని సమీక్ష
16 ఆగస్టు 2026 కథానిధి కథలపై

వెంకటేష్ పాత్రుని సమీక్ష

యూట్యూబ్: చాగంటి ప్రసాద్ కథ చేదుకట్టు
ఆకుల మల్లేశ్వరరావు స్వరంలో

చాగంటి ప్రసాద్ కథ ‘చేదుకట్టు’

ప్రచురణ సాక్షి ఫన్ డే

యూట్యూబ్: కె.ఎన్.మల్లీశ్వరి కథ ‘సుక్ర బల్ముచు’
ఆంధ్రజ్యోతి ఆదివారం లో ప్రచురితమైన కెఎన్ మల్లీశ్వరి కథ ‘సుక్ర బల్ముచు’

తన స్వరంలో అందిస్తున్న వారు ఆకుల మల్లేశ్వరరావు

నాట్ ఎ హేట్ స్టోరీ (ప్రసేన్) కథా సమీక్ష: పోతుల కృపాకర్
ఇద్దరు వివాహితుల మధ్య కలిగిన ఆకర్షణ, దాని పర్యవసానంగా వారిలో తలెత్తిన సంఘర్షణ (internal conflicts)… వీటి గురించిన కథ ఇది. విషయం కొత్తది కాకపోయినా, దాన్ని అందంగా, కవితాత్మకంగా తీర్చిదిద్దిన రచయితను అభినందించాల్సిందే. రెండు వివాహిత హృదయాల్లో మొలకెత్తిన ప్రేమకూ, రూఫ్‌టాప్ గార్డెన్‌లో నియంత్రిత వాతావరణంలో పెంచే మొక్కలకూ మధ్య పారలెల్స్ డ్రా చేసిన తీరు బాగుంది.

కథలో మలుపులూ లేవు. ఎపిఫనీ లేదు. ఒక బాగా నడిచిన బాటలోనే (a well trodden rut) సాగి, చివరికి మధ్యవయస్కులైన (ఇది నా ఊహ మాత్రమే) ప్రేమికులిద్దరూ శత్రువులుగా కాక, స్నేహితులుగా విడిపోవడంతో విడిపోవడంతో ముగుస్తుంది. ఆ విధంగా కథా శీర్షికను జస్టిఫై చెయ్యడం కూడా జరిగింది .

కాకపోతే కథలో సంభాషణలు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులైన స్త్రీ, పురుషుల మధ్య సహజంగా జరిగే సంభాషణల్లా కాకుండా, ఇద్దరు మేధావుల మధ్య జరిగిన చర్చల్లా బరువుగా అనిపించాయి. ఇద్దరు ప్రేమికుల మధ్య సంభాషణలు ఇంత శక్తివంతంగా, ఇంతటి మేధస్సుతో నిండినవిగా ఉండటం కొంచెం అసహజంగా, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది కథలో రీడబిలిటీని కొంత దెబ్బతీసినట్టు నాకనిపించింది.

అయితే దీనికంటే ముఖ్యమైన అభ్యంతరం మరొకటి ఉంది నాకు.

ప్రొటాగోనిస్టులిద్దరి మధ్యా ఒక ‘భావోద్వేగపరమైన సాన్నిహిత్యం కొరకు ఆరాటం’ (yearning for emotional connect)… దీనికి తగిన కారణం (trigger) కనబడలేదు కథలో.

ఒక పురుషుడికి గాని ఒక స్త్రీకి గాని జీవితభాగస్వామి నుంచి భావోద్వేగపరమైన తోడ్పాటు (emotional bonding) లభిస్తున్నంత వరకూ ఇంకొకరి దగ్గర దాని కొరకు వెతుకులాడాల్సిన అవసరం ఎందుకు కలుగుతుంది? అలా వెతుకులాడేవారి వైవాహిక జీవితంలో ఏదో ఒక అసంతృప్తి(emotional or physical vacuum) ఉండి తీరాలి… అన్నది నా అభిప్రాయం. అలా ఉన్నప్పుడే అలాంటి అన్వేషణకు అంకురార్పణ జరుగుతుందని కూడా నా నమ్మకం. అయితే, వారిలో అటువంటి లోటు ఉన్నట్టు establish చేసే ప్రయత్నం కనబడలేదీ కథలో. అంతేకాకుండా ప్రోటగోనిస్టుల జీవితభాగస్వాములు ఇద్దరూ, చాలా పరిణతి ఉన్న వ్యక్తుల్లానే చిత్రించబడ్డారు తప్ప, వేరే విధంగా కాదు.

వాళ్ల మధ్య ఆకర్షణ ఏర్పడిన తర్వాత దాన్ని గుర్తించడం, దాన్ని కొనసాగించడం అనారోగ్యకారకం అని తెలుసుకొని దాన్ని తుంచిపారెయ్యడం… దీన్ని రిజర్వాయర్‌ గేట్లు తెరవడం అనే ఇమేజ్/మెటాఫర్ ద్వారా వ్యక్తం చేయడం… ఇది ఇది ఈ కథకు ఉన్న అత్యంతబలమైన కోణం.

మొత్తానికి, విషయం పాతదే అయినప్పటికీ, కథనం, శైలీ, మొక్కలతో చేసిన పోలికలు, రిజర్వాయర్‌ సింబాలిజం కథను అందంగా తీర్చి దిద్దాయి. కాకపోతే, కథలో సంఘర్షణను చిత్రించిన తీరు బలంగా ఉన్నా, అంత బలమైన సంఘర్షణకు దారితీసిన నేపథ్యం మాత్రం బలంగా ఎస్టాబ్లిష్ చేయబడకపోవడం ప్రధానలోపంగా అనిపిస్తుంది.

16.8.26 : ఆదర్శిని కథానిధి
9 ఆగస్టు 2026 ఆదివారం అనుబంధాల్లోని కథల సంకలనం

ఆదర్శిని కథానిధి పీడీఎఫ్ కోసం

కింది లింక్ క్లిక్ చేయండి

KATHANIDHI Adivaram Kathalu 20260809 new

సుక్ర బల్ముచు, చేదుకట్టు కథలపై సమీక్ష
వెంకటేష్ పాత్రుని సమీక్షలు:

కె.ఎన్. మల్లీశ్వరి కథ – సుక్ర బల్ముచు

ఈ కథ ప్రారంభంలోనే ఒక భారీ canvas మీద మొదలవుతుంది. Larger-than-life theme నుంచి ఒక్కసారిగా realityలోకి తీసుకొచ్చిన విధానం ఊహకు అందనిది. పెళ్లయి, ఇద్దరు చిన్న పిల్లలున్న ఒక యువకుడు రాష్ట్రం కాని రాష్ట్రంలో, భాష రాని ప్రాంతంలో పడే కష్టాలను అత్యంత సహజమైన పద్ధతిలో present చేశారు మల్లేశ్వరి గారు.

శుక్ర nidra లేవాల్సిన అవసరం, ప్రపుల్ల నిద్ర లేచిన విధానాన్ని వివరించే క్రమంలోనే రచయిత్రి తాను ఏం చెప్పాలనుకుంటున్నారో చాలా స్పష్టంగా తెలియజేశారు. నిజానికి ఈ కథలో ఉన్న beauty ఏమిటంటే—కథ ప్రారంభమైన నాలుగో పేరాకే ఇది ఎటు వెళ్తుందో కొంతవరకు తెలుస్తున్నప్పటికీ, తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను కలిగిస్తూ కథ ముందుకు సాగుతుంది. ఈ విషయంలో మల్లేశ్వరి గారు ఎప్పుడూ నిరాశపరచరు.

ఈ మధ్యకాలంలో ఆవిడ రాసిన, సాక్షిలో ప్రచురితమైన ‘రసోన్మాది’, ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘మహాతలం’ కూడా ఇలాంటి కలవరపరిచే చావులను, వాటి చుట్టూ ఉన్న grey areasను పట్టుకునే ప్రయత్నం చేస్తాయి.

ఇకపోతే, ఈ కథలో ప్రతి ఒక్కరిలోనూ ఒక స్వార్థం కనిపిస్తుంది. కొంతమందిది కడుపు నిండిన డబ్బు స్వార్థమైతే, దండాసి లాంటి వారిది కడుపు కాల్చుకోలేని ఆకలి స్వార్థం.

ఇందులోని సంతోష్ character విషయానికి వస్తే, ఉత్తరాంధ్రలో వాడుకగా వినిపించే “ఈ సమాజంలో ఇలాంటి కుర్రాడు పైకొస్తాడు” అనే నానుడి గుర్తొచ్చింది.

కథలోని సంభాషణలు అత్యంత సహజంగా ఉండటం కథను మరో నాలుగు మెట్లు పైకి ఎక్కించింది. పాత్రలు మాట్లాడుతున్నట్టుగా కాకుండా, మన చుట్టూ ఉన్న మనుషులు నిజంగా మాట్లాడుతున్నట్టుగా అనిపించడం కథకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది.

ఈ కథలో negative thing ఏదైనా ఉందంటే, అది దామి మరియు ఆమె తండ్రి characters కేవలం వచ్చి వెళ్లినట్టుగా ఉండటం. భర్తను కోల్పోయిన గిరిజన మహిళ వేదనను మరికొంచెం బాగా establish చేసి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం.

మొత్తంగా, కథ ఎటు వెళ్తుందో ముందుగానే కొంత అర్థమైనప్పటికీ, ఆ ప్రయాణాన్ని ఆసక్తికరంగా, సహజంగా, ఎక్కడా పట్టు సడలకుండా నడిపించిన తీరు నాకు బాగా నచ్చింది.

చాగంటి ప్రసాద్ కథ – చేదుకట్టు

ఈ కథకు ‘చేదుకట్టు’ అనే పేరు ఎందుకు పెట్టారో కథ 80 శాతం పూర్తయ్యే వరకు తెలియకపోవడం ఈ కథకు ఉన్న మొదటి బలం.

నిజానికి ఈ కథ చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సావిత్రి, ఆమె భర్త వంటి పాత్రలు ఈ రోజుల్లో కోకొల్లలు. పని చేయకుండా సోమరిగా ఉండటమే కాకుండా, ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో ఇతరులను కూడా చెడగొట్టే మనస్తత్వం ఉన్నవారిని మన చుట్టూ చాలామందిని చూస్తుంటాం.

రోజంతా పని చేసి ఇంటికి వచ్చేసరికి, ఇంట్లో ఉన్నవారు సహాయం చేయకపోగా మొబైల్‌లో కాలక్షేపం చేయడం వంటి పరిస్థితులు నేటి సమాజానికి అద్దం పడుతున్నాయి.

ఎలాంటి జీవితంలోనైనా ఒడిదుడుకులు తప్పవు. అయితే వాటిని మనం ఎలా అధిగమిస్తామో చూపించే క్రమంలో, సావిత్రి ‘చేదుకట్టు’ను జయించిన విధానాన్ని రచయిత చాలా చక్కగా ఆవిష్కరించారు.

ఈ మొత్తం కథలో నాకు కొంత అసంతృప్తి కలిగించిన అంశం ఏదైనా ఉందంటే, అది కథ సాగిన తీరు. కథనం చాలా వేగంగా సాగుతూ, తక్కువ సమయంలోనే చాలా సంఘటనలు జరిగిపోతున్నట్లుగా అనిపించింది. ఈ విషయంలో రచయిత తన తదుపరి కథల్లో మరింత పకడ్బందీగా కథనాన్ని నడిపిస్తారని ఆశిస్తున్నాను. వాస్తవిక సంఘటనలను కథా రూపంలో అందించారు.